శ్రీకాకుళం

బదిలీలు పారదర్శకంగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 15: బదిలీలు పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి ఆదేశించారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్‌లో భాగంగా గతంలో అందిన వినతులపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా జరగాలని ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. ఐదేళ్లు పూర్తయిన సిబ్బంది విధిగా బదిలీ కావాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 3 నుండి 5 సంవత్సరాల మధ్య సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులను వారి విజ్ఞాపన మేరకు బదిలీ చేయడానికి పరిశీలించవచ్చునని తెలిపారు. విజ్ఞాపనలకై బదిలీలు 5శాతం మించి ఉండరాదన్నారు. చివరి నిముషంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన చెప్పారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ప్రజల నుండి అందుతున్న వినతులను అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డయల్‌యువర్ కలెక్టర్, గ్రీవెన్స్‌లో సమర్పిస్తున్న వినతులు పరిష్కరించాలన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కి అన్ని శాఖల జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. జె.సి చక్రధరబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో దీర్ఘకాలం తీసుకునే అధికారులకు అపరాధ రుసుం విధిస్తామన్నారు. నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆయన చెప్పారు. పరిష్కరించిన అనంతరం నివేదికలను సమర్పించాలని, ఆన్‌లైన్‌లో వాటి వివరాలు పెట్టాలన్నారు. మీ-సేవ, మీ-కోసం కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని దస్త్రాలను ఇ-ఆఫీస్ విధానంలో సమర్పించాలని చెప్పారు. కార్యాలయాల్లో సిబ్బంది హాజరుకు బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఫోర్టల్‌ను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.సత్యనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు జి.సి కిషోర్‌కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎన్.శివరామ్‌నాయకర్, జిల్లా పరిషత్ ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీరు ఏ.మోహనమురళీ, వ్యవసాయ శాఖసంయుక్త సంచాలకులు జి.రామారావు, పశుసంవర్థక శాఖ జెడి ఎం.వెంకటేశ్వర్లు, డిఎంఅండ్ హెచ్‌ఓ తిరుపతిరావు, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె.వి ఆదిత్యలక్ష్మీ, పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, మెప్మా పిడి ఎస్.త్రినాథరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి ఆర్.వి నర్శింగరావు, డిఇఒ ఏ.ప్రభాకరరావు, మార్కెట్ సహాయ సంచాలకుడు వై.శ్యామ్‌కుమార్, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఎం ఏ రహీమ్, సాక్షరభారత్ ఉపసంచాలకుడు జి.కృష్ణారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు కె. ఎస్ ధనుంజయరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీరు పి.రవి పాల్గొన్నారు.