శ్రీకాకుళం

విద్యాబ్యాసంనుండే నైపుణ్యాలపై శ్రద్ధ వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 27: విద్యార్థులంతా విద్యాబ్యాసం నుంచే నైపుణ్యాలపై శ్రద్ద వహించాలని కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి సూచించారు. స్థానిక శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం వ్యవస్థాపకతపై శిక్షణా తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన అనేక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వీటిద్వారా దేశంలో మంచి అద్భుతమైన పరిణామాలను తీసుకురాగలుగుతామని గమనించాలన్నారు. ప్రతీ విద్యార్థి ముఖ్యంగా తనపై తాను నమ్మకంతో ముందుకు వెళ్లాలని ఆత్మస్థైర్యంతో ఫలితాలు సాధించడం సులువౌతుందన్నారు. పట్టుదలతో తనకు తానుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టంచేశారు. యువత కీలకంగా మారాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో కాలిఫోర్నియా యూనివర్శిటీ నుండి డాక్టర్ మోసామి, గుండ శివ, లీడర్‌షిప్ ఫౌండేషన్ నుండి విద్యార్థులు సాయివిజయ్, సునీత చావ్లా, ప్రవీన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి.వి మధుసూధనరావు, టిపివో జి.రాజేంద్రకుమార్, శ్రీ శివానీ ఎడ్యుకేషన్‌సొసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులు దుర్గాప్రసాదరాజు, బి.వెంకటరావు, కె.దుర్గాశ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, జామి సూర్యచంద్రరావు, విభాగాధిపతులు, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు. ఈశిక్షణా తరగతులు జూలై 7వరకు నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామాలను స్మార్ట్‌విలేజ్‌లుగా మార్చుతూ కావాల్సిన మెళకువలను ఈ శిక్షణలో నేర్పించడం జరుగుతుందని నిర్వాహకులు మధుకుమార్ తెలియజేశారు. శిక్షణా తరగతులకు వివిధ జిల్లాల నుండి 30మంది ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. తరగతులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని వక్తలంతా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్‌కు మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు సత్కరించారు.