శ్రీకాకుళం

టిడిపితోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 23: టిడిపి హయాంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ టిడిపిలో భాగంగా నగరంలోని 12వ డివిజన్‌పరిధిలో నానుబాలవీధి, జాలారివీధి, వాడవీధి, రెల్లివీధి ప్రాంతాల్లో ఇంఛార్జ్ తండేపల్లి ఆనందకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా టిడిపి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని స్పష్టంచేశారు. పట్టణంలో అర్హులైన పేదలకు మొదటి విడతగా 1280 ఇళ్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అధనంగా 3160 ఇళ్లు మంజూరు అయ్యాయని స్థల సేకరణ పూర్తి అవగానే అర్హులను గుర్తించి వారికి కూడా ఇళ్లు కేటాయించడం జరుగుతుందని స్పష్టంచేశారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు ప్రభుత్వ భూములను సొంతానికి వాడుకునేవారని ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కెల్ల కొండలరావు, గంగు నాగేశ్వరరావు, తవిటయ్య ,ప్రసాద్, గణపతి, గొర్లె వెంకటరమణ, వెంకటేష్, సింహాద్రి,కమల, కళావతి, బొత్స చిన్నారావు, మహీబుల్లాఖాన్, కరగాన రాము, ప్రసాద్, ఉదయ్‌శంకర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.

టిడిపి వసుదైక కుటుంబం
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ వసుదైన కుటుంబం సభ్యులుగా బాధ్యతగల పౌరులుగా న్యాయ, రాజకీయ, కార్యనిర్వాహక వ్యవస్థ, పత్రికా రంగం తమ పరిధిని దాటి ప్రవర్తిస్తే పౌరులకు, సమాజానికి తప్పుడు సంకేతం చేరుతుందని టిడిపి నాయకులు ప్రధాన విజయరామ్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గుండ కుటుంబం అధికారంలో ఉన్న కాలం అభివృద్ధి జరిగిన ప్రజల ప్రశాంత జీవనానికి శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలియజేశారు. రేపటి విజయం గుండ కుటుంబానిదే అనే భావన ప్రతిపక్షాల సైతం అంగీకరించడం తెలిసిందేనన్నారు. మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన శ్రీకాకుళం అభివృద్ధికి పేద మధ్య తరగతి కుటుంబాల జీవనానికి భూతల స్వర్గమనే ప్రజల అవసరాన్ని గుర్తించి పరిపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహకరిస్తున్న గుండ అప్పలసూర్యనారాయణల నీతినిజాయితీ నిరాడంబరత పట్ల ప్రజల అభిప్రాయంలో మార్పు లేదని అన్నారు. ఎస్వీ రమణమాదిగ మాట్లాడుతూ తెలుగుదేశంప్రజలు గౌరవించిన విదానం ప్రజల ఆలోచనా విధానాలకు అద్దం పడుతుందన్నారు. మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ ఏనాడూ పదవికోసం దిగజారిన సందర్భంలేదని స్పష్టంచేశారు. గొర్లె కృష్ణారావు, కవిత, ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఉమ్మడి సర్వీసుల్లో భాషోపాధ్యాయులకు అన్యాయం
శ్రీకాకుళం(రూరల్) సెప్టెంబర్ 23: జీవో 74ద్వారా బాషోపాధ్యాయులను తీవ్రంగా వంచించారని భాషోపాధ్యాయులు శనివారం స్థానిక పొట్టి శ్రీరాములజంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. పదోన్నతులను ఎస్ జి టిలే తన్నుకుపోయేలా జీవో నెం.74ను రూపొందించారని నేతలు విమర్శించారు. స్కూల్ అసిస్టెంట్ (్భష), హెచ్ ఎం, ఎం ఈవో, జె ఎల్ పదోన్నతులన్నీ ఎస్ జిటిలకే కట్టబెట్టేలా సర్వీసు నిబంధనలను రూపొందించి భాషా పండితులను వంచించారన్నారు. సుదీర్ఘకాలం భాషా పండితులుగా పనిచేసి అనుభవం, అర్హత ఉన్నవారికి కాదని ఎస్ జిటిలకు పదోన్నతులు ఇప్పించేలా నిబంధనలు రూపొందించడం దారుణమన్నారు. భాషా పండిత వ్యవస్థ రద్దు కోరుతూ భాషోపాధ్యాయులు చేస్తున్న ఎన్నో విజ్ఞప్తులను కాదని సర్వీసు రూల్స్‌లో అన్యాయం చేయడం గర్హణీయమన్నారు. సుదీర్ఘపోరాటాల ఫలితంగా భాషోపాధ్యాయులు