శ్రీకాకుళం

ర్యాగింగ్ జోలికి పోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 20: స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్ధులు చదువులు సాగించి తల్లిదండ్రుల కళలు సాకారం చేయాలే తప్ప ర్యాగింగ్ జోలికి పోయి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని క్రైం డి.ఎస్పీ వేణుగోపాలనాయుడు స్పష్టం చేసారు. మండలం చిలకపాలేం కూడలిలోగల శ్రీశివాని, ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలల్లో మంగళవారం ర్యాగింగ్‌పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ పాశ్ఛ్యాత్య దేశాల్లో గల ర్యాగింగ్ భూతాన్ని ఇక్కడి విద్యార్ధులు తరిమికొట్టి నైపుణ్యాభివృద్ధితో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ర్యాగింగ్ వలన గతంలో ఇబ్బంది పడ్డ అనేక మంది విద్యార్ధుల సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాలేకుండా సోదర భావంతో కలసిమెలసి ర్యాగింగ్ రహిత క్యాంపస్‌లుగా తీర్చిదిద్ది పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యను అందిపుచ్చుకొని చక్కటి ప్లేస్‌మెంట్లు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌లు బి.మురళిక్రిష్ణ, గోవిందరాజులు తదితరులు ఉన్నారు.
హోంగార్డుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం(రూరల్), జూన్ 20: జిల్లాలో 50మంది హోంగార్డ్(డ్రైవర్)పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు. రోజుకు రూ.400 వేతనానికి విధులు నిర్వర్తించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో నివసిస్తూ జూన్ 19, 2017 నాటికి 18 సంవత్సరాలు నిండి 50సంవత్సరాలలోపు వయస్సుగలవారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అభ్యర్థులు 7వ, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. ఈనెల 20వ తేదీ నుండి 24వరకు ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వడంతోపాటు స్వీకరించబడునని తెలియజేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పేరుమీద రూ.25 డిడి తీసి దరఖాస్తుతో జత చేయాలన్నారు. అభ్యర్థులు 160 సెంటీమీటర్లు ఎత్తు కలిగి డ్రైవింగ్ నైపుణ్యత పరీక్షలో పాల్గొనాలని తెలియజేశారు.