శ్రీకాకుళం

సమసమాజ స్థాపన జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 14: సమసమాజ స్థాపన జరగాలని రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా, చేనేత జౌళి శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అచ్చెన్న మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన సభలో మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికారులు మాట్లాడారు. సభా కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అచ్చెన్న ప్రారంభించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. అంబేద్కర్ పట్టువిడువని మహనీయుడన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆశయసాధనకు వెనుకంజ వేయలేదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సమసమాజ స్థాపన జరగాలని, అందుకు సమష్ఠిగా కృషి చేయాలన్నారు. అమరావతిలో 20 ఎకరాల్లో స్మృతివనంను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని, అందులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తుందన్నారు. స్మృతివనం అంబేద్కర్ మహనీయుని గురించి తెలుసుకునే విజ్ఞాన కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంబేద్కర్ విద్యపై దృష్టిసారించారని, అనుకున్నది సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సంక్షేమ శాఖలన్నీ ఒక గొడుగుకింద ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. విద్యార్థులకు మెస్‌ఛార్జీలను పెంచాలని ముఖ్యమంత్రిని కోరామని, అందుకు తగిన ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. బిసిల అభివృద్ధికి రూ.15వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి మంచి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ సజీవుడన్నారు. ప్రభుత్వం, అధికారులు అన్నీ చేయాలనే చెడు అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారన్నారు. హక్కుల కోసం పోరాడతామని బాధ్యతను మరిచిపోతున్నారన్నారు. బాధ్యతను నిర్వర్తించినప్పుడు సమసమాజ స్థాపన చేయగలమన్నారు. ఎదుటివారిని గౌరవించడం, సహాయం చేయడం వలన సమసమాజ స్థాపనకు నాంది పలకవచ్చునన్నారు. ప్రతీ వెనుకబడిన కులం అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ భారతరాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా అందరూ కృషి చేయాలన్నారు. పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ నవ భారతావనికి రూపకల్పన చేశారన్నారు. ఆయన ఆశయాలు పవిత్రమైనవని, వాటి కార్యాచరణకు రథసారధలుగా ఉండాలన్నారు. భారతదేశ ఐక్యతకు ప్రతిరూపంగా ఉన్న వ్యక్తి అంబేద్కర్ అన్నారు. శాసనమండలి సభ్యుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరు తారకమంత్రం వంటిదన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో సమసమాజ ఉద్దరణకు అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఆశయసాధనకు ఉన్నత చదువులు చదివారన్నారు. విద్యతోనే సాధించగలమని ఆయన నిరూపించారన్నారు. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ప్రభావితం చేసిన వ్యక్త్తి అంబేద్కర్ అన్నారు. ఆయన మరో దశాబ్ధం జీవించి ఉంటే ఆయన కలలు ఆనాడే చాలా మేరకు సాకారమై ఉండేవన్నారు.
సమావేశంలో దళిత సంఘ నాయకులు ఎస్‌వి రమణమాదిగ, బొడ్డేపల్లి నర్శింహులు, కంట వేణు, బోసి మన్మధరావు, పోతల దుర్గారావు మాట్లాడుతూ రాజకీయాల్లో రిజర్వేషన్లు అమలుచేయాలని, ఔట్‌సోర్సింగ్ విధానం తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దపాడు గురుకుల విద్యార్థులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలను పొందారు. ఎస్సీ లబ్ధిదారులకు ఆస్తుల పెంపకంలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన స్టాల్‌ను మంత్రి సందర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.26.25కోట్ల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 243మంది లబ్ధిదారులకు రూ.79.77లక్షలతో ఫిష్ సీడ్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను, మోటారు వాహనాలు, సైకిళ్లు, వలలు, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు. డిఆర్‌డిఏ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, ఉద్యానవన శాఖలు ప్రదర్శన స్టాల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్సీ లబ్ధిదారులకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దళిత సంఘాల నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.్ధనుంజయరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి కె.వి ఆదిత్యలక్ష్మీ, మత్స్యశాఖ ఉపసంచాలకుడు డాక్టర్ కృష్ణమూర్తి, ఆర్డీవో బలివాడ దయానిధి, వయోజన విద్య ఉపసంచాలకుడు జి.కృష్ణారావు, దేశంపార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, స్వామి శ్రీనివాసానంద, దీర్ఘాశి సూర్యనారాయణ, మోహనరావు, డాక్టర్ కె.అమ్మన్నాయుడు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కె.విపిఎస్ గణేష్, సింహాచలం పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను విగ్రహం కింద
పాతిపెట్టేలా ప్రభుత్వాల పాలన

* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్‌అంబేద్కర్ ఆశయాలను ఆయన విగ్రహంకిందే పాతిపెట్టే ప్రయత్నాలు ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నాయని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైకాపా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో చూపించిన ప్రకారం దళితులకు వసతులు సమకూరడం లేదన్నారు. రా జ్యాంగంలో ఉన్నవాటిని ప్రభుత్వాలు చేత అమలు చేయించగలగాలన్నారు. రాష్ట్రంలో గిరిజన అడ్వయిజరీ కమిటీని మూడేళ్లయినా ఏర్పాటు చేయలేదన్నారు. దళిత కుటుంబాలకు ఒక్క ఇల్లు నిర్మించలేదన్నారు. క్రమశిక్షణ, లక్ష్యం ఉందంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. ఆశయం కోసం పనిచేసే వారు కావాలన్నారు. బలహీనులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నారు. శుక్రవారం కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉందని, ఇదేస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వైకాపా బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేదల పార్టీ అని ధర్మాన అన్నారు. ఆ దిశగా పనిచేస్తే వాస్తవంగా అంబేద్కర్‌కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకొన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి, హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పొన్నాడ రుషి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అంధవరపు వరం, ఎంవి పద్మావతి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయరావు, అంధవరపు సూరిబా బు, ముంజేటి కృష్ణ, సూర్యనారాయణ, మూకళ్ల తాతబాబు, గొర్లె కృష్ణమూర్తి , టి.కామేశ్వరి పాల్గొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తికి
భిన్నంగా ప్రభుత్వ పాలన
* యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన, విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్‌అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని ఎన్జీవో హోమ్‌లో యుటిఎఫ్ ఆధ్వర్యంలో జయంతి వేడుక నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రెడ్డి మోహనరావు అధ్యక్షతన సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి దేశ, రాష్ట్ర పాలకులు పరిపాలన చేస్తున్నారని, దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కాలరాయబడుతున్నాయని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణకు, లౌకికతత్వాన్ని రక్షించేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, కె.కామేశ్వరరావు, బి.శ్రీరామమూర్తి, ఎం.వాగ్దేవి, పొందూరు అప్పారావు, ఎస్.కిషోర్‌కుమార్, జి.రామలక్ష్మీ,పి.్ధర్మారావు, చిట్టిబాబు, విజయకుమారి, సుశీల, వెంకటరావు, బాబూరావు, శ్రీరామమూర్తి, ఉమాశంకర్ పాల్గొన్నారు.

హిజ్ర దారుణ హత్య
* గోనెసంచిలో మృతదేహం లభ్యం
కంచిలి, ఏప్రిల్ 14: కంచిలి పోలీసుస్టేషన్ కూతవేటు దూరంలో హిజ్ర దారుణ హత్య శుక్రవారం ఉదయం కంచిలిలో కలకలం రేపింది. నిత్యం జనసంచారం ఉండే భగవతికాలనీలో ఈ సంఘటన జరగడం స్థానిక ప్రజలు భయాందోళనలకు గురైనారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం శుక్రవారం ఉదయం కాలనీ ఇళ్లుమధ్య తుప్పల్లో ఉన్న గొనెసంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గొనెసంచి తెరిచి చూసే పోలీసులకు మృతదేహాన్ని గమనించి పరిశీలించి, మృతదేహాన్ని హిజ్రగా గుర్తించారు. ఇటీవల కాలంలో సంఘటన జరిగిన స్థలం ప్రక్కనే ఒడిశాకు చెందిన హిజ్రలు నివాసం ఉండడంతో వారిని పిలిచి విచారించగా, మృతదేహం పూర్తిగా పాడవ్వడంతో గుర్తించలేమని చెప్పారు. ఈ సంఘటన 11వతేదీ రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూరినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిమాపక వారోత్సవాలు ఆరంభం
* జెండా ఊపిన మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం, ఏప్రిల్ 14: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి ఇక్కడ అంబేద్కర్ కూడలివద్ద అగ్నిమాపకశాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి వారోత్సవాలను ఆరంభించారు. అగ్నిప్రమాదాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. వేసవి తీవ్రంగా ఉందని, ఈ సమయంలో అగ్నిప్రమాదాలు జరగడానికి అస్కారం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇళ్ళల్లో వంట చేసేటప్పుడు లేదా ఇతర సమయాల్లో, విద్యుత్ ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమన్నారు. ఎటువంటి సహాయానికైనా అగ్నిమాపక వాహనాన్ని ప్రజలు ఫోన్ చేయాలన్నారు. అగ్నిపాపక వారోత్సవాలు ఈనెల 20వతేదీ వరకూ జరుగుతాయని చెప్పారు. వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన కార్యకమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు, విపత్తులలో చేపట్టే కార్యక్రమాలకు సంసిద్ధలుగా ఉన్నామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విప్ కూన రవికుమార్, జెడ్పీ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎం.పి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ మాధవన్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రశాంత్‌కుమార్, అగ్నిమాపక అధికారి కె.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ఆచార్య చంద్రయ్య ఆదర్శవంతుడు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 14: బడుగు, బలహీనవర్గాలకు చెందిన అంబేద్కర్ వర్శిటీ ఇన్‌ఛార్జి విసి ఆచార్య ఎం.చంద్రయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని వక్తలు కొనియాడారు. ఎచ్చెర్ల ఎస్సీ కాలనీలో జైభీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి చంద్రయ్యను ఘనంగా సత్కరించారు. అనేక సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తిగా చంద్రయ్య నిలుస్తూ నేటి విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. అంబేద్కర్ వర్శిటీనీ ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఆయనకు దక్కడం విద్యార్థులు చేసుకున్న అదృష్టమన్నారు. సేవలే పరమావధిగా విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మెండ రాజారావు, ఎంపిటిసి జరుగుళ్ల విజయలక్ష్మీ శంకరరావు, ఎస్‌ఐ సందీప్‌కుమార్ పాల్గొన్నారు. జైభీమ్ సంఘ సభ్యులు ఎన్.సూర్యారావు, పట్నాన మసీదు, ఇనప రాజారావు, తండ్యాల లక్ష్మణరావు ఇన్‌ఛార్జి విసి చంద్రయ్యను ఘనంగా సత్కరించారు.

