శ్రీకాకుళం

టూరిజం అభివృద్ధికి రూ. 6.35 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, సెప్టెంబర్ 25: సీతంపేట ఏజెన్సీ ప్రాంత అందాలను అభివృద్ధి చేసేందుకు ఏపి టూరిజం నుంచి రూ. 6.35 కోట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వీటిలో రూ.3.30 కోట్లుకు అనుమతులు రాగా మిగిలిన రూ.3.5 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ఐటిడి ఎపిఒ ఎల్.శివశంకర్ చెప్పారు. సోమవారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న పెద్దూరు రోడ్డులో పారాగ్లైడింగ్ సాహస క్రీడను ప్రారంభిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటలకు ఈ పారాగ్లైడింగ్ ప్రారంభించిన అనంతరం ద్విచక్ర వాహన రైడ్‌ను నిర్వహిస్తామన్నారు. సీతంపేట నుంచి పొల్ల వ్యూ పాయింట్, సున్నపుగెడ్డ జలపాతం ఏకో టూరిజం, చంద్రమ్మ హిల్ రాక్, జగతిపల్లి వ్యూ పాయింట్, ఎన్‌టిఆర్ జలవిహార్ పార్క్ నుంచి మెట్టుగూడ జలపాతం వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని పి ఒ తెలిపారు. ఆసక్తి కలిగిన యువకులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు పొల్ల వ్యూ పాయింట్‌కు 8.50 లక్షలు, సున్నపుగెడ్డ అభివృద్ధికి రూ.30 లక్షలు, చంద్రమ్మ హిల్ రాక్ రూ.35 లక్షలు, జగతపల్లి వ్యూపాయింట్ రూ.15 లక్షలు, పారాగ్లైడింగ్ రూ.20 లక్షలు, అలాగే రూ.కోటి తో ఆదివాసీ సంస్కృతి మ్యూజియం, విజ్ఞాన కేంద్రం అభివృద్ధికి అంచనాలు తయారు చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మొదటగా పారా గ్లైడింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సాహసోపేతమైన క్రీడకు టిక్కెట్ ధర రూ.1500గా నిర్ణయించామన్నారు. వారం రోజుల పాటు ఈ క్రీడను అందుబాటులో ఉంచుతామన్నారు. రానున్న రోజుల్లో ఎన్‌టి ఆర్ జలవిహార్ పార్కు సమీపంలోనే ఈ పారాగ్లైడింగ్ క్రీడకు శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నట్టు పి ఒ తెలిపారు. మెట్టుగూడ జలపాత అందాల అభివృద్ధికి రూ. 56.95 లక్షలు అంచనాలతో పనులు జరుగుతున్నాయన్నారు.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేయాలి

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25: పరిశ్రమలకు అందాల్సిన ప్రోత్సాహకాలు త్వరితగతిన అందజేయుటకు చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులను కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఆదేశించారు. డి ఐ పి సి సమావేశం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోత్సాహకాలకు పరిశ్రమలు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రతిపాధించాలన్నారు. పలాస ఇండస్ట్రియల్ పార్కులో సామెన్ ఫెసిలిటీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆక్రమణలు ఉంటే తొలగించాలన్నారు. విద్యుత్ స్తంభాలుమార్పు చేయాలని, ఎల్ ఇడి దీపాలు అమర్చాలని పేర్కొన్నారు. పలాస వద్ద మరో ఇండస్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసే జీడి పిక్కలకు సెస్‌ను మినహాయించుటకు రైతు ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేర సమర్పించాలని స్పష్టంచేశారు. శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల పురోగతిలో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో సి ఎం సమీక్షించారన్నారు. ఇందుకు భాగస్వామ్యులైన సంబంధిత అధికారులను అభినందించారు. మంచిపనితీరు కనబర్చాలని మెరుగైన స్థానం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈసమావేశంలో ఇంఛార్జ్ జి ఎం గణపతి, పలాస ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ అధ్యక్షులు మల్ల రామేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, డిపివో కోటేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీరు సుదర్శనం, అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.