శ్రీకాకుళం

ఎండలతో నిర్మానుష్యమైన గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, మే 1: గడచిన ఐదేళ్ల కంటే ప్రస్తుత వేసవిలో ఎండ వేడిమి అధికంగా ఉండటంవలన ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఇండ్ల నుండి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అత్యవసర పరిస్థితులు అనివార్య కారణాల ఉంటే తప్ప ప్రయాణాలు చేయడానికి ప్రజలు సాహసించడం లేదు. నిరంతరం జనసందోహంతో కళకళలాడే వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాలలోని ప్రధానమైన కూడళ్లు కూడా జనం లేక నిర్మానుష్యమైనాయి. వారపు సంతలు, బజారు కేంద్రాలు, దుకాణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. వడగాల్పులు కూడా అధికంగా ఉండటం వలన చిన్న పిల్లలు, వయసు మళ్లిన వారితో బయటకు రావడం, ప్రయాణాలు చేయడం ఎక్కడా కనిపించలేదు. మరో నాలుగు రోజుల వరకు కూడా ఇదే పరిస్థితులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మేలో వచ్చే బాలకర్తులు, అగ్నికర్తులలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకటి రెండు రోజులలో కొద్దిపాటి జల్లులు పడితే కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందన్నారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
* వ్యవస్థాపక అధ్యక్షుడు విజయరాజు
శ్రీకాకుళం(రూరల్), మే 1: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆలిండియా క్రిష్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దిపాటి విజయరాజు కోరారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవ ప్రతినిధుల సదస్సులు ఈనెల 1నుండి 13వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా శ్రీకాకుళంలో ఈ సదస్సును ప్రారంభించినట్లు తెలిపారు. 13 జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. జాతిని చైతన్యం చేసేందుకు యాత్ర సాధిస్తున్నామన్నారు. దేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితుల క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. గతేడాది నవంబర్ 14వతేదీన దళిత గర్జన నిర్వహించామన్నారు. శాసనసభా సమావేశాల్లో ఈ విషయమై తీర్మానం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. త్వరలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు బిడ్డిక లక్ష్మీ, లోపింటి చిట్టిబాబు, గంటా జాషువా కమలాకర్ పాల్గొన్నారు.

గృహ నిర్మాణ లబ్ధిదారులను ప్రకటించాలి
* మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి
శ్రీకాకుళం(రూరల్), మే 1: నగరంలోని కంపోస్టుకాలనీకి సమీపంలో హూదూద్ తుపాన్ నిధులతో నిర్మించిన ఇళ్ల లబ్ధిదారుల జాబితాను వెంటనే ప్రకటించాలని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 200 గృహాలు నిర్మించారని వీటిని పేదలకు ఇవ్వాలనుకున్నారా లేదా బ్రోకర్లద్వారా అమ్మాలని అనుకుంటున్నారా?అని ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. డబ్బులు చేతులు మారుతున్నాయని, దరఖాస్తులు కార్యకర్తల చేతుల్లో ఉన్నాయన్నారు. దీనిపై పోలీసు దర్యాప్తు నిర్వహించి నిజాయితీగా జాబితా విడుదల చేయాలని కోరారు. గుమ్మానగేష్ మాట్లాడుతూ పట్టణంలో మూడేళ్ల క్రితం మంజూరైన నిధులతో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని ఇందులో అవినీతి చోటుచేసుకుందన్నారు. కోణార్కు శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలను మభ్యపెట్టే స్థితిలో తెలుగుదేశంపార్టీ ఉందన్నారు. జాబితా ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చిన వారంతా అందరితో కలిసి పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఫొటోలకే పరిమితం తప్ప వాస్తవంగా అభివృద్ధి కానరావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారుల జాబితాను వెంటనే ప్రకటించాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో ఎం.రవికుమార్, కామేశ్, రమేష్, రహీహ్,స్వరూప్, సుంకరి కృష్ణకుమార్, కృష్ణమూర్తి, సాదు వైకుంఠరావు, ఎన్ని ధనుంజయరావు పాల్గొన్నారు.