శ్రీకాకుళం

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. గతేడాదిని పరిశీలిస్తే ఈ ఏడాది 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. 2013-14లో 65శాతం ఉత్తీర్ణత సాధించగా, 2014-15లో 65శాతం సాధించారు. 2015-16లో 67శాతం కాగా, 2016-17 సంవత్సరంలో 72శాతం సాధించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచారు. జిల్లాలో 25,586మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 7,034మంది పరీక్షల్లో ఫెయిలయ్యారు. బాలురు 8643మంది పరీక్షకు హాజరుకాగా, 69శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,905మంది పరీక్షకు హాజరుకాగా, 76శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 24,697మంది పరీక్షలకు హాజరుకాగా, 16,635మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 12,304మంది హాజరుకాగా 7,980 మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 12,393 మంది హాజరుకాగా, 8655మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులదే హవాగా ఫలితాలు నిలిచాయి. ఒకేషనల్‌కు 1535మంది పరీక్షకు హాజరుకాగా 1270మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి ఈ ఏడాది 29,380మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 16933 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 58శాతం ఉత్తీర్ణత వచ్చింది. 14476మంది బాలురు 14,904మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 7,673మంది బాలురు, 9260మంది బాలికలు ఉత్తీర్ణత పొందారు. స్థానిక నారాయణ కళాశాలలో బైపిసి చదువుతున్న ఉంగటి దేవిచాందిని 985 మార్కులు సాధించి జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచింది. చాందినికి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మిఠాయిలు తినిపించారు. మే 15వతేదీన అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఉంటుందని ఆర్ ఐఓ వరప్రసాదరావు తెలియజేశారు.