శ్రీకాకుళం

ఎంసెట్ కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 28: జిల్లాలో ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎంసెట్ జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బాబూరావు తెలిపారు. ఈనెల 29న జిల్లాలో 11 కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోసం 6022మంది, వ్యవసాయ, వైద్య విభాగాలకు సంబంధించి 2164మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పరీక్షా కేంద్రాల్లో ప్రతీ తరగతి గదిలో గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థి సమయస్ఫూర్తితో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద జామర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం 1:00గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్షకు గంట ముందు అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. వ్యవసాయ, వైద్య పరీక్షకు మధ్యాహ్నం 2:30గంటలనుండి 5:30గంటల వరకు జరుగుతుందని, 1:30గంటలనుండే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తామన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా గంట ముందుగావస్తే ఓ ఎం ఆర్‌సీట్‌ను భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. దూర ప్రాంతాలనుండే వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన యాజమాన్యం తమకళాశాల బస్సులను ఉచితంగా శుక్రవారం నడుపుతున్నట్టు ప్రకటించారు. ఇంజినీరింగ్ అభ్యర్థులకు 11 కేంద్రాల్లో, వైద్య అభ్యర్థులుకు 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కిట్లను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటిని కూడా అందుబాటులో పెడుతున్నట్టు చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు విధిగా హాల్ టికెట్ ఎంట్రన్స్ టెస్ట్‌కు తీసుకుని రావాలని సూచించారు.
ఎంసెట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు
ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ మళ్లించినట్టు డిఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. నరసన్నపేట వైపు నుండి శ్రీకాకుళం వచ్చే బస్సులు రామలక్ష్మణ, సూర్యమహాల్ మీదుగా ఏడురోడ్ల జంక్షన్‌కు దారి మళ్లించినట్టు చెప్పారు. ఆమదాలవలస నుండివచ్చే బస్సులు డే అండ్ నైట్, కృష్ణాపార్క్, ఏడు రోడ్ల జంక్షన్‌కు మళ్లించినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ స్పెషల్ బస్సులనుమాత్రమే మహిళా కళాశాలల వైపు అనుమతిస్తామన్నారు. దీన్ని గమనించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.