శ్రీకాకుళం

పాత వ్యూహం..కొత్త అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహానికి పదునుపెట్టారు. జిల్లాలో అన్నీ నియోజకవర్గాలు స్వీప్‌గా విజయాలు సాధించేందుకు సర్దుబాట్లుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాత వ్యూహామైనా..కొత్త అభ్యర్ధులను తెరపైకి తీసుకువచ్చి టిడీపీకి సరైన పోటీగా దించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి మూడేళ్ళు పూర్తికావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు జిల్లాలు వారీగా రచించాలని లోటస్‌పాంట్ స్కేచ్ వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయంగా అతి చైతన్యవంతమైన శ్రీకాకుళం జిల్లా సెంటిమెంటుగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నుంచి మొన్నటికి మొన్న నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కావడంలో శ్రీకాకుళమే కీలకంగా మారింది. నాడు - నేడు ఈ జిల్లా నుంచి అధిక శాతం శాసనసభ్యులు అధికార పార్టీ నుంచి విజయం సాధించడం సెంటిమెంటు సక్సెస్ అయ్యింది. ఇదే ఫార్ములాను విపక్షనేత జగన్మోహన్‌రెడ్డి కూడా అమలుచేసే బాధ్యతను రాజకీయ చాణుక్యుడైన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించినట్టు ప్రచారం సాగుతుంది. ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల వరకూ పది నియోజకవర్గాలను వైకాపా తన ఖాతాలో జమచేసుకునేందుకు వ్యూహాలకు ధర్మాన పదునుపెడుతున్నారు. కేడర్ మధ్య అంతరాలు, బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతం, సమన్వయకర్తల పనితనం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి అధినేత సారించి సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నివేదికలను ప్రాతిపదికగా చేసుకుని జగన్ మార్గదర్శకత్వంలో ధర్మాన వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను జిల్లా వరకూ అప్పగించినట్టు బోగట్టా. అత్యధిక శాసనసభ స్థానాలు జిల్లాలో గెలుచుకోవాలంటే పార్లమెంటు అభ్యర్థి కీలకమని భావించి ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. గడచిన ఎన్నికల్లో ఎం.పి. అభ్యర్థిగా బరిలో దిగిన రెడ్డి శాంతికి పాతపట్నం నియోజకవర్గం బాధ్యతలను అప్పగించి 2019 ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యే బి.్ఫరం ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉంది. దీంతో ఎం.పి. అభ్యర్థి ఎవరైతే అన్ని నియోజకవర్గాల్లో ఓటుబ్యాంకు పెరుగుతుందన్న చర్చ ఆ పార్టీ హైకమాండ్ ప్రారంభించింది. తొలుత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును తెరపైకి తెచ్చినప్పటికీ, ఎన్నికల క్యాంపైన్‌లో ఆయన శక్తియుక్తులు వినియోగించుకునేందుకు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచే బరిలో దింపాలని, ఎం.పి. ప్రతిపాదనను యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. ఇక మరో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పేరును కూడా పరిశీలిస్తూ ఏడు నియోజకవర్గాల్లో కాళింగ సామాజికవర్గానికి చెందిన ఓటుబ్యాంకును కూడా అధినేత భేరీజు వేస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఆమదాలవలస నియోజకవర్గం నుంచి అభ్యర్థి ఎవరన్న ఆసక్తికరమైన చర్చ పార్టీలో మొదలైంది. తమ్మినేని కుటుంబ సభ్యులకు బి.్ఫరం ఇవ్వాలా? లేకుంటే, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతిని పార్టీలోకి ఆహ్వానించి తమ్మినేనికి పార్లమెంటు సీటును కేటాయించాలన్న సమాలోచన కూడా లేకపోలేదు. ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ వైకాపాను వీడిపోతానంటూ ప్రకటించడంతో యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావుకు దాదాపు బి.్ఫరం ఖరరయినట్టే. పలాస నియోజకవర్గంలో బి.్ఫరం ఫైట్ మాజీ ఎమ్మెల్యే జుత్తు, తాజా సమన్వయకర్త అప్పలరాజుల మధ్య ఉండగా, మరోకరిని మార్పులుచేర్పుల్లో తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్న సొంత నియోజకవర్గం టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ను పక్కనపెట్టి, తిలక్‌కు సమన్వయంకర్తగా నియమించిన తర్వాత అక్కడ వైకాపా శ్రేణుల్లో ముఠాలుగా మారిపోయాయి. ఈ కుమ్ములాటలకు చెక్‌పెట్టి, మంత్రి అచ్చెన్నకు గట్టిపోటీ ఇచ్చేలా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని బరిలోకి దింపేందుకు వైకాపా యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్, పాలకొండ, రాజాంల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్.కళావతి, కంబాల జోగులు బరిలో ఉంటారు. రాష్ట్ర టిడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు సొంత నియోజకవర్గం ఎచ్చెర్ల నుంచి బలమైన వ్యక్తిని అనే్వషిస్తున్నారు. ఇప్పటి వరకూ గొర్లె కిరణ్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహారిస్తున్నప్పటికీ పార్టీ బలోపేతం కాకపోవడంతో చివరి క్షణంలో మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ మేనళ్ళుడు చిన్నశ్రీను రంగంలోకి దింపేందుకు హైకమాండ్ వ్యూహం రచిస్తున్నట్టు బోగట్టా. ఇలా...స్వీప్‌గా వైకాపా విజయాలకు వ్యూహాం రచించేందుకు జిల్లా బరువుబాధ్యతలు ధర్మానకు జగన్ అప్పగిస్తేనే - వైకాపా అభ్యర్ధులు అధికారపార్టీకి బలమైన పోటీగా నిలిచే అవకాశం ఉంటోంది!