శ్రీకాకుళం

రుణమాఫీకై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రుణమాఫీకి కట్టుబడి రెండు విడతలు నిధులు జమ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,98,318మంది రైతులు లబ్ధిపొందారు. రెండు విడతల్లో రూ.400.36కోట్లు నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇక మూడవ విడత విషయానికొస్తే 1.46లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి జమ కావాల్సిన రూ.114.99కోట్లను బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటనలు రైతులను ఊరిస్తున్నాయి. కనీసం దసరా పండగను పురష్కరించుకొని ఈ నిధులు జమ అవుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిన్నమొన్నటి వరకు వరిసాగు పనుల్లో బిజీగా ఉన్న రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయ మదుపుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం వ్యయసాయంగా మారినా అనాదిగా తాతతండ్రుల నుండి దీనిని నమ్ముకుని ఉన్న కుటుంబాలు ఆరుగాళం కష్టపడుతూ ఖరీఫ్‌లో వరిసాగు చేస్తున్నాయి. అయితే రైతులను కష్టాలుమాత్రం వెంటాడుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు తెగుళ్లు, ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం వంటి ప్రధానాంశాలు అన్నదాతల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పండించిన ధాన్యానికి కూడా మద్దతు ధర రాని దయనీయ పరిస్థితులు ఆ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటువంటి ఈతిబాదలు ఎదుర్కొంటున్న రైతాంగానికి రుణవిముక్తి ప్రభుత్వం కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆ ఫలాలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మందికి రుణమాఫీ పత్రాలు అందకపోవడం వాటిని ప్రామాణికంగా చేసుకొని నిధులు జమ చేయడం వలన పలువురు రైతులు ఈ పథకాన్ని అందిపుచ్చుకోలేని ప్రతికూల పరిస్థితులు లేకపోలేదు. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌నెంబర్లలో తప్పులు దొర్లడం వలన ఏర్పడ్డ సాంకేతిక కారణాలు కూడా పలువురు రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగా మారిందన్న నిజం అధికారులకు తెలిసినప్పటికీ వీటిని పరిష్కరించలేని చర్యలు అనేక కుటుంబాలకు విముక్తి కలిగించలేదు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌కు ముందే రుణమాఫీ నిధులు విడుదలౌతాయని రైతులు ఆశించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. సి ఎం చంద్రబాబు తాజాగా 3వ విడత నిధులు విడుదలయ్యాయని ఈనెల 10లోగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనిని సమర్థించేలా వ్యవసాయ శాఖామంత్రి సోమురెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరింత ప్రచారం పెంచినప్పటికీ నిధులు మాత్రం జమ కాకపోవడం రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడవ విడతలో జిల్లాలో 38మండలాల్లో రైతులు ఏకంగా రూ.114.99కోట్లు మేర సమకూరుతాయని వ్యవసాయ శాఖ అధికారులు కూడా అంచనాలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగా లబ్ధిదారులకు రుణమాఫీ ఉపశమన పత్రాలు బ్యాంకులకు తీసుకువెళితే వారు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని అవగాహన కల్పించారు. దీనిపై ఆశలు పెంచుకున్న రైతులంతా వారివారి పరిధిలో ఉన్నబ్యాంకు శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుణ ఉపశమన పత్రాలను చేతపట్టుకుని బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ జమ కాలేదని బదులివ్వడంతో వారంతా నిరాశతో వెనుతిరుగుతున్నారు. సంబంధిత ప్రజాప్రతినిధులను ఆయా రైతులు రుణమాఫీపై ప్రశ్నిస్తున్నప్పటికీ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇంటింటికీ టిడిపి కార్యక్రమానికి గ్రామాలకు వెళ్తున్న నేతలను పలువురు రైతులు మూడవ విడత రుణమాఫీపై నిలదీస్తున్నా వౌనం వహించాల్సిన పరిస్థితి నెలకొంది. రుణమాఫీ ఫలాలు అర్హులకు దక్కాలన్న ఉద్దేశ్యంతో మొదటి విడతగా రూ.50వేలు లోపు ఉన్న రుణాలకు ఒక్కవిడతలో అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారికి గరిష్టంగా రూ.1.50లక్షలు పరిమితం చేసింది. వ్యక్తులుగా కాకుండా కుటుంబానికి వర్తింపజేసింది. ఇలా ప్రక్రియను ముందుకు నడిపించినప్పటికీ చాలా మంది రైతులకు నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. ఏది ఏమైనా రుణమాఫీ మూడవ విడత నిధులు సత్వరంగా విడుదల చేసి అన్నదాతలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
* స్పష్టంగా చెప్పలేం
రుణమాఫీ నిధులు విడుదల చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఎప్పుడు ఖాతాలకు జమ అవుతాయన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని వ్యవసాయ శాఖ జెడి రామారావు ‘ఆంధ్రభూమి’తో తెలిపారు. జిల్లాకు కేటాయింపులు జరిగిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే చర్యలు తీసుకుంటామన్నారు. రుణ విమోచన పత్రాలు ఆధారంగా జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

జ్యూట్ కార్మికులకు రెండు నెలల జీతాలు చెల్లించాలి
* కోర్టు ఆదేశాలు
ఆమదాలవలస, సెప్టెంబర్ 21: మండలంలో గల వెంకటబాలాజీ జ్యూట్ లాకౌట్‌కు ముందు కార్మికులకు చెల్లించాల్సిన రెండు నెలల జీతాలు, బకాయిలను వడ్డీతో సహా తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖపట్నం లేబర్‌కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ జ్యూట్ కార్మికుల సంఘం నాయకుడు రామినాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లేబర్ కోర్టు వారు విధించిన పలు వాయిదాలకు యాజమాన్యం గైర్హాజరయిందని ఆయన పేర్కొన్నారు. నష్టాల పేరుతో సుమారు 250మంది కార్మికు కుటుంబాలను యాజమాన్యం నట్టేట ముంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలుగా మారిన కార్మికులు ఉపాధి కోసం నానా ఇబ్బందులకు గురౌతున్నారని ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని రామినాయుడు కోరారు.