శ్రీకాకుళం

ఆగస్టు నుండి త్రిపుల్ ఐటి తరగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేసిన త్రిపుల్ ఐ.టికి సంబంధించి ఆగస్టునుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైస్ చాన్సలర్ రామచంద్రరాజు స్పష్టంచేశారు. ఎస్ ఎం పురం పరిధిలో ఉన్న 21వ శతాబ్ధపు గురుకుల భవనాలతో కూడిన 70 ఎకరాల స్థలాన్ని త్రిపుల్ ఐ.టీ నిర్వహణకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ భవనాలను శనివారం వీసి పరిశీలించి ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు. గురుకుల భవనాలు కేవలం 500మంది విద్యార్థులు చదువుకునేందుకే వసతి ఉందని మిగిలిన 500మంది విద్యార్థులు చదువుల కోసం అంబేద్కర్ వర్శిటీ, మిత్రా కళాశాల భవనాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన తరువాత నోటిఫికేషన్ త్రిపుల్ ఐ.టీ అడ్మిషన్లకు జారీ చేస్తామని వివరించారు. గురుకుల భవనాల్లో బాలికలకు వసతికల్పిస్తామని పేర్కొన్నారు. అయితే రెండో సంవత్సరం త్రిపుల్ ఐటీ తరగతులు నూజివీడులోనే కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.230కోట్లు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాధనలు నివేదించడం జరిగిందన్నారు. నిధులు ఇంకా రావాల్సి ఉందని స్పష్టంచేశారు. 200 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అంబేద్కర్ వర్శిటీ ఇంఛార్జ్ వీసి చంద్రయ్య వీసి రామచంద్రరాజు భేటి అయి వసతి సమస్యపై సమీక్షించారు. ఈయనతోపాటు ఏపిఇడబ్ల్యూఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ విఠల్, త్రిపుల్ ఐ.టీ డైరెక్టర్ అప్పలనాయుడులు ఉన్నారు.
డిగ్రీ ఫలితాలు విడుదల
* 45.55శాతం ఉత్తీర్ణత
ఎచ్చెర్ల, ఏప్రిల్ 29: డిగ్రీ మొదటి, మూడవ సెమిస్ట్రీ ఫలితాలను శనివారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంఛార్జ్‌వైస్ ఛాన్సలర్ ఎం.చంద్రయ్య ఆయన ఛాంబర్‌లో విడుదల చేశారు. మొదటి సెమిస్ట్రీకి 14,221మంది అభ్యర్థులు హాజరు కాగా 6478మంది ఉత్తీర్ణత సాధించారు. 45.55శాతంగా నమోదైంది. మూడవ సెమిస్ట్రీపరీక్షకు 10,995మంది హాజరు కాగా 4189మంది ఉత్తీర్ణులయ్యారు. 38.10శాతంగా నమోదైంది. మరింత సమాచారం కోసం అంబేద్కర్‌విశ్వవిద్యాలయం అధికారులను అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని కోరారు. రీవ్యాల్యూషన్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వర్శిటీ నిర్దేశించిన రుసుమును చెల్లించాలని సూచించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని అభ్యర్థులు గమనించాలని వీసి పేర్కొన్నారు. ఈయనతోపాటు ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు, పాలక మండలి సభ్యులు జయరామ్, కెవిఏ నాయుడు, బాబూరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిఫెడ్రిక్, గాయిత్రీకళాశాల ప్రిన్సిపల్ పులఖండం శ్రీనివాసరావులు ఉన్నారు.