శ్రీకాకుళం

జిఎస్‌టి తడాఖా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జిఎస్‌టి విధానం ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో గల ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులకు తాళాలు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా ఒడిశాలో గిరిసోల వద్ద గల చెక్‌పోస్టును రాత్రికిరాత్రి ఆ సర్కార్ తాళాలు వేసింది. మరికొద్ది రోజుల్లో ఆంధ్రాలో ఇచ్ఛాపురం వద్ద పురుషోత్తపురం చెక్‌పోస్టుకు తాళాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూలై ఒకటో తేదీ నుంచి పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుకు తాళాలు తప్పేటట్టులేదు. అవినీతికి ఆనవాలుగా కొన్ని దశాబ్ధాలుగా నడిచే ఈ చెక్‌పోస్టులో వందలాది మంది సర్కార్ పనిమంతులు ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించినప్పటికీ, అవినీతి నిరోధక శాఖ దాడులు చేసి జిల్లాలో సంచలనం సృష్టించిన దాఖలాలైతే లేవు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే నిరుద్యోగ యువతను పట్టుకుని అనధికారికంగా ఉన్న కరెన్సీ నోట్లను లెక్కపెట్టి, ప్రభుత్వ ఖజానాకు జమచేయడమే తప్ప, కేసులు నమోదు చేసి, అరెస్టులు చూపించేందుకు చట్టం లేదన్న వాదనతో ఇంటిగ్రేట్ చెక్‌పోస్టును అవినీతి అనకొండగా మార్చేశారు. అటువంటి అవినీతి చెక్‌పోస్టులు అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి చట్టంతో పురుషోత్తపురం చెక్‌పోస్టుకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. సరుకు గల వాహనం ప్రారంభం పాయింట్‌లో జిఎస్‌టి నిబంధనల మేరకు ఒకటి శాతం టాక్స్ చెల్లించడంతో గమ్యం చేరే స్థానం వరకూ ఏ రాష్ట్రంలో టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనివల్ల వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన పన్నులన్నీ ఆ ఖాతాలోకి చేరిపోవడంతో చెక్‌పోస్టుల్లో వాణిజ్య పన్నుల శాఖకు పనిలేకుండా పోతుంది. అందుకే, ఆ శాఖ ఉద్యోగులంతా వారివారి కార్యాలయాలకు వెనక్కి వెళ్ళిపోవాలంటూ తాకీదులు ఇప్పటికే అందుకున్నారు. అలాగే, ఆర్టీఏ అధికారులు కూడా అవసరం లేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు వౌకికంగా చెప్పుకొస్తున్నారు. నేషనల్ పర్మిట్ విధానంతో దేశంలో అన్నీ రాష్ట్రాలకు చెందినట్టుగా టాక్స్ వసూళ్లు వాహనం బయలుదేరినప్పుడే చెల్లించే విధానానికి ఎపీ సర్కార్ సమాలోచన చేస్తోంది. అదే, జరిగితే ఆర్టీఏ శాఖ కూడా చెక్‌పోస్టుల వద్ద పనిచేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే, వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖ వంటివి మొబైల్ టీంలుగా ప్రతీ 50 కిలోమీటర్లకు జాతీయ రహదారులపై తనిఖీలు చేసేవిధంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నదమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో
చెక్‌పోస్టులకు తాళాలు తప్పనిసరి అంటూ అధికారులు సుస్పష్టం చేస్తున్నారు. పురుషోత్తపురం చెక్‌పోస్టులో ప్రభుత్వానికి రోజుకు రూ. లక్షలు ఆదాయం తెచ్చిపెట్టే చెక్‌పోస్టు ఎందుకు ఎత్త్తేస్తారని కొంత మంది వాదిస్తున్న నేపథ్యంలో ఒడిశా సర్కార్ ఆకస్మికంగా రాత్రికిరాత్రి గిరిసోల వద్ద గల చెక్‌పోస్టు ( ఆంధ్రా నుంచి ఒడిశా, ఒడిశా నుంచి ఆంధ్రాకు రాకపోకలు చేసే వాహనాల తనిఖీ కేంద్రం)ను ఎత్తివేశారు. జిఎస్‌టి విధానాన్ని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఒకేలా అమలు చేయాలంటూ ఒడిశా అధికారులు సుస్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ తుచ తప్పకుండా పాటించినట్టయితే పురుషోత్తపురం చెక్‌పోస్టు ఎత్తేయాల్సిన పరిస్థితే? కాని - గతంమాదిరిగానే ఇప్పటి వరకూ చెక్‌పోస్టులో తనిఖీలు జరుపుతున్నారు. అక్రమంగా సరుకులు రవాణా చేసే వాటికి జరిమానాలు విధిస్తున్నారు. ఆంధ్రాలోవున్న ఈ చెక్‌పోస్టు జూలై నెలలోపు ఎత్తివేస్తారని పురుషోత్తపురం చెక్‌పోస్టు అధికారులు ‘ఆంధ్రభూమి’కి సుస్పష్టం చేశారు. చెక్‌పోస్టు సేల్స్‌టాక్స్, ఎక్సైజ్‌శాఖ, వ్యవసాయశాఖ, కమర్షియల్‌టాక్స్, మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీఏ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం పరిపాటి. వీటిలో కొన్నింటిని మాత్రమే దేశంవ్యాప్తంగా ఒక విధానం అమల్లో ఉంటే మిగిలిన శాఖలు తనిఖీ కోసం చెక్‌పోస్టు ఉండాలని కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు నివేదికలు అందించారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో మొబైల్ తనిఖీపై అధికారులకు శిక్షణ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఆదేశాలు మాత్రం రాలేదని, అధికారులు చెబుతున్నారు. మొబైల్ తనిఖీ ఎక్కువ జరిగినట్లయితే వాహనాలు రవాణా జరిగినప్పుడు అక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని వాహనదారుల అభిప్రాయాలను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఉంది. అధికారులు, వాహనదారులు పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుందని, ఎవోబీలో చెక్‌పోస్టులు ఎత్తేస్తే నెలకు రూ.50 లక్షలు వరకూ వచ్చే ఆదాయం సర్కార్ ఖజానాకు జమకాకుండా పోతుందని, మొబైల్ తనిఖీలవల్ల ఈ ఆదాయం ప్రభుత్వానికి చేరకుండాపోతుందని కొందరి అభిప్రాయం. గత ఐదు సంవత్సరాలుగా పురుషోత్తపురం చెక్‌పోస్టు సందిగ్ధంలోనే కొనసాగుతోంది. కొనే్నళ్ళుగా చెక్‌పోస్టు కవిటి మండలం కరాపాడు వద్దకు మార్చేస్తారని భూములు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ గేటు మరమ్మతులుగాని, తునికయంత్రం ఏర్పాటుగాని జరగలేదు. మరల ఈ మధ్యకాలంలో పూర్తిగా గేటు ఉండదని పుకార్లు రావడంతో అందులో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడు పురుషోత్తపురం ఇంటిగ్రేట్ చెక్‌పోస్టు ఎత్తివేస్తారన్న ఆందోళనలో ఉన్నారు.