శ్రీకాకుళం

చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, సెప్టెంబర్ 24: అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయకత్వాన్ని బలపర్చాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కోరారు. మండలంలోని అక్కులపేట గ్రామంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని విప్ నిర్వహించారు. గడిచిన మూడున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడం వల్లే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి బ్రహ్మరధం పట్టారన్నారు. పార్టీ కేడర్ కూడా 80శాతం ఓటర్లు టిడిపితో ఉండేలా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనా ను. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు అందించి పార్టీ శ్రేణులు సి ఎం చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపరిచేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసీ బొడ్డేపల్లి మాధురి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, నారాయణపురం ఆనకట్టు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ తమ్మినేని అమర్‌నాధ్, తమ్మినేని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. తొలుత టిడిపి పతాకాన్ని ఆవిష్కరించి ఇంటింటికీ టిడిపి నిర్వహించి స్థానికులకు చంద్రబాబు పథకాలు వివరించచే కరపత్రాన్ని పంపిణీ చేశారు.