శ్రీకాకుళం

రాష్ట్రంలో... 120 సిహెచ్‌సిలకు వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, ఏప్రిల్ 15: రాష్ట్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న 120 పిహెచ్‌సిలను 2017లో సిహెచ్‌సిలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, ఈ ఆసుపత్రుల్లో వౌలిక వసతులు కల్పించి పూర్తిస్థాయిలో వైద్యులను నియమిస్తామమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం సిహెచ్‌సిని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 కోట్ల రూపాయలతో 71 సిహెచ్‌సిల్లో వౌలిక వసతులు కల్పించామని, హరిపురం సిహెచ్‌సికి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి పార్కింగ్, పారిశుద్ధ్యం, రంగులు వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 193 సిహెచ్‌సిలకు గాను 120 ఆసుపత్రులకు కనీస వసతులు లేవని, విశాఖ మెంటల్ ఆసుపత్రిలో గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ఏడుగురు గైనిక్ వైద్యులు పనిచేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్యపరీక్షలు సర్వీసు ప్రోవైడర్లు వద్ద మెటల్ ప్రచారం చేసుకోవడం దౌర్భగ్యమన్నారు. తల్లి, బిడ్డ కిట్లును ప్రతి ఒక్క ప్రసూతి ఆసుపత్రికి అందిస్తామన్నారు. పలాస ఎమ్మెల్యే జిఎస్‌ఎస్ శివాజీ కార్యదీక్ష, ముక్కుసూటి మనస్తత్వం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే సీనియర్ ఎమ్మెల్యే అని ప్రశంసించారు. హరిపురం ఆసుపత్రికి నేత్రవైద్యుడును నియమించాలని వినతిని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వాసు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిసి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ మాధవ్, టిడిపి జిల్లా అధ్యక్షురాలు శిరీష, పలాస ఎమ్మెల్యే శివాజీ, డిఎంహెచ్‌వో తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీకి అదనంగా 27 ఎకరాలు
* ఆర్డీవో దయానిధి
ఎచ్చెర్ల, ఏప్రిల్ 15: జిల్లాలో త్రిపుల్ ఐటీ ఏర్పాటుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడంతో అదనంగా 27 ఎకరాల భూమిని అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని శ్రీకాకుళం ఆర్డీవో బలివాడ దయానిధి స్పష్టంచేశారు. ఎస్‌ఎం పురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.112లో గల 27 ఎకరాల భూమిని శనివారం ఆయన పరిశీలించారు. ఇప్పటికే 43 ఎకరాలు సంబంధిత అధికారులకు అప్పగించామన్నారు. అదనంగా 27 ఎకరాలు అంబేద్కర్ వర్శిటీకి ఇప్పటికే కేటాయించిన భూమిని గతంలో అప్పగించిన 43 ఎకరాలకు అనుసంధానంగా ఉన్న భాగాన్ని ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనల్లో పొందుపరిచామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇక్కడ తరగతుల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నీటి తీరువా వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థి సేవలో రెవెన్యూ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి పాఠశాలలకే ధృవపత్రాలు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇఇ జగ్గారావు, తహశీల్దార్ కిమిడి రామ్మోహనరావు, ఆర్‌ఐ వెంకటేష్ పాల్గొన్నారు.