శ్రీకాకుళం

కొవ్వాడ న్యూక్రియర్‌పై క్షేత్ర స్థాయిలో ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, జూన్ 27: రణస్థలం మండలం కొవ్వాడ గ్రామంలో నిర్మితం కానున్న న్యూక్రియర్ పవర్ ప్లాంటుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే దిశగా సంబంధిత యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మండల కేంద్రంలో సంచార వాహనం ద్వారా ప్రచారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా న్యూక్లియర్ విజ్ఞానంపై అవగాహన కల్పించారు. నగమ్‌మహంత్రా, ప్రాజెక్టు మేనేజర్ నిఖిల్‌హుడ్, బి. సంజీవరావులు సంచార వాహనం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్ధులకు పరమాణు విద్యుత్ విశిష్టతలపై ప్రస్తావించారు. ఒక కిలో కర్ర 1యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. అదేవిధంగా 1 కిలో బొగ్గు 3యూనిట్లు విద్యుత్‌కు, 1కిలో నూనె 4యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి కాగా 1కిలో పాకృతిక యురేనియం 50వేలు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఇది కాలుష్యరహితమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు బడగల వెంకటప్పారావు, ప్రధానోపాధ్యాయుడు దాలయ్య, జిల్లా జూనియర్ రెడ్‌క్రాస్ కౌన్సిలర్ ఎస్.ఎన్.సుధాకర్, పాఠశాల సిబ్బంది కార్యదర్శి పి. ఉద్ధవ్‌కుమార్, టి.గిరిరాజు, టి.శ్రీనివాస్, సత్యజిత్‌రాయ్, రామక్రిష్ణ, రోజారమణిలతో పాటు సిబ్బంది, విద్యార్ధులు ఉన్నారు.

జూలై 1 నుండి అన్నా అమృతహస్తం ప్రారంభం
* పివో అనంతలక్ష్మీ
నరసన్నపేట, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1 నుండి అన్నా అమృతహస్తం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిణి అనంతలక్ష్మీ తెలిపారు. మంగళవారం నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో గర్బిణీలకు, బాలింతలకు వారి గృహాలకు పౌష్టికాహారం పంపడం జరిగేదని అయితే ఈ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల వద్దే వారికి భోజన సదుపాయాలను కలుగజేయడం జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించి రోజుకు ఒక్కొక్కరికీ రూ.15 విలువ కలిగిన ఆహారాన్ని అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో సూపర్‌వైజర్లు జయలక్ష్మీ, సీతారత్నం, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.