శ్రీకాకుళం

వడదెబ్బపై అప్రమత్తత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 28: ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కారణంగా స్థానికులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని 108 సిబ్బంది అవగాహన సదస్సులను మండలంలో నిర్వహించారు. గురువారం ఎస్‌ఎం పురం, కేశవరావుపేట, ఫరీదుపేట గ్రామాల్లో స్థానికులకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. ముఖ్యంగా 20 నుండి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు ఎండల కారణంగా వడదెబ్బకు గురవుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాచారాన్ని 108కి అందిస్త్ఫ్లూయిడ్స్ తోపాటు చల్లని ప్రదేశంలో సేద తీర్చుకునేలా ప్రథమ చికిత్స అందిస్తామన్నారు.
గత మే నెలలో 40మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి నుండి ప్రజలు బయటపడేలా చల్లని వేళల్లో ప్రయాణాలు సాగించాలని, తాగునీరు సమీపంలో సూచించారు. జిల్లా ఎగ్జిక్యూటీవ్ కె.ఉమామహేశ్వరావు, శ్రీనివాసరావు, తవిటిరాజులు ఈ సదస్సులు నిర్వహించారు.