శ్రీకాకుళం

గ్యాస్ వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 15: గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీ, ఎస్‌విసి థియేటర్, ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలు ఎల్‌పిజి సిలిండర్ల వినియోగంలో అజాగ్రత్త వలన ఇంధనం వినియోగంలో అజాగ్రత్త వలన జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎల్‌పిజి సిలిండర్లు వినియోగించినప్పుడు కిటికీలు తీసి ఉంచాలన్నారు. సిలిండర్ వినియోగంలో లేనప్పుడు మూత వేసి ఉంచాలన్నారు. గ్యాస్ లీకైనప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయకూడదని ఆయన పేర్కొన్నారు. ఆన్ చేసిన తక్షణం అగ్నిప్రమాదం సంభవిస్తుందని చెప్పారు. ఎలక్ట్రిక్ మెయిన్‌ను ఆఫ్ చేయడం శ్రేయస్కరమన్నారు. తక్షణం అగ్నిమాపక డీలరుకు సమాచారం అందివ్వాలన్నారు. సినిమా హాల్‌లో విధిగా అగ్నిమాపక యంత్రాలు ఉండాలన్నారు. సినిమా హాల్‌లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా సురక్షితంగ బయటకు వెళ్లాలో ప్రేక్షకులకు వివరించారు. వివిధ సందర్భాల్లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలను ప్రదర్శించి చూపించారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనుబాబు, ఆర్టీసీ డిపో మేనేజర్లు ఢిల్లీరావు, అరుణకుమారి, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులపై ప్రజావేదిక
జి.సిగడాం, ఏప్రిల్ 15: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జి.సిగడాం మండలంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంపిడివో మోహన మురళీకుమార్ అధ్యక్షతన తనిఖీలు నిర్వహించారు. మండల పరిధిలో గల 31 గ్రామ పంచాయతీలకు సంబంధించి 64 గ్రామాల్లో 2016 మార్చి నుండి 2017 ఫిబ్రవరి వరకు ప్రభుత్వ ధనాన్ని 12కోట్ల వ్యయంతో 1250 పనులపై ఆడిట్ నిర్వహించారు. మండలంలో 23,500 వేతనదారుల్లో 11,500మంది జాబ్‌కార్డులు ఉన్నట్లు ఏపివో తెలిపారు. ఈ తనిఖీలలో డుమా ఏపిడి ఎస్‌విఎస్ ప్రకాశ్, ఎచ్చెర్ల క్లస్టర్ ఏపిడి పంచాది రాధ, డిఆర్‌డిఏ ఏపిడి మూర్తి, జిల్లా విజిలెన్స్ ఉపాధి హామీ అధికారి ఎం శైలజ, ఎస్‌ఆర్‌పి అచ్యుతరావు, జెఇ ఏకె రామసత్యం, నాయకులు ఎంపిపి బాలబొమ్మ మహాలక్ష్మీ, ఏఎంసి ఉపాధ్యక్షులు భూపతి శ్రీరామమూర్తి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు పైల కోటేశ్వరమ్మ, కె హేమసుందరరావు, బి వెంకటేశ్వరరావు, పైల బాబ్జీనాయుడు, టి వౌలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.