శ్రీకాకుళం

ఏనేటికుండ కులానికి న్యాయం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి, సెప్టెంబర్ 25: ఏ కులానికి చెందకుండా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న ఏనేటికుండ కులానికి న్యాయం చేస్తానని రాష్ట్ర రవా ణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని నీలంపేట గ్రామంలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు, ఇతర పథకాలు అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ తెగల జాతిలో ఉండే ఏనేటికుండ కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసి, ఎస్‌టిల జాబితా నుంచి తొలగించి నేటికి వారికి దృవపత్రాలు జారీ చేయడం లేదని, ప్రస్తుతం ఏ జాతి తెలియకుండా పోయిందన్నా రు. సిఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లానని, త్వరలో వారికి న్యాయం చేస్తానన్నారు. పదేళ్లు కాంగ్రెస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గూర్చి వివరించారు. సంక్షేమ పథకాలు, సాగునీరు త్వరలో అందిస్తామన్నారు. ఇన్నీ చేస్తున్న ప్రతిపక్షపార్టీలకు ఎన్నికల్లో మోజార్టీ కల్పించడం ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. జడ్‌పిటిసి పద్మశ్రీనివాస్, వైస్ ఎంపిపి నాగయ్యరెడ్డి, ఎ ఎంసి ఛైర్మన్ విజయలక్ష్మి, జి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలను పరిశీలించిన నాక్ బృందం
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నాక్ బృందం సోమవారం సందర్శించింది. ఆచార్య బి ఎల్ చౌదరి(రాజస్ధాన్‌బోర్డ్ఫా సెకండరీ ఎడ్యుకేషన్, అజ్మీర్ రాజస్థాన్ చైర్మన్) నాక్ బృందానికి చైర్మన్‌గా వ్యవహరించగా డైరెక్టర్‌గా కమ్యూనింగ్ ఎడ్యుకేషన్ ఉత్కల్ విశ్వవిద్యాలయం భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్ సుస్మిత్‌ప్రసాద్‌పానీ సభ్యులుగా కో ఆర్డినేటర్‌గా ఎస్ ఎం పటేల్, గుజరాత్‌కు చెందిన డాక్టర్ అశ్విన్, ఏ.పురోహిత్ ప్రిన్సిపల్ మెంబర్‌గా బృందంలో ఉన్నారు. కళాశాలలో ఉన్నవౌలిక వసతులు, అధ్యాపకులు, బోధనా తీరు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు క్షుణ్నంగా పరిశీలించారు. సాయంత్రం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈనెల 26న కూడా కళాశాలను పరిశీలించి తుది నివేదికను నాక్ కార్యాలయానికి పంపిస్తారని ప్రిన్సిపల్ ఎం.బాబూరావు తెలిపారు. సోమవారం ఉదయం ఎన్ సిసి కెడిట్‌లో గార్డ్ ఆఫ్ ఆనర్‌తో స్వాగతం పలికారు. అధ్యాపకులు తమతమ విభాగాల ప్రగతిని నాక్ బృందానికి వివరించారు.