సాధించుకున్న జీవో 14,15లను ప్రస్తావించకుండా దీనితో ముడిపడి ఉన్న హైకోర్టులో ఉన్న న్యాయవివాధాలను పరిష్కరించకుండా ఉమ్మడి సర్వీసు జీవోను విడుదల చేయడం సరికాదన్నారు. తక్షణమే జీవో నెం.74ను సవరించి స్కూల్ అసిస్టెంట్(్భష) లకే ఇవ్వాలని హెచ్ ఎం, ఎం ఈవో, జె ఎల్ పదోన్నతులను అడ్డంకిగా రూపొందించిన బి ఈడితోపాటు పండిట్ శిక్షణ కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు వసంతరావు, రఘుపాత్రుని శ్రీనివాసరావు, పెంట శివరామకృష్ణ, మురపాక సన్యాసిరావు, పి.కృష్ణారావు, గిరిధరరావు, ఎన్.చంద్రరావు, త్రినాధరావు, జి.మీనాకుమారి, కె.రంగనాయకులు, పి.వి రమణ, జి.అప్పలరాజు, ఫల్గుణరావు, సూర్యలక్ష్మీ, గొటివాడ సుగుణ, ఎస్. అబ్రహం, లక్ష్మీపతి, బి.గోపాలరావు, బి.సూరిబాబు, ఎన్. ఏకాంబరేశ్వరశర్మ, లోలుగు ఆనందరావు, కె.తేజేశ్వరరావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేరడి బ్యారేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలి
* ఎమ్మెల్యే కళావతి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 23: దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కోసం కలలు గన్న వంశదార రూపశిల్పి సి ఆర్ ఎం పట్నాయక్ రూపొందించిన నేరడి బ్యారేజీ నిర్మాణం వెంటనే ప్రభుత్వం చేపట్టాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి డిమాండ్ చేశారు. వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు వంశధార నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ రూపొందించారన్నారు. ఈ నెల 25న సోమవారం నేరడి బ్యారేజీ వద్దకు వైకాపా నాయకులంతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. నేరడి బ్యారేజీ రైతుల కోసం నిర్మించిన శాశ్వత కార్యక్రమమని దీనిని వెంటనే నిర్మించాలని కోరారు. పనులు వెంటనే ప్రారంభించాలని దీనిని సాధించుకునే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎం.వి పద్మావతి, మామిడి శ్రీకాంత్, కోణార్కు శ్రీను, సాదు వైకుంఠరావు, అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయరావు, పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఏడాదిలోగా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
జలుమూరు, సెప్టెంబర్ 23: గ్రామాలలో ఇప్పటివరకు మరుగుదొడ్లు లేని కుటుంబాలు ఒక సంవత్సర కాలం వ్యవధిలో మరుగుదొడ్లు నిర్మించుకునే విధంగా ప్రోత్సహించి అవసరమైన చర్యలు గైకొనాలని ఎంపిడివో జగదీశ్వరరావు గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షాసమావేశంలో మరుగుదొడ్ల అంశంపై ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వివిధ స్థాయిలలో సర్వేలు నిర్వహించిన అనంతరం మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అర్హులైన తుదిజాబితా ఖరారైందని ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించినట్లు ఆయన స్పష్టంచేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఇది వరకే మంజూరి ఉత్తర్వులు విడుదలైనట్లయితే ఆ జాబితా ప్రకారం లబ్ధిదారులను కలిసి నిర్మాణాలు త్వరితగతిని ప్రారంభించే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు కృషి చేయాలని స్పష్టంచేశారు. 2018 అక్టోబర్ నాటికి మండలంలో శతశాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని స్పష్టంచేశారు. గ్రామాల మధ్య లింకురోడ్లను బహిర్భూమిగా మారుస్తున్నారని దీనిని నివారించేందుకు బహిరంగమలవిసర్జన నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు, ఉపాధి హామీ ఏపివో శశిభూషణరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.

