శ్రీకాకుళం

హెల్మెట్ ధారణ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 16: రహదారి ప్రమాదాల్లో ప్రాణాపాయం లేకుండా కాపాడుకునేందుకు హెల్మెట్ ధారణ ఉండాలని జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి అన్నారు. జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టవల్సి ఉందన్నారు. హెల్మెట్ ధారణపై నెలరోజులపాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్మెట్ ధారణ సొంత ప్రాణాలను రక్షించుకోవాలనే అలోచన ప్రజల్లో రావాలన్నారు. తన ప్రాణం, తన కుటుంబ సభ్యుల భద్రతలను గమనించాలని కలెక్టర్ అన్నారు. పోలీసు, రవాణా, జాతీయ రహదారి సంస్థ సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతీ ప్రాణం ఎంతో విలువైనదన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదకర కూడళ్లవద్ద తగిన విద్యుదీకరణ, రేడియం స్టిక్కరింగ్‌తో బోర్డులు విధిగా ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక, పురపాలక సంస్థ పంచాయతీల్లో జాతీయ రహదారి ఉంటే ఆయా కూడళ్లలో విద్యుదీకరణ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై టివై జంక్షన్‌ల వద్ద సరైన సూచికలు, విద్యుదీకరణ ఉండాలన్నారు. 24 చోట్ల అనధికారికంగా రహదారి మధ్యలో రాకపోకలు సాగించడానికి తవ్వకాలు చేశారని, 17 ప్రదేశాల్లో మట్టిరోడ్డు అనుసంధానం రహదారులుగా ఉన్నాయని, వాటి నుండి వాహనదారులు నియమబద్ధత లేకుండా వాహనాలను నడుపుతున్నారని జాతీయ రహదారుల నిర్వహణ ఇంజినీరు ఇ.వెంకటరమణ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తగిన వేగ నియంత్రణ సూచికలను ఏర్పాటుచేసే పనిని నెలరోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనేక వాహనాలకు వెనుకభాగంలో ఉండాల్సిన రేడియం స్టిక్కరింగ్, విద్యుత్ దీపాలు ఉండటం లేదని వాటిపై చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. నవభారత్ కూడలి వద్ద వాహనాల రాకపోకలు అధికంగా ఉన్నాయని అక్కడ తగిన చర్యలు చేపట్టాలన్నారు. నవభారత్ కూడలి వద్ద ప్రమాదాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అటువంటి ప్రదేశాల్లో సబ్‌వేలను నిర్మించాలని ఎన్‌హెచ్ ఏ ఐ అధికారులను ఆదేశించారు. ఐదుమీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు విధిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా మేజర్ జిల్లా రహదారి ఉన్నప్పటికీ 500మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు బెల్ట్‌షాప్‌లు ఉండరాదన్నారు. ఆటోలలో అధిక లోడులను నియంత్రించాలన్నారు. ప్రమాదాల సమయంలో 108వాహనాల ద్వారా రిమ్స్ ఆసుపత్రిలో చేర్చేందుకు వెళ్లితే పోలీసులు లేకుండా చేర్చుకునేది లేదని అడ్డుకుంటున్నారని, తద్వారా జాప్యం జరుగుతోందని 108వాహనాల ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా స్పందిస్తూ ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులు తక్షణం క్షతగాత్రులను చేర్చుకుని తగిన వైద్య చికిత్సను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎచ్చెర్ల, పలాస, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు 108వాహనానికి అందుతున్న సమాచారమని 108 ప్రోగ్రాం మేనేజర్ తెలియజేయగా, ఎచ్చెర్లలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నందున దృష్టికేంద్రీకరించి ప్రమాదాలు జరగకుండా ఏ చర్యలు చేపట్టాలో పూర్తిస్థాయిలో ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
* రహదారిపై ట్రక్కులు నిలపరాదు
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ముఖ్య కారణాల్లో ట్రక్కులను రహదారిపై నిలపడమని జాతీయ రహదారుల సంస్థ తెలపగా ట్రక్కులు, వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారి పక్కన చిన్న దుకాణాలు ఉండటం వలన వాహనాలు నిలుపుతారని, దుకాణదారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే దుకాణాలు తొలగించాలని పేర్కొన్నారు.
* ప్రత్యేకత కల్గిన హెల్మెట్
హెల్మెట్ ధరిస్తే వాహనం స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ ధరించకపోతే వాహనం స్టార్ట్ కాదు. ఈ హెల్మెట్‌ను శ్రీకాకుళం మునసబుపేటలో గల గురజాడ విద్యా సంస్థల విద్యార్థులు రూపొందించారు. దీనిని భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌కు కళాశాల ప్రతినిధి కెప్టెన్ వంగా మహేష్ వివరించారు. హెల్మెట్ సెన్సార్‌లను అనుసంధానం జరుగుతుందని తెలిపారు. దీని ధర రూ.1875 నుండి రూ.4,000వరకు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రవాణాశాఖ ఉపకమీషనర్ శ్రీదేవి, ఆర్డీవోలు బి.దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, డిఎస్పీ కె.్భర్గవరావునాయుడు, ఆర్‌అండ్‌బి పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీర్లు రామచంద్ర, ఎ.మోహనమురళీ, డిఎంఅండ్ హెచ్‌ఓ ఎస్.తిరుపతిరావు, అదనపు డిఎంఅండ్ హెచ్‌ఓ వై.వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిప్యూటీ సిటిఎం కె.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.నాగేశ్వరరావు, నగరపాలక సంస్థ సహాయ సిటీప్లానర్ కుమార్, జాతీయ రహదారి నిర్వహణ ఇంజినీరు వెంకటరమణ, ఆర్‌అండ్‌బి కార్యనిర్వాహక ఇంజినీరు రామకృష్ణ, గిరిజన సంక్షేమశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు అశోక్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రామ్‌కుమార్ పాల్గొన్నారు.