శ్రీకాకుళం

టిడిపి ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఏప్రిల్ 15: తెదేపా పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్పితే ప్రజలకు ఒరిగేది ఏమి లేదని జిల్లా వైకాపా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శనివారం పలాసలోని ఆమె విలేఖరులతో మాట్లాడారు. సిఎం చంద్రబాబునాయుడు అధికారం కోసం ఎన్నికల్లో ప్రజలకు సుమారు 600 వాగ్దానాలు ఇచ్చి నేటికి ఒక్కటి అమలుపరచలేకపోయారని విమర్శించారు. మూడేళ్ల పాలనలో ఒక్క హామీ అయినా తీర్చగలిగితే ప్రజలు ఎంతో సంతోషించేవారు అని, డయాలసిస్ కేంద్రం ప్రారంభం కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే ప్రయోజనం లేదన్నారు. శిక్షణ పొందిన సిబ్బంది లేకపోవడంతోపాటు నెఫ్రాలజిస్టు లేని డయాలసిస్ కేంద్రాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆఫ్‌షోర్ రిజర్వాయరు పూర్తి చేయడంలో టిడిపి విఫలమైందని, రిజర్వాయరు పూర్తియితే వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే భయంతో వెనుకంజ వేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు దువ్వాడ శ్రీకాంత్, శ్రీ్ధర్, పైల చిట్టి, ఎ ఆనంద్, తాళాసు ప్రదీప్‌కుమార్, గంగాధర్, గోపి తదితరులు పాల్గొన్నారు.
శతశాతం పన్నులు వసూలు చేయాలి
* డిపివో కోటేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 15: గడువులోగా శతశాతం పన్నులు వసూలు చేయాలని డిపివో బి.కోటేశ్వరరావు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు ఈనెల 20లోగా శతశాతం వసూలు చేయాలన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో పంచాయతీ విస్తరణాధికారులు, కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ ఆయా గ్రామాలకు సంబంధించిన పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. గడువులోగా లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పన్నులు వసూలు చేయడంలో అశ్రద్ధ చూపించరాదన్నారు. లక్ష్యాలను సాధించనివారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామపంచాయతీల వారీగా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నుండి గ్రామపంచాయతీ కార్యదర్శులందరూ 2017 మార్చి 31 నాటికి శతశాతం పన్నులను వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం కొన్ని పంచాయతీలు మాత్రమే వసూలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. జి.సిగడాం మండలం గెడ్డకంచరాం, పాలఖండ్యాం, మర్రివలస, చీడివలస, పున్నాం, తదితర పంచాయతీ కార్యదర్శులు లక్ష్య సాధనలో వెనుకబడి ఉండటంతో ఆయా గ్రామ పంచాయితీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు వసూలు చేయడంలో కుంటిసాకులు చెప్పవద్దని ఎట్టి పరిస్థితుల్లో పన్నులను వసూలు చేయాలన్నారు. నిర్ధేశిత గడువుకు కేవలం 5రోజులు మాత్రమే ఉండటంతో పన్నులు వసూలు రోజువారీ నివేదికను నిర్దేశిత పట్టికలో పూర్తి చేసి తమకు అందజేయాలన్నారు. అనంతరం డేటా కరక్షన్, పాయింట్స్ ఆన్, సిసి చార్జెస్, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లను, ప్లాన్ ప్లస్ అప్లికేషన్‌లో నమోదు చేయడం, ఘనవ్యర్థ పదార్ధముల నిర్వహణ, కేంద్రంల ప్రగతి సాధనపై వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి కె రామ్‌ప్రసాద్, విస్తరణాధికారులు , పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.