దేవీ ఆశ్రమంలో పూజలు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 23: మండలంలోని కుంచాలకూర్మయ్యపేట సమీపంలో ఉన్న శ్రీ చక్రాపురంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజరాజేశ్వరి దేవిని అలంకరించి వేకువజామునుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మూడవ రోజైన శనివారం శ్రీచక్రాపురం వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ అమ్మవారికి, ఉపాలయాలకు పూజలు నిర్వహించారు. పాల్గొన్న భక్తులంతా శ్రీచక్రమహామేరువుల వద్ద కుంకుమార్చనల, లలితపారాయణం నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు నిర్వహించడం వలన కలుగు శుభాలను బాలుస్వామి భక్తులకు వివరించారు. ఇదిలా ఉండగా మండలంలోని వివిధ గ్రామాల్లో దుర్గాదేవి మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిలకపాలెం, ఎచ్చెర్ల, కుశాలపురం, యాతపేట వంటి దుర్గాదేవి మండపాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కుశాలపురం దుర్గా మహేశ్వరాలయం, కొయిరాల వద్ద జై భవానీ ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, ప్రత్యేక పూజలు రుత్వికులు సాగిస్తున్నారు.

ఆర్థిక సంస్కరణలతోనే పలుమార్పులు
* జాతీయ గణాంకకమీషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ రాధాకృష్ణ

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: ఆర్థిక ప్రగతి, పేదరికం, ఉపాధి , విద్య తదితర అంశాల్లో స్వాతంత్య్రం అనంతరం ఆర్థిక సంస్కరణల తరువాత దేశంలో పలుమార్పులు చోటు చేసుకున్నాయని జాతీయ గణాంక కమీషన్ మాజీ చైర్మన్ ఆచార్య ఆర్.రాధాకృష్ణ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఆనందమయి కనె్వన్షన్ హాల్‌లో శనివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక ప్రగతి, పారిశ్రామికీకరణ కోసం ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయన్నారు. తొలి రోజుల్లో శాస్త్ర సాంకేతికంగా, పారిశ్రామికంగా ఎంతో ముందడుగు వేయాలని ప్రయత్నించినప్పటికీ 1970 నాటికి 3-4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైందన్నారు. అదే సమయంలో ఆసియా దేశాలు మంచి ఫలితాలు సాధించుకువచ్చాయన్నారు. సుస్థిరతకాని ఆర్థిక వృద్ది, విదేశీమార్గ నిల్వలు తగ్గుదల, ఆర్థిక లోటు సంబంధిత అంశాల్లో సంక్షోభం కారణంగా 1991 భారత్ ఆర్థిక సంస్కరణల బాట పట్టవలసి వచ్చిందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు నాడు పునాది వేయడంతో బ్యాంకింగ్,వాణిజ్య తదితర రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పెరిగేందుకు దోహదపడి 1993-2005 మధ్యలో వృద్దిరేటు 6.1శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. 2008 ఆర్థిక సంవత్సరం నాటికి 9.1 శాతానికి వృద్ది రేటు చేరడం దేశానికి శుభపరిణామమన్నారు. అంతర్జాతీయంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ వాటిని అధిగమించగలిగామన్నారు. ప్రపంచ ఆర్థిక ప్రగతి మందగమనంలో ఉన్నప్పటికీ దేశంలో రెండంకెల వృద్దిరేటు నమోదుకు అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లు వివరించారు. దీనికి అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. పరిశోధనారంగం, వౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పాలనావ్యవస్థలో మార్పులు కూడా ఇందుకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్దిరేటు పెరిగినప్పటికీ ఉపాధి రేటు తగ్గుతూ వస్తుందన్నారు. జి.డి.పిలో వ్యవసాయ రంగం వాటా 14శాతం కాగా దీనిపై ఆధారపడే వారి సంఖ్య 49శాతం ఉన్నారన్నారు. 2012 నాటికి దేశంలో 25కోట్లు మంది అత్యంత పేదరికంలో ఉండగా దీనిలో గ్రామీణ అసంఘటిత రంగాల్లో వారే అధికంగా ఉండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శక్తిహీనత, పౌష్టికాహార లోపం, శిశు మరణాలు ఆర్థికేతర పేదరిక సమస్యలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయన్నారు. ఉన్నత విద్యలో కళాశాలలు, సంస్థలు ఏర్పాటు సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధిక శాతం నాణ్యతకు దూరంగా బోధన సాగిస్తున్నాయన్నారు. 25శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్‌లు మాత్రమే భారత ఐటీ రంగానికి ఉపయోగపడుతున్నారని నివేదికలు స్పష్టంచేస్తున్నాయన్నారు. పరిశోదనా, అభివృద్ధి రంగాలపై మన దేశం అంతగా దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. ఆహార భద్రతాత, విద్యాహక్కు, ఉపాధి హామీ పథకం వంటి వాటికి మరింత ప్రధాన్యత ఇస్తే ఆర్థిక సామాజిక రంగాల్లో సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత విద్య రంగంలోమరిన్ని సంస్కరణలు చేపట్టినట్లయితే సవాళ్ల నుంచి భారత్‌బయట పడి అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తుందని ఆచార్య ఆర్.రాధాకృష్ణ విశే్లషించారు. ఈ స్నాతకోత్సవంలో ఇంఛార్జ్ వీసి జి.నాగేశ్వరరావు, పూర్వపు వీసి ఎస్.సుధాకర్, రిజిస్ట్రార్ తులసీరావు, ప్రిన్సిపల్ చిరంజీవులు, డీన్ టి.కామరాజు, చీఫ్ వార్డెన్ అడ్డయ్య, ప్రిన్సిపల్ బాబూరావు, పాలక మండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, ఎన్.జయరామ్, కెవి ఏ నాయుడులు ఉన్నారు. ఈసందర్భంగా రాధాకృష్ణను డాక్టరేట్‌తో పురష్కరించారు.

మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్
* ఎస్పీ త్రివిక్రమవర్మ
నరసన్నపేట, సెప్టెంబర్ 23: నియోజకవర్గంలోని పోలాకి మండలం తలసముద్రం గ్రామానికి చెందిన మహిళా హత్యకేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సి ఎం త్రివిక్రమవర్మ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు విచ్చేసిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 4న పోలాకి మండలం గొళ్లలవలస గ్రామానికి చెందిన లొట్టి రాజేశ్వరిని అదే గ్రామానికి చెందిన ఎల్.రమణ తలసముద్రం గ్రామం వద్ద రాత్రి వేళల్లో ఆమెను అనుభవంచి హత్య చేశాడని తెలిపారు. ఈ హత్యకు రాజేశ్వరికి మరో ఇద్దరితో అక్రమ సంబంధం ఉండటమే ఈ ఘటనకు దారి తీసిందని ఎస్పీ వివరించారు. ఈమేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని వివరించారు. ఈ కేసులో సి ఐ పైడిపినాయుడు కేసును దర్యాప్తు చేశారని స్పష్టంచేశారు.

ఘనంగా స్నాతకోత్సవ సంబరం
* ఆచార్య రాధాకృష్ణకు డాక్టరేట్ ప్రధానం * బంగారు పతకాలతో పురష్కారాలు
* విద్యార్థుల్లో ఉప్పొంగిన ఆనందం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 23: తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న అంబేద్కర్ విశ్వవిద్యాలయం మొదటిసారి స్నాతకోత్సవ సంబరం ఘనంగా నిర్వహించారు. తొలి స్నాతకోత్సవం శ్రీకాకుళం లోని అరసవల్లి సమీపంలో 80అడుగుల రోడ్డుకు ఆనుకొని ఉన్న ఆనందమయి కనె్వన్షన్ హాల్‌లో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఇంఛార్జ్ వీసి జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ జి.తులసీరావు, ఆచార్యులు పూలమాలలు వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మధ్యాహ్నం 3:30గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమైంది. గవర్నర్ హాజరు కాకపోవడంతో ఇంఛార్జ్ వీసికు ఎన్ సిసి కేడిట్‌లు గౌరవవంధనం పలికి తదనంతరం సమావేశ మందిరంలోనికి విచ్చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ పుస్తకంలో అధ్యక్షులు సంతకం చేసి అక్కడ నుంచి వేదిక మీదకు ముఖ్య అతిధి అధ్యక్షులు, రిజిష్ట్రార్,పాలకమండలి సభ్యులు చేరుకున్నారు. అనంతరం విశ్వవిద్యాలయ గీతాన్ని ఆలపించగా అందరూ నిల్చుని ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఇంఛార్జ్ వీసి నాగేశ్వరరావు వ్యవహరించారు. ఈయన అనుమతితో కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ జి.తులసీరావు ప్రారంభించారు. ఇలా సాగిన స్నాతకోత్సవం అడుగడుగునా హుందాతనాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఇంఛార్జ్ వీసి మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 2008లో రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ప్రారంభమైందన్నారు. ఆ సమయానికి ఇక్కడ ఏడుకోర్సులు ఉండేవని తాజాగా 21 కోర్సులు 1085మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ అభివృద్ధివైపు పరుగులు పెడుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించనున్నామన్నారు. జిల్లాలో 96 డిగ్రీ, పీజి కళాశాలలు అనుబంధంగా ఉన్నాయని వివరించారు. 32,730మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారన్నారు. ఈ వర్శిటీలో జర్నలిజం, యోగా, మెడికల్ అండ్ హెల్త్ వంటి ప్రత్యేక కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలా తన నివేధికలో వర్శిటీ ప్రతిభాపాఠవాలను వివరించారు. అనంతరం జాతీయ గణాంక కమీషన్ మాజీ చైర్మన్, జిల్లాకు చెందిన ఆచార్యులు రొక్కం రాధాకృష్ణకు గౌరవ డాక్టరేట్ పురష్కారం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ జీవిత విశేషాలను పాలకమండలి సభ్యులు కెవి ఏ నాయుడు చదువి వినిపించారు. అలాగే బెస్ట్ టీచర్ అవార్డును రిజిస్ట్రార్ జి.