శ్రీకాకుళం

ఎసిపి ప్రభాకర్‌కు ఇండియన్ పోలీస్ మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 15: జిల్లాకు చెందిన ఏసిపి కింజరాపు ప్రభాకర్‌ను ఇండియన్ పోలీస్ మెడల్ ( ఐ పి ఎం) వరించింది. ప్రభాకర్ విశాఖపట్నం నగర ట్రాఫిక్ ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ పోలీస్ మెడల్‌ను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం తిరుపతిలో అందజేశారు. దివంగత కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు , రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుల సోదరుడు ప్రభాకర్ 1991లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై సమర్థవంతమైన విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు వనె్న తెచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2001లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా, 2011లో డిఎస్పీగా పదోన్నతులను అందిపుచ్చుకుని ఆ శాఖలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ విధి నిర్వహణలో పారదర్శకత చాటుకొని అధికారులు, ప్రజా ప్రతినిధుల మన్ననలను పొందుతూ ముందుకు సాగారు. ఏసిపి ప్రభాకర్‌ను పోలీసు మెడల్ వరించడం పట్ల హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి.
కాశీబుగ్గలో కుండపోత వర్షం
పలాస, ఆగస్టు 15: కాశీబుగ్గలో మంగళవారం సాయంత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి లో కుండపోత వర్షం కురిసింది. సుమా రు రెండు గంటల పాటు వర్షాలు కురవడంతో లేబర్‌కాలనీలోని పలు ఇళ్లుల్లోకి వర్షపునీరు చేరడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. సూదికొండ ప్రాంతంలో కురిసిన వర్షానికి కొట్టుకువచ్చిన వర్షపునీరు మున్సిపాలిటీలో కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వీధుల్లోని రహ దారులపై ప్రవహిస్తూ ఇళ్లు అన్ని జలమయమైనాయి. లేబర్‌కాలనీలో రఘురామరైస్‌మిల్లులో మోకాళ్లు లోతు వరకు నీరు నిల్వ ఉండడంతో ఆ ప్రాంతంలోని ఇళ్లుల్లోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఆ నీటిని తోడేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వర్షాలు చూడలేదని, గడిచిన రెండు రోజులుగా పగటి పూట తీవ్రమైన ఎండ, ఉక్కబోతతో ఉన్న వాతావరణం సాయంత్రం సరికి భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఆకట్టుకున్న శకటాలు
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా పలు శాఖలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ పలు శకటాలను ప్రదర్శించారు. ముందుగా వైద్య, ఆరోగ్య శాఖ ప్రదర్శించిన శకటంలో తట్టు-రుబెల్లా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం, ఎన్టీ ఆర్ వైద్య సేవలు, చంద్రన్న వైద్యం, ఉద్దానం కిడ్నీవ్యాధులపై పరిశోధన, ఆరోగ్యపరిరక్షణలోవైద్య శాఖ ముందంజ ఉండే విధానాన్ని శకటాల ద్వారా తెలియజేశారు. డి ఎం అండ్ హెచ్ వో ఎస్.తిరుపతిరావు, డాక్టర్ దవళభాస్కరరావు, మెండ ప్రవీన్, బగాది జగన్నాధరావు, తదితరులు ఉన్నారు. వ్యవసాయ శాఖ ప్రదర్శించిన శకటంలో వ్యవసాయ యాంత్రీకరణ, రైతు రధం పథకం, జీరో బడ్జెట్ వ్యవసాయానికి ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను ప్రదర్శించారు. పౌరసరఫరాల శాఖ జిల్లాను పొగరహిత జిల్లాగా ప్రకటిస్తూ తెలియజేశారు. జలవనరుల శాఖ శకటం, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటంలో ఎన్టీ ఆర్ గృహ నిర్మాణ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలను వివరించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రకటించిన శకటంలో స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛమైన నీటిని త్రాగడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చునన్న విషయాన్ని తెలియజేశారు. సర్వశిక్ష అభియాన్ ప్రకటించిన శకటంలో అమ్మ ఒడి- ప్రభుత్వ బడి, చంద్రన్న సైకిళ్లు పంపిణీ, దివ్యాంగులకు విద్యనందించే భవిత భవనంలో దివ్యాంగులకు ఫిజియోథెరఫీ వంటి కార్యక్రమాలు, దివ్యాంగులకు మేమున్నాం అంటూ భరోసాను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అగ్నిమాపక శకటంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వీరు చేపట్టే కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రదర్శించిన శకటంలో సేఫ్టీ ఫస్ట్ అంటూ హెల్మెట్ ధరించాలని వీటి వలన తమ ప్రాణాలను కాపాడుకోవచ్చునని తెలియజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ ప్రదర్శించిన శకటంలో ఉపాధి విజయరధం, గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు ఏర్పాటు, తడిపొడి చెత్తను వేరేచేసి ఎరువుగా తయారు చేసే విధానం, నీటి కుంటలు, పంట సంజీవిని వంటి కార్యక్రమాలను వివరించారు. సమగ్ర గిరజనాభివృద్ధి సంస్థ(సీతంపేట) ధింషా నృత్యంతోపాటు శాఖ ద్వారా చేపడుతున్న పలు కార్యక్రమాలను శకటం ద్వారా ప్రదర్శించారు.