సి.ఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం

శ్రీకాకుళం, ఏప్రిల్ 14: గుండె నొప్పితో బాధపడి శస్తచ్రికిత్స చేయించుకున్న దమ్ముల సదానందరావుకు సి.ఎం సహాయనిధి నుంచి రూ.1.15, 800 మొత్తాన్ని చెక్కు రూపంలో ఎం.పి రామ్మోహన్‌నాయుడు శుక్రవారం ప్రజాసదన్‌లో అందజేశారు. శ్రీకాకుళానికి చెందిన సదానందరావు కుటుంబ పరిస్థితి తెలుసుకున్న రామ్మోహన్‌నాయు డు సి.ఎం సహాయనిధి నుంచి మం జూరుకు ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకే సిఎం సహాయనిధి ఏర్పాటు చేశారని, ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కొమనాపల్లి నీటి పథకానికి రూ.28 కోట్లు మంజూరు
సారవకోట, ఏప్రిల్ 14: నియోజకవర్గంలోని సారవకోట, జలుమూరు మం డలాలలో నిరంతరం తాగునీరు సరఫరా చేసేందుకు కొమనాపల్లి లో భారీ రక్షితమంచినీటి పథకం నిర్మాణానికి పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ రూ.28 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రకటించారు. మండలంలోని సవరడ్డపనస గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నీటి పథకం మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నరసన్నపేట సభలో హామీ ఇచ్చారని, తండ్రి ఇచ్చిన హామీని మంత్రి హోదాలో తనయుడు లోకేష్ నెరవేర్చాడని ఎమ్మెల్యే రమణమూర్తి చెప్పారు. త్వరలో మినీ రిజర్వాయర్‌గా మారనున్న రంగసాగరం చెరువులో నీటిని శుద్దిచేసి ఎగువన ఉన్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. సవరడ్డపనస ఎస్సీ కాలనీలో సామాజిక భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. సమైఖ్య జీవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి దాతగా నిలిచారని అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో హక్కులను కాపాడుకుంటూ శాంతియుత జీవనానికి రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలను ఆచరించవల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ ప్రతినిధి సింహాచలం, మండల పార్టీ అధ్యక్షుడు సాదు కృష్ణారావు, పార్టీ నాయకులు ఉమామహేశ్వరరావు, వరుదు రాఘవరావు, చిన్నాల అప్పన్న, చీడి వెంకటరమణ, తర్ర లచ్చుముడ, సారవకోట రామారావు, పోలూరు కృష్ణమూర్తి కత్తిరి వెంకటరమణ పాల్గొన్నారు.

రాయితీపై పాతరగడ్డి సరఫరా
ఎచ్చెర్ల, ఏప్రిల్ 14: కరవు మండలం కావడంతో పాడి పశువులు, దుక్కి పశువులు పోషణనిమిత్తం ప్రభుత్వం రైతులకు రాయితీపై పాతరగడ్డిని సరఫరా చేస్తుందని ఎచ్చెర్ల పశువైద్యాధికారిణి అనుపమ తెలిపారు. శుక్రవారం సంతసీతారాంపురం, జరజాం గ్రామాల రైతులకు పాతరగడ్డి సరఫరా చేశారు. కిలో రూ.2చొప్పున గడ్డిని సరఫరా చేస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న రైతులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇటీవలి పశుదాణా సరఫరా చేసి పాడి పశువులు పాల ఉత్పత్తులు తగ్గకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వేసవిలో పశువుల సంరక్షణపై రైతులు మరింత శ్రద్ధ కనబర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు గాలి వెంకటరెడ్డి, తంగి మల్లేశ్వరరావు, గోపాల్ పాల్గొన్నారు.