శ్రీకాకుళం

నదిలో పడి బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 29: నగరంలోని మంగువారితోట కండ్రవీధికి చెందిన పొడమంచి కల్యాణి అలియాస్ రాజేశ్వరి(10) నాగావళి నదిలో గల్లంతై శనివారం ఉదయం శవంగా తేలింది. వివరాల్లోకి వెళితే మంగువారితోటలో నివాసం ఉంటున్న రాజేశ్వరి తన చుట్టాల ఇంటికి ఈనెల 24న హయత్‌నగరం వచ్చింది. 28న ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నది ఒడ్డు సమీపంలోకి వెళ్లి తిరిగి వచ్చిందని, చెప్పులు మర్చిపోయానని మళ్లీ నది వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. శనివారం ఉదయం నాగావళి నది బ్రడ్డికి సమీపంలో ఓ కంటతో మృతదేహం తేలి కనిపించడంతో స్థానికులు కుటుంబీకులు , పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి గతకొంత కాలంగా మూర్చవ్యాధితో బాధ పడుతోందని మందులు కూడా వాడుతున్నట్లు బంధువులు తెలియజేశారు. దీంతో హుటాహుటిన చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి తండ్రి రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రూపే కార్డులు సద్వినియోగం చేసుకోవాలి
*ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ మేరీ సగాయా

గార, ఏప్రిల్ 29: స్టేట్ బ్యాంకు ద్వారా అందజేసిన రూపే కార్డులను ప్రతి ఒక్క ఖాతాదారుడు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ మేరీ సగాయా స్పష్టం చేసారు. మండలం సాలిహుండాం పంచాయతీ వేణుగోపాలపురం వద్ద బిజినెస్ కరస్పాండెంట్ అంబటి గోవిందరావు, అంబటి సీతయ్యల ఆధ్వర్యంలో ఖాతాదారుల అవగాహనా కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆర్.ఎం. మేరీ సగాయా మాట్లాడుతూ రూపే కార్డు ఆవశ్యకతను ప్రతి ఒక్క ఖాతాదారుడు గుర్తించాలన్నారు. ఖాతాదారులు తమ యొక్క ఆధార్ కార్డును ఖాతాలకు అనుసంధానం గావించాలన్నారు. అదేవిధంగా రూపే కార్డు ద్వారా నెలకు కనీసం ఒక సారి లావాదేవీలు నిర్వహిస్తే యేడాది పొడవు కాలపరిమితితో లక్ష రూపాయలు భీమా వర్తిస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు యొక్క ఫలాలు కూడా ఈ రూపే కార్డుల ద్వారానే సాధ్యం అవుతుందన్నారు.