తులసీరావుకు ఇంఛార్జ్ వీసి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తులసీరావు జీవిత విశేషాలను ప్రిన్సిపల్ చిరంజీవులు చదివి వినిపించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జ్యోతిఫెడ్రిక్‌కు బెస్ట్ టీచర్ అవార్డుతో సన్మానించారు. పీజీ కోర్సుల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులైన పి.పుష్పలత, ఎం.రాజ్యలక్ష్మీ, యు.స్వాతి, ఎం.సంతోష్‌కుమార్, కె.్భవానీలకు దాతలతో సమకూర్చిన విరాళాలతో బంగారు పతకాలు అందజేశారు. అలాగే మరో 9మందికి పిహెచ్‌డిలు ప్రధానం చేశారు. 15మందికి మెరిట్ సర్ట్ఫికేట్లు పంపిణీ చేశారు. 9మందికి ఓడిలను ఈ సందర్భంగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు వీసి ఎస్.సుధాకర్, విశ్రాంతి ఇంఛార్జ్ ఎం.చంద్రయ్య, ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు, చీఫ్‌వార్డెన్ అడ్డయ్య, పాలకమండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, జయరామ్, కెవి ఏ నాయుడు, ప్రభుత్వ డిగ్రీ కశాశాల ప్రిన్సిపల్ బాబూరావు, బమ్మిడి పోలీసు, విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాధరావు, హనుమంతు కృష్ణారావు, సూర్య ఆసుపత్రి వైద్యులు గుంట శాంతారామ్, కళా ఆసుపత్రి వైద్యులు పి.వి రమణమూర్తి, ఉప్పలపేట ప్రసాదరావు, జి.హనుమంతరావు, బెజ్జిపురం యూత్‌క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు, స్వీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు కొమ్ము రమణమూర్తి, క్షేత్ర ప్రచారాధికారి కొండలరావు, ఆంధ్రాబ్యాంకు డి జి ఎం రాధాకిషన్, బి ఎం ఎం.వెంకటరావు, అధ్యాపకులు , విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. రిజిస్ట్రార్ జి.తులసీరావు వందన సమర్పణతో ఈ స్నాతకోత్సవాన్ని ముగించారు.

వంశదార నిర్వాసితులను అనచివేస్తే సహించేది లేదు
* సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి మధు
ఆమదాలవలస, సెప్టెంబర్ 23: శ్రీకాకుళంజిల్లా వంశదార రిజర్వాయర్ నిర్వాసితులను ప్రభుత్వం అనచివేస్తే సహించేది లేదని సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. శనివారం నిర్వాసిత బాధితులను పరామర్శించేందుకే జిల్లాకు విచ్చేసి శ్రీకాకుళం రోడ్ వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ నిర్వాసితుల చట్టం ప్రకారం రాయితీలను ప్రభుత్వం విధిగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. పోలీసులు టిడిపి ప్రభుత్వానికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ నిర్వాసితులపై దాడులు చేయడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 16మంది నిర్వాసితులను జైలులో పెట్టిన ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు కాలనీలు, ప్యాకేజీలు పూర్తిగా అందించిన తరువాతే ఆయా గ్రామాలను ఖాళీ చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. నిర్భందంతో బాధితులను హింసించడం ప్రభుత్వానికి న్యాయం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి సత్యన్నారాయణ, సి పి ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.