శ్రీకాకుళం

నాగావళి ఇసుక తరలిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 29: శ్రీకాకుళం నగరపాలక పరిధిలోనికి వచ్చే నాగావళి నదిలో ఇసుకను తరలించరాదని మున్సిపల్ కమిషనర్ పి ఏ శోభ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇసుక బళ్ల వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ నాగావళి నదిలో ఇసుకత్రవ్వకాలు అధికం కావడంతో నీటి పరిస్థితి దిగజారడంతో భవిష్యత్‌లో పట్టణంలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి కలుగుతుందన్నారు. నది ప్రమాదానికి చేరుకునే స్థితికి చేరుకున్నందున భావితరాలకు స్వచ్ఛమైన నదిని అందించడం, నీటిని సంరక్షించడం నగరపౌరులుగా మన భాధ్యతన్నారు. పర్యావరణానికి హాని జరగరాదనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ పరిధిలోని నాగావళి నదిని ప్రెడెక్టెడ్ జోన్ కింద పరిగణించామన్నారు. కళ్లేపల్లి నుండి ఇసుకను తరలించడానికి అనుమతులు ఉన్నందున బళ్ల వ్యాపారులు ఇకనుండి రూట్‌లు మార్చుకోవాలన్నారు. మన జిల్లాకు ట్రిపుల్ ఐ.టి వంటివి రావడం ద్వారా ఉపాధి మార్గాలు నిండుగా దొరుకుతాయన్నారు. కావున ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అనే్వషించాలన్నారు. శ్రీకాకుళం నగరానికి భవిష్యత్‌లో నీరులేని పరిస్థితిని కల్పించవద్దని ఎడ్ల బండితో ఇసుకవ్యాపారం మానుకోవాలని నదిని నదిలాగే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అనేక చోట్ల నీటి ఇబ్బందులతో ప్రజలు సతమతవౌతున్నారని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని ఇటువంటి పరిస్థితి నగరానికి రాకూడదన్నారు. గుర్తించిన కళ్లేపల్లి ఇసుక రీచ్‌లోనే ఇసుకను తరలించుకోవాలని తెలిపారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి. బి.దయానిధి మాట్లాడుతూ నగర పరిధిలోని నాగావళి నదిలో ఇసుక త్రవ్వకాలు చేయరాదని, ఒకవేళ అక్రమ తవ్వకాలు చేపట్టినట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మైన్స్ ఏడి హనుమంతరావు, డీఎస్పీ కె భార్గవరావునాయుడు, నగరపాలక సంస్థ ప్రజారోగ్యఅధికారి దవళభాస్కరరావు, అధికారులు, ఇసుక బండ్ల వ్యాపారులు పాల్గొన్నారు.

రైతులను మోసగించిన సిఎం
* వైకాపా జిల్లా అధ్యక్షురాలు శాంతి
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 29: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను మోసగించారని గత మూడేళ్లుగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారని వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు ఇన్‌పుట్ సబ్సీడిని ప్రభుత్వం చెల్లించలేదని ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల సరఫరా చేయలేదని పేర్కొన్నారు. పసుపుమిరప రైతుల వద్ద నుండి కొనుగోలు చేయకపోవడంతో మిరప రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుకాక రైతుకు బయట రుణాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రైతే రాజుగా అభివర్ణించారన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్‌పై సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.5,000కోట్లతో స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని విస్మరించారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నమ్మి ప్రతీ రైతు టిడిపికి ఓటు వేశారని చంద్రబాబు మాత్రం రైతులను మోసగించారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మే 1, 2 వ తేదీల్లో గుంటూరు మిర్చియార్డులో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతు దీక్షను చేపడుతున్నారన్నారు. జిల్లాలో రూ.843కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది అది పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. బ్యాంకులు కూడా రైతులకు రుణాలిచ్చే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో 18 కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ దీనిపై ఎటువంటి సమీక్షలు లేవన్నారు.