శ్రీకాకుళం

జాతీయ రహదారి విస్తరణ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలో ఉన్న 16 నెంబరు జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారిని ఆరువరుసల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. జిల్లా పరిధిలో పైడిభీమవరం నుండి ఇచ్ఛాపురం వరకు 193కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. 17 ఏళ్ల క్రింత నాటి ఎన్డీయే ప్రభుత్వం నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయగా ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం కూడా జాతీయ రహదారిని అభివృద్ధి చేయడానికి దృష్టి సారించింది. ఈ మేరకు ఇటీవల నిధులు కేటాయింపు కూడా జరిగింది. జిల్లా పరిధిలో మూడు ప్యాకేజీలుగా ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు రణస్థలం నుండి పైడిభీమవరం, రణస్థలం నుండి నరసన్నపేట వరకు మరోప్యాకేజీ, నరసన్నపేట నుండి ఇచ్ఛాపురం వరకు మూడో ప్యాకేజీగా నిర్వహించి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నేషనల్ హైవే అధారిటీ డిపిఆర్ సిద్ధం చేసింది. జిల్లాలో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాతీయ రహదారి విస్తరణ జరుగుతుందని ఆర్డివో దయానిధి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం, నవభారత్ జంక్షన్, ఆర్చ్ ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద, పెద్దపాడు అప్పన్నమ్మతల్లి ఆలయం సమీపంలో ఫ్లై వోవర్ నిర్మాణం చేయడానికి ప్రతిపాధనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి పైడిభీమవరంలో ఫ్లైవోవర్ వంతెన నిర్మాణానికి అడ్డుగా ఆక్రమణలు కూడా తొలగించడం జరిగింది. వాహనాల రద్దీ, ప్రమాదాల సంఖ్యను పరిగణనలోనికి తీసుకొని రణస్థలం, ఎచ్చెర్లలో ట్రాఫిక్ నియంత్రించే దృష్ట్యా బైపాస్ రోడ్డులను నిర్మించాలని నిర్ణయించారు. 200 అడుగుల వెడల్పుతో ఈ రహదారులను రూపుదిద్దుకునేలా భూసేకరణ పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ గ్రామాల్లో సర్వే నెంబర్లు సబ్ డివిజన్లు వారీగా ఏయే రైతు ఎంతెంత భూమి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమన్న వివరాలను కూడా సేకరించారు. ఇందుకు అనుగుణంగా సంబంధిత రైతులతో రెవెన్యూ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలుగా ప్రతిపాధనలు కూడా సిద్ధం చేసి మాస్టర్ కాపీని తయారు చేసినట్లు తెలిసింది. ఎచ్చెర్ల విషయానికొస్తే చిలకపాలెం టోల్‌ప్లాజా నుంచి ఎచ్చెర్ల, ఎస్ ఎం పురం రెవెన్యూ గ్రామాల పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే పనులు సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఈ రహదారి నిర్మాణం వలన వుడా పరిధిలో ఉన్న మండలాలు కావడంతో పట్టణీకరణ వైపు పరుగులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. బైపాస్ నిర్మాణం పూర్తయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుందని సంబంధిత నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌తో మరికొంతమంది రియాల్టర్లు ఇప్పుడే బైపాస్ రోడ్డుకు ఆనుకొని భూమిని కొనుగోలు చేసి భవిష్యత్‌లో లేఅవుట్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుచూపుతో లావాదేవీలు ప్రారంభించారు. రైతులు మాత్రం గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఓ స్పష్టత లేకపోవడం వలన వారంతా తీవ్ర ఉత్కంఠకు లోనౌతున్నారు. జాతీయ రహదారులకు కుడివైపుగా బైపాస్‌లు ఏర్పాటు కానున్నాయి. వీటికి సంబంధించి భూసేకరణ రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల తహశీల్దార్ల పర్యవేక్షణలో చేపట్టనున్నారు. ఇక్కడ బైపాస్ లు రావడం వలన ఈ రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలో ఏటా జరుగుతున్న సుమారు 2500 ప్రమాదాల్లో సగంపైగా ప్రమాదాలు జాతీయ రహదారిపైనే జరుగుతున్నాయి. ఆరులైన్ల విస్తరణ జరగడం వలన సర్వీసు రోడ్డుల్లో చిన్నచిన్న వాహనాలు , ఆటోలు వెళ్లడానికి మార్గం ఉంటుంది కాబట్టి ప్రమాదాల నివారణ జరుగుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా రణస్థలం నుండి నరసన్నపేటకు రూ.1450 కోట్లు నిధులను విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనా మరో ఏడాదిలో ఆరులైన్ల విస్తరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వలన జాతీయ రహదారి పక్కన మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

1న ఆదిత్యుని తాకనున్నసూర్యకిరాణాలు
* ఈవో శ్యామలాదేవి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 24: ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణస్వామివారిని అక్టోబర్ 1,2 వ తేదీల్లో మధురకిరణాలు తాకనున్నాయని ఈవో శ్యామలాదేవి, ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలియజేశారు.
