శ్రీకాకుళం

అన్నపూర్ణగా సిక్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 15: ఏడాది సమయంలో..నాగావళి - వంశధార నదుల అనుసంధానంతో జిల్లాను అన్నపూర్ణగా చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పంలో సిక్కోల్‌లో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయా వంటి నదుల సంగమ‘సిరి’తో అన్నదాతల కలలసాకారం చేసేందుకు అనుక్షణం ప్రభుత్వం తపిస్తుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, కార్మికశాఖ మంత్రి పితాని సత్యన్నారాయణ పేర్కొన్నారు. జిల్లాలో చివరి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో ప్రజల సహకారంతో పూర్తి చేస్తే సిక్కోల్ సస్యశ్యామలం అవుతుందన్నారు. అందుకు వంశధారే ప్రధాన సాగునీటి కారకమన్నారు. జిల్లాలో అపారమైన జలవనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు నిర్వాసిత కుటుంబాలు పెద్దమనషుతో ముందుకు వచ్చి ప్రాజెక్టు పనులన్నీ సాఫీగా జరిగేవిధంగా సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసారు. మంగళవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అందుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏడాది కాలంలో 28 ప్రాజెక్టులు రైతులకు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి తలపెట్టిన జలసిరికి ఇక్కడ కూడా వంశధార నదికి హారతి ఇవ్వాలన్న ఆకాంక్షతో ఆ పనులు వచ్చే ఏడాది ఐదో తేదీ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలన్న ఆశయానికి అడ్డంకులు లేకుండా నిర్మాణాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ప్రతీ అన్నదాతకు ఉందన్నారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి హైలెవల్ కెనాల్ ద్వారా వంశధార - నాగావళి నదులను అనుసంధానించి, ఐదు వేల ఎకరాల నూతన ఆయకట్టు, 37 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో జిల్లాలో నాలుగు మండలాలు లబ్దిపొందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. వంశధార, నాగావళి నదులు అనుసంధానం చేయుటకు ప్రభుత్వం ఇప్పటికే పనులు మంజూరు చేసిన విషయం విదితమే. రైఖిల్లగెడ్డ, గంగసాగరం, కొండతోయగెడ్డ మైనర్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేయుటకు, దుర్గగెడ్డ, భీంపురం గెడ్డ, రోవగూడగెడ్డ, కుంబిడిగెడ్డ, రాల్లగెడ్డ మైనర్ ఇరిగేషన్ పథకాల నిర్మాణం చేపట్టుటకు అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్న విషయాలను సుస్పష్టంగా వివరించారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు కాలువల ద్వారా నీటిని అందించలేని ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా అందించుటకు అనేక ప్రాంతాల్లో మంజూరు చేసామన్నారు. కొత్తూరు మండలం కడుమ, మాతల పథకాలకు రూ. 19.82 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. 12 ఎత్తిపోతల పథకాలకు డిస్ట్రిబ్యూటరీ పైపు లైన్లు వేయుటకు ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 11.56 కోట్లు మంజూరు చేసి దాదాపు 8,620 ఎకరాలకు సాగునీరు అందించుటకు పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సారవకోట మండలం బొంతు సారవకోట, కొత్తూరులలో రూ. 185.13 కోట్లతో పనులను మంజూరు చేసుకున్నామని, నవతల కొండపేట ఎత్తిపోతల పథకాలను రూ. 46.41 కోట్లతో మంజూరు చేసుకున్నామని, 2018 ఖరీఫ్ నాటికి నీరు అందించుటకు చర్యలు చేపడుతున్నామని, సమగ్ర నీటి యాజమాన్య కార్యక్రమం కింద 15 మండలాల్లో రూ. 24.51 కోట్లు ఖర్చు చేసి 9,727 పనులు చేపట్టడం జరిగిందన్నారు. నీరు ప్రగతి కార్యక్రమం క్రింద జిల్లాలో రూ. 202 కోట్ల విలువగల 2531 పనులను మంజూరు చేసుకుని రూ. 