శ్రీకాకుళం

నిరుపేదలకు అండగా దేశం ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో టిడిపి హయాంలో ప్రతీ ఒక్క నిరుపేదకు అండగా టిడిపి నిలుస్తుందని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పారసిల్లి, కామేశ్వరిపేట పంచాయతీలలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాకుండా ప్రతీ ఒక్క నిరుపేదను గుర్తించి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమకే దక్కుతుందని వివరించారు. అలాగే రైతులకు ఆధుకునే విధంగా ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ యంత్ర పరికరాలపై 80శాతం రాయితీని అందిస్తుందని వివరించారు. దీనిలో భాగంగానే ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికీ టిడిపి కార్యక్రమం ప్రతీ ఒక్కరిలో చైతన్యం నింపుతుందని వివరించారు. పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ హయాంలో ఫసల్‌యోజన భీమా పథకం
నరసన్నపేట, సెప్టెంబర్ 21: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా ప్రధాన మంత్రి ఫసల్‌భీమా యోజన పథకాన్ని గత రెండు సంవత్సరాలుగా అమలులోనికి తీసుకురావడం జరిగిందని జిల్లా గణాంకాధికారి ఖగేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వ్యవసాయశాఖాధికారులు, రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గతంలో పంట చేతికి వచ్చిన తరువాత నష్టపడ్డ రైతులకు భీమా పథకాన్ని వర్తింపజేయడం జరిగేదని అయితే ప్రధానమంత్రి మోదీ ఆదేశాలనుసారం వరినాటిననుండే ఈ పథకాన్ని వర్తింపజేసే దిశగా దీనిని అమలు చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే పంట కోత ప్రయోగాలను కూడా విస్తారంగా పెంచడం జరిగిందని దీనిని ప్రభుత్వ సిబ్బంది నమోదు చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జె.రామారావు, వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏ ఎస్ వో రమేష్, సూపరింటెండెంట్ ఎం.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.