అరసవల్లి దేవస్థానానికి సంబంధించి ఏడు కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేయడం జరిగిందని ఇకపై టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ కార్యక్రమం కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అంబేద్కర్, కలాంలు స్ఫూర్తిదాతలు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 24: భారత రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్, క్షిపణి శాస్తవ్రేత్త అబ్దుల్ కలాంలు స్ఫూర్తిదాతలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో సామాజిక సేవకులు బొడ్డేపల్లి నర్శింహులు సహకారంతో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, డాక్టర్ దానేటి శ్రీ్ధర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఏపిజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కళాశాల ప్రాంగణంలో గల మహాత్మగాంధీ విగ్రహానికి గిడుగువేంకటరామ్మూర్తి పంతులు విగ్రహానికి పూలమాలలు వేశారు. మొక్కలను ఈసందర్భంగానాటారు. కళాశాలలో జరుగుతున్న ఆడిటోరియం పనులు, రహదారి నిర్మాణ పనులు పరిశీలించారు. కళాశాల మైధానాన్ని పరిశీలించారు. మీడియా ప్రతినిధులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్, కలాంను అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు స్ఫూర్తిదాతలన్నారు. నాక్ ధృవీకరణకు వెళ్తున్న కళాశాల వివిధ పనులు చేపట్టిందని ఇందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే తమ నిధులను అందించి సహకరించడం శుభపరిణామన్నారు. ఇవి ఇతరులకు స్ఫూర్తివంతంగా ఉంటాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం మరామ్మతు పనులకు సహకరించడం సంతోషదాయకమన్నారు. అంబేద్కర్, కలాం విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలను మంచి పార్కులుగా తీర్దిదిద్దాలని అంతర్గత రహదారులకు ఇరువైపులామంచి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ ఇంజినీర్ జి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. మైధానం అభివృద్ధికి అవసరమైన నిధులకు అంచనాలు సమర్పించాలన్నారు. వౌలిక సదుపాయాల కల్పనకు జిల్లాయంత్రంగం వద్ద అందుబాటులో ఉన్న నిధుల నుండి మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం.బాబూరావు, వైస్ ప్రిన్సిపల్ జి.లచ్చన్న, అధ్యాపకులు, డి.పైడితల్లిరాజు, విగ్రహ దాతలు బొడ్డేపల్లి నర్శింహులు, డాక్టర్ దానేటి శ్రీ్ధర్, పూర్వ విద్యార్థులసంఘం అధ్యక్షులు వాన కృష్ణచంద్, సురంగి మోహనరావు, నటుకుల మోహన్, స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, బోటనీ అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎన్ స్వామి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్, డి ఎస్ డివో శ్రీనివాస్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, ఎన్ సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్టస్థ్రాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు
బలగ, సెప్టెంబర్ 24: స్కూల్‌గేమ్స్ అండర్-17 రాష్టస్థ్రాయి పోటీలకు జిల్లా జట్టును ఖరారు చేసి పోటీలకు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.ప్రభాకరరావు, కార్యదర్శి ఎం. ఎస్.సి శేఖర్ తెలియజేశారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నెల్లూరులో జరగనున్న పోటీల్లో ఈ జట్లు పాల్గొంటారు. జట్టు సభ్యులు ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటలకు ఆమదావలస రైల్లేస్టేషన్‌కు హాజరు కావాలని, వారంతా నాలుగు ఎలిజిబిలిటి ఫారాలు, రెండు ఫోటోలు, గత ఏడాది మార్కుల షీట్, ఆధార్‌కార్డుతో హాజరు కావాలని పేర్కొన్నారు. బాలుర జట్టులో ఎస్.శ్రీహర్ష, కె.తారకేష్, జి.ప్రకాష్, టి.చంద్రశేఖర్, టి.వినయ్, ఎ.చైతన్యసాయి, ఆర్.సాయివినయ్, విక్టర్ జీవశర్మ, ఎస్.సుందరరావు, జి.లోకేష్, బి.దినేష్, ఎస్.నవీన్‌కుమార్, ఎస్.మధు, ఎ.మహేష్, ఎస్.మల్లేష్, ఎన్.చైతన్య, ఎస్.్భస్కరరావు, ఎ.చంద్రశేఖర్‌లు జట్టులో ఉన్నారు. బాలికల జట్టులో పి.్భగ్యలక్ష్మి, ఎస్.రేవతి, పి.రాజేశ్వరి, ఎస్.రాధిక, వై.పరమేశ్వరి, కె.సుచిత్ర, సిహెచ్.వౌనలిక, టి.పల్లవి, ఎం.జాన్సీ, జి.హరిత, ఎస్.రాణి, కె.మేఘన, ఎస్.రవి, ఎస్.్భవాని, ఎస్.లక్ష్మి, ఎ.దుర్గ్భావానిలు జట్టులో ఉన్నారు.

స్థానిక పరిపాలనకు గండికొట్టిన టిడిపి
* జెడ్పీటీసీ ధర్మాన పద్మప్రియ
సారవకోట, సెప్టెంబర్ 24: మహాత్మగాంధీ కలలుగన్న స్థానిక పరిపాలనకు తెలుగుదేశం ప్రభుత్వం గండికొట్టిందని స్థానిక జెడ్పిటీసీ ధర్మాన పద్మప్రియ ఆరోపించారు. మండలంలోని వడ్డినవలస గ్రామంలో వైకాపా నాయకుడు ఇప్పిలి ఆంజనేయప్రసాద్ స్వగృహంలో ఆదివారం విలేఖర్లతో ఆమె మాట్లాడారు. ప్రజల ఓట్లుతో గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ఆయా చట్టసభలలో స్థానం లేకుండా ప్రభుత్వం చేసిందని జన్మభూమి కమిటీల పేరుతో సమాంతర పాలకవర్గాలను ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలలో జెడ్పిటీసీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదని గడిచిన మూడున్నరేళ్లుగా మండలంలోని గ్రామాలాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా జిల్లా పరిషత్ నిధులను జెడ్పిటీసీగా తాను కేటాయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశాలలో ఎమ్మెల్యేలు, మంత్రులు వాగ్వివాదం పెరగడంతో సభ్యులమైన తాము వౌనం దాల్చివలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని జెడ్పిటీసీలో అడిగిన ప్రశ్నలకు అధ్యక్షస్థానంలో ఉన్న చైర్‌పర్సన్ సమాధానాలు ఇచ్చే స్థితిలో లేరని ఆరోపించారు. జిల్లా పరిషత్ నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. టిడిపి నాయకులు గడచిన పదేళ్ల పాలనపై విమర్శలు చేయడం మినహా ప్రస్తుత పరిపాలనలో గల అవకతవకల గురించి మాట్లాడటం లేదని ఆమె అన్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపిటీసీలు జెడ్పిటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలారని జెడ్పిటీసీ ధర్మాన పద్మప్రియ ఆరోపించారు.