60 కోట్లు విలువగల 821 పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్టు వివరించారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచార వాహకాలను ఎంపిక చేసుకుని రెండు అంకెల వృద్ధికి ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తోన్న తరుణంలో సిక్కోల్ జిల్లాలో సగటు తలసరి ఆదాయాన్ని రెండు అంకెల వృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రతీఒక్కరూ కంకణబద్దులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిక్కోల్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌లోనే అత్యున్నత ప్రమాణాలుగల జిల్లాగా తీర్చుదిద్దుటకు సహకరించాలన్నారు. జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా కనుక ఇక్కడ వ్యవసాయానికి సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో రైతులు ఆధునిక పద్దతులు పాటించకపోవడం, నూతన యాజమాన్య పద్దతులు అనుసరించకపోవడం వలన అనుకున్న దిగుబడులు సాధించడం లేదన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. అధిక నీటిని వినియోగించడం అనర్థదాయకమని తెలుసుకోవాలన్నారు. తుపానుల భారి నుంచి తప్పించుకునేందుకు ఈ సారి పంట వేసే కాలాన్ని రెండు వారాలు ముందుకు తీసుకువచ్చి సాంకేతిక విప్లవానికి వ్యవసాయరంగంలో జోడించామన్నారు. ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రకృతిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైన ఉందని, వనాలను పరిరక్షించుకోవడం వల్ల వాతావరణ సమతౌల్యత ఉంటోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ, వికలాంగులు, మత్స్యకారులు, మహిళలు తదితర వర్గాల వారి సంక్షేమానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, కాపుల అభ్యున్నతికి, బ్రహ్మణుల అభ్యున్నతికి కాపు, బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. గిరిజనం కోసం వివిధ పథకాలు కింద రూ. 12.15 కోట్లుతో 599 యూనిట్లు మంజూరు చేసామన్నారు. బి.సి.కార్పొరేషన్ ద్వారా 8117 మందికి రూ. 79.17 కోట్లుతో స్వయం ఉపాధి కార్యక్రమాలను అందించుటకు చర్యలు చేపట్టామన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి 3,028 చెరువులలో చేపపిల్లల పెంపకం చేపట్టడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రూ. 1.61 కోట్లతో 602 మందికి పథకాలు మంజూరు చేసామన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలకు ఆర్థికస్వావలంబన చేకూర్చేలా చర్యలు చేపట్టామన్నారు. చేనేత వస్త్రాలకు జిల్లా ప్రసిద్ధి చెందినది, పొందూరు ఖాదీ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిందన్నారు. అటువంటి చేనేత పరిశ్రమను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 కోట్లు నిధఉలను కేటాయించిందన్నారు. యువతది కీలక పాత్ర కనుక వారి శక్తిని సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యతగా ప్రభుత్వం నైపుణ్య అభివృదిధ కార్యక్రమాలను యువత కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిందన్నారు. ప్రతీ రంగంలో ఉన్న పేదలకు అండగా ప్రభుత్వం ఉందని తెలియజేసారు. చంద్రన్న భీమా పథకం అద్భుతంగా ఉందన్నారు. అక్షరాస్యత గల సమాజం కోసం అందరూ పని చేయాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి జిల్లాను పీడిస్తున్న కిడ్నీరోగులకు అండగా సర్కార్ నిలిచిందనానరు. జిల్లాలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి స్వచ్ఛశ్రీకాకుళం పిలుపును అందుకోవాలనానరు. శ్రీకాకుళం పట్టణాన్ని అమృత్ పట్టణంగా భారత ప్రభుత్వం ఎంపిక చేసినందుకు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ పంద్రాగస్టు సంబరాల్లో ముందుగా ఇన్‌ఛార్జి మంత్రి పితాని జాతీయ పతకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేసారు. ఈయనతోపాటు కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి , ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెసి చక్రధరబాబు, జెసి-2 పి.రజనీకాంతారావు, ఎస్పీ త్రివిక్రమవర్మ, ఏ ఎస్పీ షరీనాభేగమ్ తదితరులు పాల్గొన్నారు.