శ్రీకాకుళం

15 నుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 11 : ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు జరుగుతున్నందున సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని డిఆర్‌ఒ ఎన్.సత్యనారాయణ పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, మధ్యాహ్న 2:30నుండి సాయంత్రం 5:30గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నా రు. పరీక్షా పత్రాలు నిల్వ ఉన్న స్ట్రాంగ్‌రూమ్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సిబ్బంది, ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయాలని డిఇఒను ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.ఎండల దృష్ట్యా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, విద్యుత్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో ఆర్‌ఐఒ వరప్రసాదరావు, డివిఇవో మల్లేశ్వరరావు, అదనపు జిల్లా వైద్య శాఖాధికారి వెంకటేశ్వరరావు, ఉప విద్యాశాఖాధికారి విశ్వనాధం, డి ఈసి మెంబర్ శంకరరావు, శ్యామలరావు, హైపవర్ కమిటీ సభ్యులు సిహెచ్ ఆదినారాయణ, ఎస్ ఐ బి.సత్యం పాల్గొన్నారు.

అణువిద్యుత్ కేంద్రం ఎవరి కోసం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కృష్ణమూర్తి
శ్రీకాకుళం(రూరల్), మే 11: అణువిద్యుత్ కేంద్రం నాయకులు ప్రయోజనాల కోసమే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఎందుకని ప్రశ్నించారు. సోలార్ పవర్ యూనిట్ రూ.3.80లకు వస్తుందని, ధర్మల్‌పవర్ ఖర్చు ఎక్కువని తెలిపారు. అణువిద్యుత్ యూనిట్ ధర రూ.15.20 పైసలు పడుతుందని, ఇప్పటికే దివాలా తీసి ఎత్తివేసిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంటుందన్నారు. అవినీతి ప్రాజెక్టు ముడుపుల కోసమే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి మంత్రి కళా వెంకటరావు సమాధానం చెప్పాలన్నారు. భావనపాడు పోర్టు ప్రస్తుతం అవసరం లేదని, బొగ్గును సరఫరా చేసేందుకే పోర్టు నిర్మాణం చేపడతారని తెలిపారు. బొగ్గు దిగుమతి సరఫరా లేదన్నారు. పోలాకి పవర్‌ప్లాంట్ వల్ల ఉపయోగం లేదని, రాజకీయ నాయకులు బంధువులకు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. నిర్వాసితుల భూములకు అన్నింటికీ ఒకే ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ప్రలోభపెట్టి మోసగించే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, కె.నారాయణరావు పాల్గొన్నారు.