శ్రీకాకుళం

ఇది చేతల ప్రభుత్వం:మంత్రి కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, జూన్ 4: రాజకీయాల్లో హామీలు ఇవ్వడం, ఇచ్చిన హామీలను అమలు చేయని నేతలు ఉన్న ఈ రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నిలబెట్టుకొని ప్రజా సంక్షేమం తన ధ్యేయంగా రాష్ట్రంలో సి ఎం చంద్రబాబునాయుడు, కేంద్రంలో నరేంద్రమోడీలు పనిచేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. సోంపేట సామాజిక ఆసుపత్రిలో కిడ్నీ రోగులు కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం ప్రారంభించిన ఆయన అనంతరం అక్కడి విలేఖరులతో మాట్లాడారు. దేశంలో ఇప్పటిదాకా 100 పడకల ఆసుపత్రుల్లో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లాలో దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్కలి, పాలకొండ, పలాస,సోంపేట వంటి 30 పడకల ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశంలోనే ఇదే ప్రథమమన్నారు. ఈ కేంద్రాలకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చి రోగులకు పూర్తిస్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, రోగి జీవనప్రమాణం పెంచేందుకు మాత్రమే డయాలసిస్ ఉపయోగపడుతుందని, సోంపేట డయాలసిస్ యూనిట్‌లో బ్లడ్‌బ్యాంకు, నెఫ్రాలజి యూనిట్‌లను మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తామని, రోగులకు మేలు జరిగే అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొద్ది రోజులు క్రితం కిడ్నీ రోగులను కలిసేందుకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్ దీనిపై కనీసస్థాయిలో అవగాహన లేకుండా మాట్లాడారని, మాటలు చెప్పడం తేలిక అని, వాటిని అమలు చేయడంలో నాయకులు పనితీరు ఉంటుందన్నారు. కిడ్నీ రోగులకు పింఛన్ ఇచ్చే కార్యక్రమంపై సి ఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడతామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుకు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి సహకరించారన్నారు. ఇది ఉద్దానం కాదని, ఉద్యానవన వనమన్నారు. కిడ్నీవ్యాధికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికి తాగునీరు వల్ల వచ్చే వస్తుందనే అనుమానంతో కోట్లాది రూపాయల వ్యయంతో కొత్తగా తాగునీటి ప్రాజెక్టులను ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌లో మరో నెఫ్రాలజి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యులు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడారు. కిడ్నీ రోగులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించారు. రాజకీయాలు తలపండినవారు కూడ ఈ కిడ్నీ వ్యాధిపై రాజకీయంగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి, డి ఎం అండ్ హెచ్‌వో తిరుపతిరావు, ఆర్‌బి ఎస్ కె జిల్లా కో ఆర్డినేటర్ ప్రవీణ్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్యారావు, సి ఎల్‌వో జగన్నాధరావు, సోంపేట, బారువ వైద్యాధికారులు లక్ష్మినారాయణ, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, శివాజీ, కొర్లాం, బట్టిగళ్లూరు, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.