శ్రీకాకుళం

వాయుగుండం ప్రభావంపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 17: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుంఢం ప్రభావంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావం వలన 18న రాత్రి, 19న శ్రీకాకుళంజిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఒరిస్సా నుండి శ్రీకాకుళం మధ్య తీరందాటే సూచనలు ఉన్నట్లు ప్రస్తుత అంచనాలు ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అప్రమత్తం చేశారు. సమాచారం అందిన తక్షణ జిల్లా అధికారులు, జల వనరుల శాఖ ఇంజినీర్లు, మండల అధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత మండలాల్లో జాగరూకత అవసరమని ఆయన పేర్కొన్నారు. నాగావళికి ఇప్పటికే కొనిచోట్ల గండ్లు ఉన్నాయని వాటిని తక్షణం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని మడ్బువలస ప్రాజెక్టు ఇంజినీర్లను ఆదేశించారు. గండ్లు పడుటకు ఆస్కారం ఉన్న నదీపరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువలు గుర్తించి గండ్లు పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేయాలన్నారు. వంశధార పరివాహక ప్రాంతాన్ని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఒరిషాలో భారీ వర్షాల వలన వంశధార, నాగావళి నదులకు వరదలువచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ, జలవనరుల శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ ఇన్‌ఫ్లోరల్‌ను పరిశీలించి లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేయాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తగు సూచనలు అందించాలని చెప్పారు. భారీ వర్షం పడి చెరువులు, కాలువలు, నదులు, నీటి ప్రవాహంతో ఉన్నప్పుడు ఎవరు వాటిని దాటేందకు ప్రయత్నించకూడదని ఈ మేరకు ప్రజల్లో అప్రమత్తం చేయాలన్నారు. ఆర్డివోలు వ్యక్తిగత పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ట్రాన్స్‌కో, రహదారులు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, పశు సంవర్థక శాఖలు తమఅధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వద్ద నీటి మట్టం పరిస్థితిని అంచనా వేయాలని ఇంజినీర్లకు ఆదేశించారు. నీటి మట్టంపై ప్రజలకు తగు సూచనలు జారీ చేయాలని ఎటువంటి ప్రమాదకర అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో నీరు చేరుటకు అవకాశం ఉంటే ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, మండలాధికారులు, మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రేయింభవళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సామాగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. తోటపల్లిలో ప్రస్తుతం 2800 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని తోటపల్లి, పర్యవేక్షక ఇంజినీరు డోల తిరుమలరావు టెలీ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉండే ప్రాంతాల ఇంజినీర్లను అప్రమత్తం చేశామన్నారు.

కృష్ణాపురం గ్రామం ఖాళీ చేయాల్సిందే
కొత్తూరు, అక్టోబర్ 17: మండలంలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన కృష్ణాపురానికి ఈ నెల 31తేదీలోగా ఖాళీ చేయాల్సిందేనని రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు గ్రామానికి వెళ్లి తెలిపారు. మంగళవారం ఉదయం తహశీల్దార్ ఎం.సావిత్రి ఆధ్వర్యంలో పోలీస్, ఇరిగేషన్ అధికారులతో పాటు కృష్ణాపురం వెళ్లి ఈ నెల 31 నాటికి ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 27న విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు మండలంలోని కృష్ణాపురం గ్రామం తొలిసారిగా ఖాళీ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తహశీల్దార్ తెలిపారు. గ్రామంలో 140 గృహాలున్నాయి.
రహదారిని ప్రారంభించిన ప్రతిభాభారతి
రాజాం, అక్టోబర్ 17: రాజాం పట్టణంలోని పోలీస్‌స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలతో నిర్మించిన ఒన్‌వే ట్రాఫిక్ సిసి రహదారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జి కావలి ప్రతిభాభారతి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజాంను సుందర పట్టణంగా తయారు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ బి.రాము, ఎ ఇ సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్దిష్ట ప్రణాళికలతో రోడ్డు ప్రమాదాల నివారణ

శ్రీకాకుళం, అక్టోబర్ 17:నిర్దిష్ట ప్రణాలికలతో రోడ్డు ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమావేశం కలెక్టర్‌సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు, రోడ్డు ప్రమాదాలపై విశే్లషణ, కాల్ అంబులెన్స్ ప్రారంభోత్సవం, సర్వో కార్యక్రమం ద్వారా రెడ్‌క్రాస్ సభ్యులకు ప్రధమ చికిత్సపై శిక్షణ, రహదారి ప్రమాదాల నివారణపై గతసమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. అధికవేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ఓవర్‌లోడ్‌తో నడుపుతున్న ఆటోలు, ప్రైవేటు వాహనాల వలన అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులు ఆటోలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే ఆటోలపై పాఠశాలల యాజమాన్యం బాధ్యత వహించాలని ఐదుగురును మించి ఆటోల్లో ఎక్కించరాదన్నారు. డ్రైవర్ సీటు వెనుకవైపు తప్పనిసరిగా డ్రైవర్ వివరాలు, ప్రమాదం సంభవించినప్పుడు చేయాల్సిన టెలీఫోన్ వివరాలురాయాలన్నారు. దగ్గరలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో సోంపేట, పలాస ప్రాంతాల్లో ట్రామకేర్‌సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 21న ఎచ్చెర్లలో మధ్యాహ్నం 3గంటలకు రహదారి ప్రమాదాలను తగ్గింపు కార్యక్రమంపై ఆటోడ్రైవర్లపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రి వద్ద స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అపాయకర జంక్షన్ వద్ద 300మీటర్ల దూరం నుండి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 24న మందస, శ్రీకాకుళం, రాజాంలలో రోడ్డు ప్రమాదాల ప్రధమ చికిత్సపై రెడ్‌క్రాస్ ద్వారా 90మందికి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదే రోజు కాల్ అంబులెన్స్ యాప్‌ను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ నాటికి 3వేల మందికి ప్రధమ చికిత్సపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు, ఎన్ హెచ్ ఏ అధికారులు, రవాణా అధికారులు సంయుక్తంగా పనిచేసి రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ సి ఎం త్రివిక్రమవర్మ, జెసి-2 పి.రజనీకాంతారావు, ఉప రవాణా కమీషనర్ సిహెచ్ శ్రీదేవి, ఏ ఎస్పీ షరీనాభేగమ్, ఆర్ అండ్ బి ఎస్ ఐ వి.రామచంద్రరావు, ఇ ఇ సత్యన్నారాయణ, ఎన్ హెచ్ ఏ ఐ పిడి ఏ.శ్రీనివాసరావు, అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో వై.వెంకటేశ్వరరావు, 108 సిబ్బంది, పోలీసు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం
* రిజిస్ట్రార్ తులసీరావు
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: అసిస్టెంటు ప్రొఫెసర్లు నియా మకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంబేద్కర్ వర్శిటి రిజిస్ట్రార్ జి.తులసీరావు స్పష్టం చేసారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో విలేకర్లుతో మాట్లాడుతూ 33 అసిస్టెంటు ప్రొఫెసర్లు ని యామకానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. దీనికి సంబధించిన రోష్టర్ పాయింట్లును రూపొందిస్తున్నామన్నారు. రోష్టరు పాయింట్లు తయారీకి సీనియర్ ఫ్యాకల్టితో ఒక కమిటిని ఏర్పాటు చేసామన్నారు. కమిటి నివేదికలు అనంతరం అసిస్టెంటు ఫ్రోఫెసర్లు నియామకానికి సంబంధించిన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఈ నియామకాలు పూర్తి అయితే అధ్యాపకులు కొరత అధిగమించవచ్చాన్నారు. అదేవిధంగా కేంపస్‌లో ఉన్న స్పెషల్ బి.ఇడి. కోర్సుకు సంబంధించిన భర్తీకాని సీట్లుకు స్పాట్ ఎడ్మిషన్ ఈ నెల 21న నిర్వహింపజేస్తామన్నారు. 17సీట్లు భర్తీ చేయాల్సి ఉందని, దీని కోసం స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నామన్నారు. స్పెషల్ బి.ఇడి. కోర్సులో చేరేందుకు ఆశక్తి ఉన్న అభ్యర్ధులు స్పాట్ అడ్మిషన్‌కు హాజరై కౌన్సిలింగ్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలు కోసం వర్శిటి అధికారులను సంప్రదించాలన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం సామాజిక బాధ్యత
