శ్రీకాకుళం

ఉద్యానవన పంటలు సాగు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 16: మహిళా సంఘాల సభ్యులను ఆర్థిక స్వావలంభన సాధించేందుకు వీలుగా వెలుగు సిబ్బంది ప్రతీ సి.సి పరిధిలో 25 ఎకరాలకు తక్కువ లేకుండా కన్వర్జెన్స్‌లో భాగంగా ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని డిఆర్‌డిఏ పిడి జి.సి కిషోర్‌కుమార్ ఆదేశించారు. స్థానిక టిటిడిసిలో మంగళవారం వెలుగు సిబ్బందికి లక్ష్యాలు అధిగమించే దిశగా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పిడి మాట్లాడుతూ పశుగ్రాసం పెంపకం కూడా ఐదెకరాలు విస్తీర్ణంలో చేయాలని సూచించారు. వీటికి రూ.20వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద రూ.3వేల వంతున అందని సంఘ సభ్యులు వివరాలు తెలుసుకుని వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనేక చోట్ల వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆసక్తి కనబర్చాలన్నారు. వర్మీ కంపోస్టు పిట్లు నిర్మించిన వారికి నిధులు మంజూరు చేసేందుకు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే ఉపాధి పథకంతో అనుసందానం చేసుకొని వీటి లక్ష్యాలు అధిగమించాలన్నారు. సి.సి పరిధిలో 75 వర్మీ కంపోస్టు పిట్లు కొత్తగా నిర్మించాలని పేర్కొన్నారు. లక్ష్యాలు అధిగమించకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసమీక్షలో డిపిఎంలు నారాయణరావు, ఏరియా కో-ఆర్డినేటర్ రవికుమార్, ఏపిఎంలు, సిసిలు పాల్గొన్నా రు.

‘గార్నెట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
శ్రీకాకుళం(రూరల్), మే 16: ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికై ఈనెల 19న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రధం చేయాలని సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి బోర అప్పలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద గార్నెట్ కార్మికుల సమ్మె 33వ రోజుకు చేరుకున్న సందర్భంగా సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అండతో గార్నెట్ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. యాజమాన్యం కార్మికులకు అతితక్కువ వేతనాలు ఇస్తూ తీవ్రంగా దోపిడీ చేస్తుందని విమర్శించారు. కార్మికులకు పి ఎఫ్, ఇ ఈ ఎస్ కట్టకుండా యాజమాన్యం మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో యాజమాన్యం చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌ను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగానే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్, షూస్ ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కరించకుంటే ప్రజల మద్దతుతో పోరాటాన్నిమరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎన్.ప్రసాద్, ఏ.సూర్యశివప్రసాద్, కోటేశ్వరరావు, లచ్ఛయ్య, ఎం.చిన్నప్పయ్య పాల్గొన్నారు.