ప్రజా సంక్షేమానికి టిడిపి విశేష కృషి
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 24: పేదలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ టిడిపిలో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా టిడిపి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలుతెలియజేసే కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగుబలహీనవర్గాల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వాటిని అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టంచేశారు.
టిడిపి హయాంలోనే సిసి రోడ్ల నిర్మాణం జరిగిందని ప్రస్తుతం నగరానికి శివారు కాలనీలో సీసీ రోడ్లునిర్మాణం చేపట్టడం జరిగిందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, నగర టిడిపి అధ్యక్షుడు మాదారపువెంకటేష్, చిట్టి నాగభూషణం, వెంకన్నయాదవ్, ఎస్‌వి రమణమాదిగ, గంగు నాగేశ్వరరావు, సీపాన రమ, కరగాన రాము, భాస్కర్, ఇప్పిలి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
అజ్జరాం కొట్లాటలో కిరాయి గూంఢాలు !
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 24: మండలంలోని అజ్జరాం గ్రామంలో చెరువుల ఆక్రమణలపై తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్ బోర శ్రీనివాసరావు, పి ఏ సి ఎస్ అధ్యక్షులు బోర సాయిరాం వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొత్తకోణం వెలుగు చూడటం పోలీసుల సైతం విస్మయానికి గురౌతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేటలో ఇటీవలి స్థానిక ఎంపీటీసీ కొత్తకోట అమ్మినాయుడుపై హత్యాయత్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అజ్జరాం గ్రామానికి శ్రీకాకుళంనగరం నుంచి కిరాయి గూంఢాలు సుమారు 30మంది చేరుకుని స్థానికులను భయబ్రాంతులకు గురిచేయడం మండల వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. కేవలం భూ తగాదా రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాటకు దారి తీయడం క్షణికావేశం కాగా స్థానిక సర్పంచ్‌గా ఉన్న వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి కొంతమంది కిరాయి మూకలతో గ్రామస్తులపై దాడికి ఉసుకలపడం సరైన చర్య కాదని ఖండిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికులు తిరగబడగా ఆరుబైక్‌లను విడిచి కిరాయి మూకలు పలాయణం చిత్తగించాయి. ఈ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మున్ముందు ఇటువంటి సంస్కృతి విస్తరించకుండా ఉండేలా కిరాయి మూకలపై కఠినంగా వ్యవహరిస్తామని జె ఆర్ పురం సిఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ కృష్ణలు విలేఖర్లకు తెలిపారు. ఇదిలా ఉండగా ఇరువర్గాల్లో దాడికి గురైన వారు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అవుట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
రాజీ చేసే పనిలో టిడిపి నేతలు
కిరాయి మూకలు సంస్కృతి సరైంది కాదని ఖండిస్తున్న టిడిపి నేతలు ఓటు బ్యాంకుకు గండి కొట్టకుండా రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివాద స్థలా న్ని టిడిపి జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌద రి బాబ్జీ, ఎంపిపి బల్లాడవెంకటరమణారెడ్డి, బెండు మల్లేశ్వరరావు, అనె్నపు భువనేశ్వరరావు, గాలిరెడ్డి, నాగిరెడ్డి, జీరు రామారావు ఆదివారం గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు
గూంఢాలను విడిచిపెట్టేది లేదు: సి ఐ
భూ వివాదంలో జోక్యం చేసుకున్న గూంఢాలను విడచిపెట్టేది లేదని జెఆర్ పురం సిఐ రామకృష్ణ స్పష్టంచేశారు. బైక్‌లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వాటిపై మరింత లోతుగా విచారణ జరిపించి సంబంధిత వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శ్రీముఖలింగం, శ్రీకూర్మనాథులను దర్శించిన ఆర్‌జెడి