ఆమదాలవలస, అక్టోబర్ 17: ప్రతీ ఇంటా మరుగుదొడ్డి నిర్మాణం ఒక సామాజిక బాధ్యతగా చేపట్టాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏ ఎం సి ఆవరణలో నిర్వహించిన నియోజకవర్గం స్థాయి శతశాతం మరుగుదొడ్ల నిర్మాణ అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా మాట్లాడుతూ మహిళలు ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, వాటి వినియోగం ప్రతిష్టగా తీసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం ఉద్యమంలో భాగంగా మహిళా సంఘాలు, అంగన్వాడీలు, ఏ ఎన్ ఎంలు , సాక్షరభారతీ కో ఆర్డినేటర్ , ఆశావర్కర్లు, విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి ఒక ఉద్యమంలా ప్రచారం చేపట్టి మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని విప్ కోరారు. ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 29శాతం మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ఇంకా 71శాతం నిర్మాణం రానున్న మార్చి నెలాఖరునాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది కనీసం 5లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంగా స్వచ్ఛతా గ్రామాలవైపు అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళా సంఘాలు సమిష్టి కృషితో ఈ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, ఎంపిపి ప్రతినిధి శేఖర్, స్పెషల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యుఎస్ డి ఇ ఆశాలత, ఎంపిడివోలు పంచాది రాధ, అబీబ్, నియోజకవర్గంచెందిన వివిధ శాఖల అధికారులు, మండల సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: అర్హులు అందరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి స్పష్టం చేసారు. రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్నప్పటికీ ఎన్నికలు హామీల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తూ అన్ని వర్గాలు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. మంగళవారం ఫరీద్‌పేట గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఆమె మాట్లాడుతూ నెలవారీ అందజేస్తున్న సామాజిక ఫించన్లు, అర్హులకు ఇళ్లు, రేషను కార్డులు, చంద్రన్న భీమా, బి.సి.లకు పెళ్లికానుక వంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధవంతంగా అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేసేందుకే ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహింపజేసి గ్రామాల్లో స్థానికులు అందజేస్తున్న అర్జీలను అంతర్జాలంలో పొందుపరిచి ముఖ్యమంత్రి డాష్‌బోర్డుకు చేరవేస్తున్నామన్నారు. ఈ సమస్యలు ముఖ్యమంత్రి కార్యాలయం సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపడుతుందన్నారు. ఇటు వంటి అవినీతి రహిత పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించి 80శాతం మంది ఓటర్లు టి.డి.పి. కుటుంబంలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. బల్లాడ వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, వావిలపల్లి రామక్రిష్ణ, అనె్నపు భువనేశ్వరరావు, బోర సాయిరాం, జీరు రామారావు, పంచిరెడ్డి సత్యన్నారాయణ, బోర శ్రీనివాసరావు, కోటిరెడ్డి, మెండరాజారావు, కొత్తకోట అమ్మినాయుడుతదితరులు పాల్గోన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ర్యాలీ నిర్వహించారు.
బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
సీతంపేట, అక్టోబర్ 17: ప్రాథమిక స్థాయి నుంచే బాలికా విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలని రాష్ట్ర మహళా కమిషన్ సభ్యులు శ్రీవాణి అన్నారు. మంగళవారం సీతంపేట ఏజెన్సీలో పర్యటించిన కమిషన్ సభ్యులు స్థానిక ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మహిళా సంఘాలు, సెక్టోరియల్ అధికారులతో సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ అభివృద్ధికి సంబంధించి వైద్యం, ఐసిడి ఎస్, ఐకెపి శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల పాఠశాలల్లో సెక్యూరిటీ గార్డులను పెడితే బాగుంటుందని, అది కూడా మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించాలన్నారు. నేటి మహిళలంటే చిన్నచూపు ఉందని, మహిళలపై అఘాయత్యాలకు పాల్పడుతున్నారన్నారు. అంగన్‌వాడీ చిన్నారుల నుంచే మహిళలంటే గౌరవం పెంచేలా విద్యనభ్యసించాలన్నారు. బాలికల పాఠశాలల్లో వౌళిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాగా చదువుకున్న విద్యార్థులకు ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు వారు చెప్పుకొనే బాధలు ఎన్నో ఉంటాయని, దీనికి ఉపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇప్పటినుంచే ఆడపిల్లలకు రక్షణ, బాధ్యత వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. సమావేశం అనంతరం పెదరామ గ్రామంలో మహిళా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ నుంచి మెట్టుగూడ జలపాతం, ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈకార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఐటిడి ఎ పి ఒ ఎల్.శివశంకర్, ఎంపిపి సవర లక్ష్మీ, ఎంపిటిసి బిడ్డిక దమయంతినాయుడు, జిల్లా కో- ఆప్షన్ సభ్యులు సవర తోటముఖలింగం తదితర అధికారులు పాల్గొన్నారు.

కార్యకర్తలే టిడిపికి బలం: ఎంపి
పలాస, అక్టోబర్ 17: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం బ్రహ్మణతర్లాలో ఇంటింటికి తెదేపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర ఏళ్లులో తెదేపా చేపట్టిన అభివృద్ధి ఇంటింటి తెదేపా ద్వారా తెలుసుకుంటున్నామని, ప్రజలు పార్టీ పట్ల ఎంతో విధేయత ఉన్నారో అవగతమవుతుందన్నా రు. ఇదే స్పూర్తితో మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్దంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నేతల మాటలు ప్రజలు విశ్వసించరని, తెదేపా కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీషా, మండల టిడిపి అధ్యక్షుడు గంగారాం, కె.లక్ష్మణ్, సింహచలం, పాపారావు, నర్శింగరావు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.