శ్రీకాకుళం

జిఎస్టీ ‘బాంబు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: గత సారి నోట్ల రద్దుతో దీపావళి పండుగ బోసిపోతే..ఈసారి జీఎస్టీ ఎఫెక్టుతో బాణసంచా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతేడాది నోట్ల రద్దుతో కుదేలైన బాణసంచా వ్యాపారులు ఈ ఏడాది జిఎస్టీతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకూ బాణాసంచాపై 14.5 శాతం ఉన్న వ్యాట్, ఈ ఏడాది 18 శాతానికి జిఎస్టీ పన్నుగా ఎగబాకింది. వాణిజ్యపన్నులశాఖ గణాంకాల ప్రకారం 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకూ శ్రీకాకుళం జిల్లాలో రూ. 54.72 కోట్లు మేర వ్యాపారం జరగగా పన్నుల రూపంలో రూ. 6.44 కోట్లు ఆ శాఖకు జమయ్యాయి. దీపావళి సీజన్‌లో మాత్రమే బాణసంచా అమ్మకాలు మొత్తం వ్యాపారంలో మూడోంతుల వ్యాపారం జరుగుతోందన్న విషయం తెలిసిందే. బాణాసంచాపై గతంలో అన్ని ట్యాక్స్‌లు కలిపి 14.5 శాతం ఉండగా, ఇప్పుడు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సివుంది. వ్యాపారులు ఇంత పన్ను చెల్లించాలంటే బాణసంచా ధరలూ పెంచక తప్పదు. శ్రీకాకుళంలో గతఏడాది 27 రకాల టపాసుల కలిగిన గిఫ్ట్‌బాక్స్ రూ. 500కు వచ్చేది. 30 రకాలు రూ. 650 నుంచి రూ. 700 విక్రయించేవారు. 35 రకాల బాక్స్ రూ. 1000 పలికింది. ఓ షాపు యజమాని మాట్లాడుతూ గతేడాది తాను రూ. 2 లక్షలు ఖర్చు పెట్టిన షాపునకు టాక్స్ కింద రూ. 17,500 చెల్లించానని చెప్పారు. ప్రస్తుతం జిఎస్టీ వల్ల రూ. 28 వేలు చెల్లించాల్సి వస్తుందన్నారు. షాపు పెటాటలంటే మూడు రోజులకుగాను జిల్లా అధికారులు నిర్ణయించిన స్థలంలో రూ. 20 వేలు చెల్లించాలని, షెడ్డు వేసుకోవాలంటే గతేడాది రూ. 4,000 అయితే, ఈసారి రూ. 7000 అవుతుందని చెప్పారు. లైసెన్స్ రెన్యువల్‌కు, కొత్తగా లైసెన్స్ పొందేందుకు ఫీజు రూపేణా వందల్లో ఉంటే నగరపాలకసంస్థ, అగ్నిమాపకశాఖ, పోలీసుశాఖ, రెవెన్యూశాఖలకు ఇచ్చే మొత్తమే చాలా ఎక్కువులో ఉంటోందని మరో వ్యాపారి సుస్పష్టం చేసారు. షాపు పెట్టాలంటే సగం మొత్తం పన్నులు, ఇతరత్ర ఖర్చులకే సరిపోతుందని, అయినప్పటికీ రూ. 2 లక్షల పెట్టుబడికి రూ. 50 - 70 వేల రూపాయల వరకూ ఆదాయం వచ్చేదని, ఇప్పుడు జిఎస్టీ వల్ల ఆ పరిస్థితులు లేవంటూ బాణసంచా వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో బాణాసంచా అమ్మకాలు కోసం 21 షాపులకు అనుమతులు ఇచ్చారు. ఎక్కువగా శివాకాశి నుంచి దిగుమతి అయ్యే బాణాసంచానే ఇక్కడ వ్యాపారులు బాణాసంచాను అమ్మకాలు చేస్తుంటామని చెప్పారు.
దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు తప్పసరిగా బిల్లులను కొనుగోలుదారులకు ఇవ్వాలని వాణిజ్యశాఖ అధికారులు ఇప్పటికే తాకీదులు ఇచ్చారు. అలాగే, వౌకిక ఆదేశాలు కూడా ఇచ్చారు. బిల్లులు లేకుండా అమ్మకాలు జరిపితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిఎస్టీ తప్పనసరిగా అమలు చేయాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని వాణిజ్యపన్నులశాఖ చైతన్యపరుస్తోంది. జిల్లా అంతటా 43 బాణాసంచా దుకాణాలకు దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించి అనుమతులు ఇచ్చారు. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే 32 బాణాసంచా దుకాణాలకు అనుమతులు లభించాయి. ఈ దుకాణాలన్నీ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో అనుమతులు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ ఏడాది దీపావళి మాత్రం మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు లేకుండా ‘జీఎస్టీ’ చేస్తోందనడంలో అతిశయోక్తిలేదు!