శ్రీకాకుళం

నీరు-ప్రగతిపై సమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 11: జిల్లాలో నీరు-ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధతో మంచి పనులను చేపట్టాలని రాష్ట్ర శాసన సభ హామీల కమిటీ అధ్యక్షులు టి.వెంకటేష్ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన శాసన సభ హామీల కమిటీ గురువారం జెడ్పి సమావేశ మందిరంలో శాసన సభలో సభ్యులు ప్రస్తావించిన హామీలపై సంబంధిత శాఖలతో సమీక్షించారు. ఈసందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో హరితభద్ర రిజర్వాయర్ పరిస్థితిపై గల హామీని ప్రస్తావిస్తూ జల సంరక్షణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. అంతర్‌రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంలో చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వం నీరు-ప్రగతి పనులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని వీటి దృష్ట్యా పనులను వేగవంతం చేయాలన్నారు. మార్చి నాటికే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి మంజూరు పొందాలని అన్నారు. సీజన్‌లో పనులు త్వరితగతిన జరగాలని ఆదేశించారు. సిబ్బంది తక్కువగా ఉంటే ఔట్ సోర్సింగ్ కింద నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించిందని ఆ మేరకే చర్యలు చేపట్టాలని సూచించారు. ఓపెన్ హెడ్ చానల్స్ పనులు తక్షణం పూర్తి కావాలని అందుకు శాఖపై నియంత్రణ పెంచాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. కొత్తూరు మండలం కౌశల్యపురం గ్రామంలో 38.16 ఎకరాల స్థలంలో ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల వివాదం ఉందని ఇది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని కొత్తూరు తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ వివరించారు. సుప్రీం కోర్టు సంబంధిత డాక్యుమెంట్‌లు సమర్పించాలని ఒరిస్సా ప్ర
భుత్వాన్ని ఆదేశించినప్పటికీ ఆధారాలు చూపలేదని ఆయన పేర్కొన్నారు. పాలకొండ సహకార షుగర్‌ఫ్యాక్టరీని హామీను సమీక్షిస్తూ సమస్య పరిష్కారంలో జాప్యం ఉండరాదన్నారు. లిక్విడేటర్‌ను నియమించాలని, ప్రతిపాధనలు సమర్పించామని సహాయ కేన్ కమీషనర్ వివరించారు. దీనిపై కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి మాట్లాడుతూ సమస్యను పరిష్కరించుటకు చర్యలు చేపడతామన్నారు. డయాలసిస్ యూనిట్లను జిల్లాలో ఏర్పాటుకు గల హామీని గురించి వివరాలు అందిస్తూ టెక్కలిలో పది, పాలకొండలో ఐదు, పలాసలో ఐదు యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆసుపత్రి సమన్వయ కర్త సుబ్బారావు వివరించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందిస్తున్న సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.తిరుపతిరావు వివరించారు. ట్రాన్స్‌వరల్డ్ గార్నెట్ ఇండియా ప్రై.లి అంశంపై సమీక్షిస్తూ ట్రాన్స్‌వరల్డ్‌గార్నెట్‌కంపెనీ ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేస్తుందన్నారు. ఆయా కంపెనీలు ఏ అంశాలకు అనుమతి పొందాయో వాటి వివరాలు అందించాలన్నారు. గనుల శాఖ నుండి సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గార్నెట్ పేరుతో మోనోజైట్‌ను రవాణా చేస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంపై ప్రశ్నించారు. నోటీసులు జారీ చేశామని గనుల శాఖ సహాయ సంచాలకులు ఆర్.తమ్మినాయుడు తెలియజేయగా ప్రక్రియను పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ అంతర్‌రాష్ట్ర సమస్యలు ప్రభుత్వ స్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని దీనిపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామన్నారు. ఇద్దివానిపేటలో గృహాల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. నీరు-ప్రగతి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. మండలానికి ఒక సహాయ ఇంజినీరు, ఔట్‌సోర్సింగ్‌లో నియమిస్తామని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ కౌశల్యపురంలో ఒడిస్సా ప్రభుత్వ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారని వీటిపై మన అధికారులు సరైన చర్యలు చేపట్టడంలేదన్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ ఇద్దివానిపాలెం సమస్య దీర్ఘకాలంగా ఉందన్నారు. అరకుభద్ర రిజర్వాయర్ సమస్య పరిష్కారం కాకపోవడంతో 7వేల ఎకరాలు స్థిరీకరణ జరగడం లేదన్నారు. ఈసమావేశంలో కమిటీ సభ్యులు జోగేశ్వరరావు, జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పి సి ఈవో నగేష్, డి ఆర్ డి ఏ పిడి కిషోర్‌కుమార్; పి.డి త్రినాధరావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీరు రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు రవీంద్ర, టెక్కలి ఆర్డివో వెంకటేశ్వరరావు, కమిటీ డిప్యూటీ కార్యదర్శి రాజు, జిల్లా సహకార అధికారి శ్రీహరి, డిఎఫ్‌ఒ శాంతిస్వరూప్, గృహ నిర్మాణ శాఖ పిడి ఆర్‌వి నర్శింగరావు పాల్గొన్నారు.

ప్రణాళికతో లక్ష్యాలను సాధించవచ్చు
* ఐటిడిఎ పిఓశివశంకర్
శ్రీకాకుళం(రూరల్) మే11: ప్రణాళికబద్దమైన విద్యతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ప్రొజెక్టు అధికారి ఎల్.శివశంకర్ గిరిజన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గిరిజన యువత శిక్షణ కేంద్రంలో పదో తరగతి ఉత్తీర్ణత పొందిన గిరిజన విద్యార్థులకు కెరీర్ అండ్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిఓ మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే పదవ తరగతే కీలకమని పదిలో ఉత్తీర్ణత ఓ చిన్న విజయమన్నారు. తదుపరి విద్యపై ప్రతి ఒక్కరికీ సందేహాలు ఉంటాయని, వాటిని నివృత్తి చేసుకుని సరైన మార్గంలో వెళ్లేందుకు కెరీర్ గైడెన్స్ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రణాళిక ప్రకారం విద్యను అభ్యసించినట్లయితే అనుకున్న లక్ష్యాలు సాధించడం గొప్పవిషయమేమి కాదన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నైతిక విలువలు ఉండాలన్నారు. కెరీర్ పరంగా వ్యక్తిత్వ వికాసాలు ఉండాలని అప్పుడే దేనినైనా సాధించగలరని చెప్పారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కెరీర్ గైడెన్స్‌ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల కెరీర్‌పై ఉండే సందేహాలను అడిగి తెలుసుకుని వాటిని నివృత్తి చేశారు. ఉపసంచాలకులు రోజారాణి, ఉప విద్యాశాఖాధికారి రామ్మోహన్, పూర్వ డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్.తిరుమలచైతన్య, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ ఐ.జయదేవ్, వ్యక్తిత్వ వికాసాల ట్రైనర్ దుప్పల రవికుమార్, ప్రొగ్రామ్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు.