శ్రీకాకుళం

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 21: రాజకీయ పార్టీల ఉనికికి పట్టుకొమ్మలుగా నిలిచే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారి నుంచి గ్రామ పంచాయితీ కార్యదర్శి వరకు ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరించే పనిలో బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 2 నాటికి సర్పంచ్‌లు పదవీకాలం ముగియనుంది. ఐదేళ్లు సర్పంచ్ పదవులు ముగిసిన వెంటనే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ముందస్తుసమాచారం సేకరించేందుకు అధికారులను అప్రమత్తం చేసింది. షెడ్యూల్ ప్రాప్తికి గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించేలాదిద్దుబాటు చర్యలకు దిగింది. డిసెంబర్ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని వచ్చే ఏడాది జనవరి మాసాంతానికి పోలింగ్ కేంద్రాల స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని అధికారులను ఎన్నికల కమీషన్ కోరింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ సమాచార సేకరణ పనిలో పడ్డారు. దీనిని పసిగట్టిన రాజకీయ పార్టీల నేతలు ఆయా గ్రామాల్లో పట్టు సాధించేందుకు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు రాజకీయాలు అతీతంగా నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ గ్రామాల్లో ప్రధాన పార్టీలు అనుచరులు ఈ ఎన్నికల్లో పట్టు సాధించేలా ప్రణాళికలను మండల స్థాయి నేతలు అమలు చేసేందుకు సిద్ధవౌతున్నారు. రిజర్వేషన్ కేటగిరిని ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల ఖరారు చేయడంలో కూడా ప్రధాన పార్టీ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల తరువాత మండలాలు, జిల్లా పరిషత్‌లు సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలో 1100 పంచాయతీలు 38మండలాల్లో ఉన్నాయి. వీటిని పూర్తి వివరాలను జిల్లా పంచాయితీ అధికారి రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు అందించేలా సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల అధికారులంతా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచార సేకరణలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల కమీషన్‌కు పూర్తిస్థాయి సమాచారం అందిన తరువాత ఏప్రిల్, మే నెలలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలన్న భావనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడానికి 90 రోజుల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఐదేళ్లకు ముందు పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధమ పౌరులు సుముఖిత చూపుతారా? లేకుంటే అభివృద్ధి పేరిట న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా అన్న సంశయం కూడా అధికారవర్గాల్లో , రాజకీయ నేతల్లో వ్యక్తవౌతుంది. సిటింగ్ సర్పంచ్‌లు అభివృద్ధిలో భాగంగా అనేక పనులు పూర్తి చేసినప్పటికీ వాటి బిల్లులు ప్రభుత్వం నిధులు లేమి కారణంతో చెల్లించలేదు. ఇటువంటి పాలనాపరమైన ఇబ్బందులకు సాంకేతికపరమైన అంశాలు జతకట్టే ప్రమాదం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుందా లేకుంటే వాయిదా కోరతుందా అన్ని సంశయం వ్యక్తవౌతుంది. ఇదిలా ఉండగా గ్రామాల్లో మాత్రం పంచాయితీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ఆశావాహులు వారివారి అనుచరులతో ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తుగా బంధుత్వాలు, బంధాలు సామాజిక అస్త్రాలు సమీకరణలతో రేస్‌లో ఉన్న అభ్యర్థులు ముందుకు కదులుతున్నారు. దీనిని గమనించిన ఓటరు దేవుళ్లు రచ్చబండ రాజకీయాలకు ఊపిరి పోయడంతో పల్లెల్లో ఒకింత ఉత్కంఠ ఆరంభమైంది. అధికార పార్టీ నేతలు మాత్రం పంచాయితీ ఎన్నికలను ఇప్పట్లో ప్రభుత్వం నిర్వహించదని ఆగస్టు తరువాత ప్రత్యేక అధికారుల పాలన తెరపైకి వస్తుందని పేర్కొంటున్నారు. విపక్ష నేతలు మాత్రం ఎన్నికలు జరగడం ఖాయమని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ఈ సారి అధికార పార్టీ సానుభూతి పరులను ఓడించి గ్రామస్థాయిలో వైకాపాను బలపర్చాలని సూచిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలు నేతలకు పంచాయితీ ఎన్నికలు వేడి పాకింది. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా మూడంచెల వ్యవస్థకు మొగ్గు చూపుతూ వస్తుంది. సర్పంచ్, ఎంపిపి, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి పదవులకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహించాలన్న భావనలో ఉంది. ఇదే అమలైతే ఎంపిటీసీలు, జెడ్పిటీసీ వంటి పదవులు లేకుండా ఐదంచెల వ్యవస్థ మూడంచెలకు కుదించినట్లవుతుంది. ఇప్పటికే పదవులు పందారంలో పోటీ పడుతున్న నేతలకు జెడ్పిటీసీలు, ఎంపిటీసీ పదవులు ఎత్తివేస్తే రాజకీయ పార్టీలు మరింత ఒత్తిడిని భరించకతప్పదని సీనియర్లు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పంచాయితీ ఎన్నికలపై బాబు సర్కార్ ఓ క్లారిటీ ఇచ్చే వరకు రచ్చబండ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగడం ఖాయం.

ముఖలింగేశ్వరుని దర్శనం మోక్షానికి మార్గం
* పురాణాల స్థల పుణ్యక్షేత్రం * అపురూప శిల్ప సంపద ఈ క్షేత్రం
జలుమూరు, అక్టోబర్ 21: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం మధుకేశ్వరస్వామి దర్శనం మోక్షానికి మార్గమని చరిత్ర చెబుతోంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు దేశంలో రాజులు, జమీందారులచే ప్రతిష్టించబడితే శ్రీముఖలింగంలో శివుడే ప్రత్యక్షమయ్యాడని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది. మధువృక్షం(విప్ప)నుండి స్వామి ఉద్భవించారు. ముఖం ఆకారంగా లింగం దర్శనం ఇస్తున్నందున ముఖలింగేశ్వరునిగా పిలువబడుతుంది. మధువృక్షమే లింగం కనుకకు మధుకేశ్వరస్వామిగా పిలువబడుతుంది. భీమునిచే ప్రతిష్టించబడిన భీమేశ్వరాలయం, చంద్రునిచే ప్రతిష్టించబడిన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. కరకవలస కొండపై నరనారాయణులు(అర్జునుడు, కృష్ణుడు)లు క్షేత్రపాలకులుగా ఉన్నారు. అన్ని దేవాలయాలు తూర్పు దిశగా ముఖద్వారాలు ఉండగా సోమేశ్వర ఆలయం పశ్చిమముఖద్వారం ఉండటం గొప్ప విశేషం. ఈ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
మధుకేశ్వరుని కథ:
చిత్రసేనుడు అను కోయప్రభు ఈ ప్రాంతంలో జీవనం సాగించేవాడు. ఆయనకు చిట్టి అనే భార్య ఉండేది. కొన్నాళ్ల అనంతరం చిక్కలపేరు గల జంగమస్ర్తి శ్రీశైలం నుండి కాశీపోవుటకు బయలుదేరి దారి తప్పి ఆ అరణ్యంలోనికి వచ్చి చిత్రసేనుడు కంట పడింది. ఆమె సౌందర్యానికి మోహపరవశుడై వారిరువురూ ఒకరిని ఒకరు మెచ్చుకున్నారు. మొదటి భార్య అనుమతితో చిక్కలను వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి భార్యల మధ్య చెలరేగిన కలహాగ్నితో సహనం కోల్పోయాడు. మధువృక్ష పక్షపాత వైఖరే భార్యల మధ్య పరస్పర కలహాన్ని రేకిత్తించిందని చిట్టి, చిక్కల పూజిస్తున్న వృక్షాన్ని గొడ్డలితో నరికివేశాడు. అది నేలకొరిగే తడవుగా మహాజ్వాలలు అక్కడ గల పుట్ట నుండి వెలువడ్డాయి. ‘వేనుగంగ నదీస్నానం అష్టలింగ ప్రదర్శన, ముఖలింగ ముఖందృష్ట్యా పునఃజన్మ నవిద్యతే’ వంశధార నదిలో స్నానం చేసి శివలింగాలను దర్శించి ప్రదక్షిణం చేసి ముఖలింగేశ్వరుని దర్శించినట్లయితే మోక్షం సిద్ధిస్తుందని భావం. ఇంతటి మహాక్షేత్రం ఆంధ్రా, ఇతర రాష్ట్రాల్లో ఉండకపోవవచ్చునని ఇక్కడ ఆలయ నిర్మాణాలు ఒడిషా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఆలయానికి తులతూనకంగా కనిపిస్తుంది.
ఆలయ నిర్మాణం: కళింగదేశాన్ని పాలించిన గంగ వంశీయ రాజులు రెండవ కామవర్ణునితో ముఖలింగం ఆలయం నిర్మించారు. ఈ తరువాత ఆలయం శిధిలమైనట్లు చరిత్ర చెబుతోంది. కాలగమనంలో చాలా కాలం తరువాత కళింగాధిపతిగా ప్రఖ్యాతినొందిన నాటి పర్లాకిమిడి మహారాజు విష్ణువర్దన గజపతికి స్వప్నంలో స్వామి కనిపించి నేను మధుకావృక్షకోటరంలో ఉన్నానని రేపునీవు వేటకు పోయేటప్పుడు నీకొక బంగారమైన చిలుక కనపిస్తుంది. అదే నీకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఆ పక్షి ఏ పుట్టలో దూరుతుందో అందులోనే నేను ఉంటానని మాయమైనట్లు చరిత్ర తెలుపుతోంది. అక్కడ నుండి అష్టకష్టాలతో ఆలయ నిర్మాణాన్ని పర్లాకిమిడి రాజులు నిర్మించారని నాటి నుండి నేటి వరకు ప్రధమ పూజ రాజవంశీయుల పేరిట జరగడం విశేషం. ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో అడుగడుగునా దేవునిచే ప్రతిష్టించబడిన ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం కోసం వినాలన్నా, చదవాలన్న రోజులు, పేజీలు చాలవు. 6వ శతాబ్ధంలో పాలించిన హస్తివర్ణ కాలంలో సోమేశ్వరాలయం, రెండవ వజ్రహస్త కాలంలో భీమేశ్వర ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో ప్రతీ ఏటా కార్తీకం నెలరోజులూ భక్తుల కోలాహాలంతో నిండి ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినంలో చక్రతీర్థస్నానంలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం గొప్ప విషయం.
ఇక్కడ ఉత్తర భాగంలో వారాహి అమ్మవారు కొలువైయుంది. మధుకేశ్వరుని దర్శించిన ప్రతీ భక్తుడు అమ్మను దర్శించి ఆశీస్సులు అందుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఆలయం పంచాయతన ఆలయంగా చరిత్ర చెబుతోంది.
* అరకొర సౌకర్యాలతో భక్తులు ఇబ్బందులు
మహాపుణ్యక్షేత్రంగా పురాణాల్లో చరిత్ర కలిగిన శ్రీముఖలింగంలోని పుణ్యక్షేత్రంలో సుదీర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు అనేక అసౌకర్యాలకు గురౌతున్నారు. ఇక్కడ భక్తులు ఉండేందుకు సరైన వసతులు లేనందున ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగిముఖం పెట్టడమే భాదాకరమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ క్షేత్రం అభివృద్ధిపై పరిశీలించాలని పలువురు కోరారు.

కూలిపోతున్న కల్లికోట వంతెన
నరసన్నపేట, అక్టోబర్ 21: మండలంలోని మడపాం గ్రామం వద్ద వంశదార నదిపై గతంలో నిర్మించిన కల్లికోట వంతెన వరద ప్రవాహానికి పూర్తిగా కృంగిపోయింది. ఈ వంతెన ఒక శతాబ్ధం పాటు సేవలందించిందని అయితే ఇది శిధిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా ఇదే ప్రాంతంలో రెండు నూతన వంతెనలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ వంతెన పడగొట్టకుండా అలాగే అధికారులు విడిచిపెట్టడంతో రోజురోజుకూ శిధిలావస్థకు చేరుకొని నేడు వంశదారకు వరదనీరు పోటెత్తడంతో కృంగిపోయింది. దీన్ని చూసేందుకు పరిసర గ్రామ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

వచ్చే ఏడాది జూన్ నాటికి కరకట్టల నిర్మాణం పూర్తి
* వంశధార చీఫ్ ఇంజినీరు రాజు
నరసన్నపేట, అక్టోబర్ 21: జిల్లాలోని వంశదార నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మిస్తున్న కరకట్టల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందని వంశధార చీఫ్ ఇంజినీరు ఎం.టి రాజు తెలిపారు. శనివారం మండలంలోని వంశధార నదీ ఉదృతిని పరిశీలించేందుకు గాను గెడ్డవానిపేట వద్దకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంశదార నదీ ప్రవాహ తీవ్ర తగ్గిందని పరీవాహక ప్రాంత వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ దిశగానే ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కరకట్టల నిర్మాణానికి సంబంధించి గతంలో రూ.53కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని కొన్ని కారణాల వీటి నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మరింత నిధులను పెంచుతూ కరకట్టల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ ప్రసాదరావు, ఇ ఇ అప్పారావు, డి ఆర్ డి ఏ పి డి కిషోర్‌కుమార్, తహశీల్దార్ జె.రామారావు, వంశధార రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సోషలిజం స్థాపనతో ప్రజా సమస్యలు పరిష్కారం
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 21: సోషలిజం స్థాపనతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సంఘ నాయకులు తెలిపారు. నవంబర్ సోషలిస్ట్ మహావిప్లవ శతాబ్ధి సందర్భంగా సోషిలిస్ట్ యూనిట్ సెంటర్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా 2016 నవంబర్ నుండి ఈ ఏడాది నవంబర్ 17వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించిన ఇచ్చిన పిలుపుమేరకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రాష్ట్ర పార్టీ ప్రతినిధి ప్రతీ జిల్లాలోనూ ఈ మహావిప్లవసందేశాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే శనివారం పట్టణంలో డే అండ్ నైట్ జంక్షన్ వద్ద నవంబర్ సోషలిస్ట్ మహావిప్లవ శతాబ్ధి, శత వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ గోవిందరాజులు, పార్టీ కార్యకర్తలు విజయ, విశ్వనాధ్, గోవింద్, రమణ, శేఖర్, బంగారం, మున్నా, ప్రవీన్, ఆంజనేయులు, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీసి సంక్షేమ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, గౌతు శ్యామసుందరశివాజీ, బగ్గు రమణమూర్తి, ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ కెవి ఎన్ చక్రధరబాబులు, ఎడిషనల్ ఎస్పీ షేక్ షరీనాభేగమ్ అమరవీరులకు నివాళులర్పించారు.

మనిషి ఆరోగ్యానికి సూక్ష్మపోషకాలు అవసరం
* డిఎంఅండ్‌హెచ్‌వో తిరుపతిరావు
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 21: మనిషి ఆరోగ్యవంతంగా జీవించడానికి సూక్ష్మపోషకాలకు చెందిన మూలకాలు శరీరానికి అవసరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు పేర్కొన్నారు. ప్రపంచ అయోడిన్ రుగ్మతుల నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డి ఎం అండ్ హెచ్ వో కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఏడరోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆరోగ్య పరిస్థితి జీవక్రియలపై ఆధారపడి ఉందన్నారు. జీవ క్రియలు సక్రమంగా జరగాలంటే సూక్ష్మపోషకాలకు చెందిన మూలకాలు అవసరమని చెప్పారు. ఈ మూలకాల్లో అయోడిన్ ముఖ్యమైన సూక్ష్మపోషకమన్నారు. గొంతుభాగంలో థైరాయిడ్ గ్రంధి సూక్ష్మపోషకాన్ని ఉపయోగించుకొని థైరాక్షిస్ హార్మోన్లను ఉత్పత్తి చేసి మెదడు భాగంలో ఉన్న పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుందన్నారు. దాని వలన థైరాయిడ్ స్టిమ్యుటేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ హార్మోను గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి నుండి టి 3,4హార్మోన్లను ఉత్పత్తి చేసి సక్రమంగా పనిచేయడం వలన మనిషి శరీరం పెరుగుదలతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పారు. అయోడిన్ మూలకాధారణమైన జీవక్రియలు గర్భస్త శిశువుకు,గర్భిణీ స్ర్తిలకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. పుట్టిన పిల్లల్లో అయోడిన్ లోపం ఏర్పడితే పిల్లలు పెరిగే కొద్ది చురుకుధనం, బుద్ధిమాంధ్యం ఏర్పడి సామాజిక ఆర్థిక పురోగభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయోడిన్ సాధారణ వ్యక్తికి 150మైక్రోగ్రాములు, గర్భవతి, పాలిచ్చే తల్లికి 250, పసి పిల్లల నుండి 11 నెలల వరకు 50, బాల్య దశలో ఐదు సంవత్సరాల వరకు 90, 12 సంవత్సరాల వరకు 120, 12 సంవత్సరాల పైబడిన వారికి 150 మైక్రో గ్రాముల అయోడిన్ ఇవ్వాలని చెప్పారు. ప్రతీ రోజూ తినే అన్ని రకాల ఆహార పదార్థాల్లో క్రమం తప్పకుండా అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించడం వలన అయోడిన్ లోప రుగ్మతులను నివారించవచ్చునని చెప్పారు. 2006 ప్రకారం అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని చట్టాన్ని ఉల్లంఘించి సాధారణ ఉప్పు పంపిణీ చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం శిక్షార్హులౌతారని చెప్పారు. ఈకార్యక్రమంలో అధనపు డి ఎం అండ్ హెచ్ వో వై.వెంకటేశ్వరరావు, జిల్లా సమన్వయ అధికారి మెండ ప్రవీన్, ఇమ్యూనైజేషన్ అధికారి జగన్నాధం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కరరావు, జిల్లా లెప్పర్సీ అధికారి వై.కామేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వై ఎస్ ఆర్ కుటుంబానికి అనూహ్యస్పందన
* జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 21: సెప్టెంబర్ 14 నుండి నిర్వహించిన వై ఎస్ ఆర్ కుటుంబం కార్యక్రమానికి అనూహ్యస్పందన లభించిందని జిల్లా అద్యక్షురాలు రెడ్డిశాంతి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వై ఎస్ ఆర్ కుటుంబం కార్యక్రమంలో నవరత్నాల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగిందని తెలియజేశారు. ప్రతీ గ్రామనికి వెళ్లి వారి పరిస్థితులను తెలుసుకున్నారన్నారు. అన్నివర్గాల వారికి నేనున్నానని దివంగత నేత వై ఎస్ ఆర్ పాదయాత్ర నిర్వహించి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అర్హులందరికీ పథకాలు అమలు చేశారన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ముందుకు వచ్చి అభివాదాలు చేసిన విషయం తెలియజేశారు. మంచి ఆశయం కలిగిన వ్యక్తి వై ఎస్ అని విద్యార్ధులకు ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. ప్రతీ కుటుంబానికి చేరువైన నాయకుడు వై ఎస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటి కుటుంబాలను కలుసుకోవడమే తమ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ప్రజల నమ్మకంపై చంద్రబాబు మచ్చ తెచ్చారన్నారు. ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని ఆంధ్రప్రదేశ్ విడదీయడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నారు. టిడిపి మంత్రులు తమపెట్టుబడులను హైదరాబాద్‌లో పెడుతున్నారని తెలియజేశారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులను ఆదుకోవడమే వైకాపా లక్ష్యమన్నారు.

ముందుకు కదలని స్టేడియం పనులు
* వైకాపా అధికార ప్రతినిధి ధనుంజయ్
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 21: శ్రీకాకుళంను స్మార్ట్‌సిటీగా చేస్తానని ఎంతో ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రటకనలు చేసి ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని వైకాపా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంతో గొప్పగా కోడి రామ్మూర్తి స్టేడియంను నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేసి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని పేర్కొన్నారు. స్టేడియంను నామరూపాలు లేకుండా చేశారన్నారు. యువకులు ఆటలాడేందుకు , మార్నింగ్ వాక్ చేయడానికి వచ్చేవాల్లు పడుతున్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదని తెలియజేశారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు విద్యార్థుల పాలిట యమలోకాలుగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే 40మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. బాబు వస్తే జాబ్ అనే నినాదంతో ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశపెట్టి వారి ఆశలుఅడియాసలు చేశారన్నారు. టిడిపి రాకముందు రాష్ట్రంలో అప్పు తక్కువగా ఉంటే ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ అప్పును 2.18లక్షల కోట్ల రూపాయలకు చేర్చారన్నారు. విలేఖర్ల సమావేశంలో కె ఎల్ ప్రసాద్, గంటా శ్రీనివాసరెడ్డి, ట్రేడ్ యూనియన్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ద్యేయం: ఎమ్మెల్యే
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 21: సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని స్థానిక 36వ డివిజన్‌లో శనివారం నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పేద బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేసే కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరష్కరించడమే లక్ష్యమన్నారు. అందుకే టిడిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. కరెంటు స్తంభాలు కావాలని, బోర్‌వెల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా స్పందించి అధికారులకు వెంటనే ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, డివిజన్ ఇంఛార్జ్ రోణంకి త్రిలోచన, మల్లేశ్వరరావు, కళ్యాణ్, పొందూరు రమణ, సీపాన రమ, మంత్రి సురేష్, గొల్లపల్లి లక్ష్మీ, వై.్భసవరాజు, మంగరాజు, వరలక్ష్మీ,గంగు నాగేశ్వరనరావు, ఎస్ వి రమణమాదిగ, చిట్టి నాగభూషణం, గుప్త, వెంకటరావు, కరగాన రాము, భాస్కర్, ప్రసాద్, కమల, సుశీల కవిత తదితరులు పాల్గొన్నారు.

అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి
* జెడ్పి చైర్‌పర్సన్ ధనలక్ష్మీ
ఎచ్చెర్ల, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామస్థాయిలో పనిచేయాలని జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. కేశవరావుపేట పంచాయితీ లక్ష్ముడుపేట గ్రామంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని ఆమె శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సి ఎం చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పాలనలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయన్నారు. గ్రామాలకు కావాల్సిన రహదారులు, తాగునీరు పాఠశాల భవనాలు, సిమ్మెంట్ రోడ్లు వంటి వౌలిక సదుపాయాల కల్పన మరింత ముందుకు సాగుతుందన్నారు. చంద్రన్న భీమాలో ప్రతీ ఒక్కరూ సభ్యులుగా చేరి ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే జనవరి నుంచి చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి బీసీలకు రూ.30వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.40నుంచి రూ.50వేలు వివాహ ఖర్చుల నిమిత్తంఅందజేయనుందని పేర్కొన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అర్హులకు ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనకు ప్రజలు అండగానిలిచేలా తెలుగుదేశం కుటుంబంలో 80శాతం మంది ఓటర్లు ఉండేలా గ్రామస్థాయి కేడర్ పారదర్శకంగా పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, ఎంపిపి రమణారెడ్డి, బెండుమల్లేశ్వరరావు, పి.్భమారావు, రామకృష్ణ, కొత్తకోట సురేంద్ర, పూజారి కృష్ణారావు, జీరు రామారావు, అనె్నపు భువనేశ్వరరావు, పైడి నూకరాజు, చౌదరి అవినాస్ తదితరులు ఉన్నారు.

సోలిపి నిర్వాసిత గ్రామాన్ని కూల్చేశారు
*కొండల సమీపంలో ఆశ్రమం
హిరమండలం, అక్టోబర్ 21: వంశధార రిజర్వాయర్ మూలంగా ముంపునకు గురైన సోలిపి నిర్వాసిత గిరిజన గ్రామాన్ని శనివారం భవనాలను అధికారలు కూల్చివేశారు. కొండలు ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనులు ఎగువ భాగంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి స్థల సేకరణ చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగవంతం చేపట్టేందుకు ఆటంకంగా ఉన్న భవనాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. వీటిలో భాగంగా సోలిపి గ్రామంలో 27 ఇళ్లను కూల్చివేశారు. పాలకొండ ఆర్‌డి ఒ ఆర్.గున్నయ్య, తహశీల్దార్ కాళీప్రసాద్ ఆధ్వర్యంలోని కూల్చివేత పనులను చేపట్టారు. గ్రామాన్ని ఖాళీ చేసిన గిరిజనులు రిజర్వాయర్‌కు ఎగువ భాగంలోని, సమీప కొండ దిగువ భాగంలో నివాసం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సామాగ్రీతో ఆ ప్రదేశాలకు తరలివెళ్లారు.

వంశధార తగ్గుముఖం
*వరదనీటిలో మునిగిన పంట పొలాలు *వరదనీటిని పరిశీలించిన చీఫ్ ఇంజనీర్
హిరమండలం, అక్టోబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మూలంగా ఎగువ కురిసిన వర్షాలకు వంశధార నదిలో వరదనీరు చేరింది. శనివారం నాటికి క్రమేపీ వరదనీరు తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి వంశధారలో వరదనీరు పెరుగుతూ శనివారం ఉదయం 9 గంటలు అయ్యేసరికి 70 వేల క్యూసెక్కులకు చేరింది. పది గంటల నుంచి తగ్గుముఖం పట్టడంతో సాయంత్రానికి 38,500 క్యూసెక్కుల నీటిని నది దిగువ భాగానికి అధికారులు విడిచిపెడుతున్నారు. బ్యారేజ్ వద్ద 22 గేట్లను మూడు మీటర్ల ఎత్తి నది దిగువ భాగానికి విడిచిపెట్టారు. వంశధార నదికి వచ్చిన వరదతో మండలంలోని గులుమూరు గ్రామంలో సుమారు 200 ఎకరాల వరి పంట పొలాలు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాల నుంచి వరదనీరు ప్రవహించడంతో పొట్ట దశకు చేరుకొన్న వరి ముంపునకు గురైంది. నీటి నిల్వతో పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతిని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎం.పి.రాజు గొట్టాబ్యారేజ్ వద్ద పరిశీలించారు. వరద పరిస్థితిని ఇంజనీరింగ్ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈయనతో పాటు వంశధార ఎస్ ఇ నాగేశ్వరరావు, డి ఇ ప్రభాకరరావు, ఎ ఇ ప్రతాప్ ఉన్నారు.

అక్రమంగా తరలిస్తున్న ఖైనీల లారీ స్వాధీనం
కంచిలి, అక్టోబర్ 21: బరంపురం నుంచి కంచిలి మీదుగా ఒడిస్సా, పారవాడకు తరలిస్తున్న మీరాజ్ ఖైనీ లారీని కంచిలి పోలీసులు శనివారం జాతీయరహదారి జక్కర వద్ద స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం ఇటీవల అక్రమంగా గుట్కాలు తరలిస్తున్న సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నాం జక్కర వద్ద కంచిలి ఎస్ ఐ శ్రీనివాసరావు, ఎన్‌హెచ్ పోలీసులు కలిసి పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా ఆశోక్‌లైల్యాండ్ వ్యాన్‌ను పరిశీలించగా, 651 బాక్స్‌లు సుమారు 30 లక్షల రూపాయలు విలువ చేసే ఖైనీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాశీబుగ్గ డిఎస్పీ రాఘవ విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో గుట్కాలు నిషేధించబడ్డాయని, ఎవరైనా విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్కాలు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులు రమణ, నాగేశ్వరరావు, కోటేశ్వరరావులకు డిఎస్పీ రాఘవ నగదు బహుమతులు అందజేసారు. సి ఐ సూరినాయుడు, ఎస్ ఐ భాస్కరరావులున్నారు.

గిరిజనుల అభివృద్ధికి కృషి
మెళియాపుట్టి, అక్టోబర్ 21: గిరిజనాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని పాతపట్నం ఎమ్మెల్యే కె.వెంకటరమణమూర్తి అన్నారు. శనివారం ఇంటింటా టిడిపి కార్యక్రమంలో భాగంగా నేలబొంతు, మూలనేలబొంతు, బొట్టుపల్లి, వీరాన్నపేట తదితర గిరిజన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించి అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం నేలబొంతు, ముత్యాలనేలబొంతు గ్రామాలకు సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు ఎ.రాజశేఖరరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, దేశం కార్యకర్తలు పాల్గొన్నారు.