గార, సెప్టెంబర్ 24 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీకూర్మాం క్షేత్రంలో ఆదివారం కూర్మనాధునికి సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్ జెడి ఎన్.బాలగంగాధర్‌తిలక్ కుటుం బ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయం విశిష్ఠతలను, స్థల పురణాన్ని ఆర్ జెడి దంపతులకు వివరించారు. అలాగే అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి, శ్రీముఖలింగ క్షేత్రాలను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అక్రమ అరెస్టులపై నిరసన ర్యాలీ
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 24: జిల్లాలోవంశధార నిర్వాసితులకు అండగా జిల్లాపర్యటనకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అరెస్ట్‌కు నిరసనగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం డే అండ్ నైట్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాం ప్లెక్స్ వరకు నిరసన తెలిపారు. ఈ ర్యాలీని అంబేద్కర్ జంక్షన్‌లో అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సి పి ఎం నాయకులు డి.గణేష్, పి.తేజేశ్వరరావు, సిహెచ్ అమ్మన్నాయుడులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వంశదార నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించి నిర్వాసితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వారికి అండగా నిర్వాసిత గ్రామాల పర్యటనకు వెళ్లిన పి.మధు, చౌదరి తేజేశ్వరరావులను సిటు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే నిర్వాసితులకు అండగా నిలబడిన సి పి ఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తితో సహా 16మంది సి పి ఎంనాయకులపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. పాతపట్నం సబ్‌జైలులో ఉన్నవారిని మొదట మధు, పాతపట్నం జైలు వద్ద సి పి ఎం నాయకులను పరామర్శించి హిరమండలం వస్తుండగా నౌతల జంక్షన్ వద్ద 11మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సర్వం కోల్పొయి త్యాగం చేస్తున్న వంశదార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం నాయకులు కనకారావు, సత్యం, అప్పన్న, నారాయణరావు, ప్రభావతి, గోవిందరావు, మీన తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో సత్తాచాటండి
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
బలగ, సెప్టెంబర్ 24: రాష్టస్థ్రాయి క్రీడా పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులంతా జాతీయస్థాయిలో ఎ.పి జట్టు సత్తాచాటి ప్రధమస్థానంలో నిలవాలని స్థానిక శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి అన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో రెండు రోజుల నుంచి జరుగుతున్న మూడవ రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ సీనియర్ మహిళా ఛాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, బ్యాడ్మింటన్‌లో తెలుగమ్మాయి సింధు ప్రపంచస్థాయిలో సత్తాచాటడం గొప్పవిషయమన్నారు. పోటీల్లో ప్రధమ, ద్వితీయస్థానంలో సత్తాచాటిన పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జట్టుకు అబినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములు చూడకుండా పోటీల్లో పాల్గొనడమే పెద్ద గెలుపు అని పేర్కొన్నారు. గత ఏడాది జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తాచాటి ప్రధమస్థానంలో నిలిచిన రాష్ట్ర జట్టులో కీలకపాత్ర వహించిన పశ్చిమగోదావరి జట్టు ఐదుగురిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు మెమోంటో, పతకాలు అందజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జట్ట మధ్య జరగగా పశ్చిమగోదావరి 15-6 తేడాతో విజయం సాదించింది. అలాగే మూడో స్థానంకు విశాఖపట్నం, కృష్ణా జట్టు తలపడగా 7-3 తేడాతో విశాఖ జట్టు మూడోస్థానంలో నిలిచారు. ఈ మూడు స్థానాలకు ఎమ్మెల్యే జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు మనోహర్, కార్యదర్శి వెంకటేశ్వరరావు, సెలక్షన్ కమిటీ సభ్యులు నర్సింగరావు, జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు కృష్ణకుమార్, కార్యదర్శి ఐతమ్ గౌరీశంకర్, శాప్ స్టేట్ అబ్జర్వర్ లోపింటి దేవానందం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, ఎం ఎస్‌సి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.