శ్రీకాకుళం

గడువు పెరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: హంద్రీనీవా, గాలేరు ఫేజ్-1, పోలవరం ప్రాజెక్టుల మాదిరిగానే ప్రతిష్టాత్మకమైన వంశధార ప్రాజెక్టు పనులు కూడా నత్తనడకన నడుస్తోంది. పనితక్కువ ఆత్రుత ఎక్కువతో పనిచేసే అధికార పార్టీకి చెందిన రాజ్యసభసభ్యుడు కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారాలు జిల్లా అధికారులకు చివాట్లు తినిపించేలా చేస్తోంది. చిత్తశుద్ధితో వంశధార ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఆశయం మేరకు జనవరి, 5వ తేదీన అన్నదాతలకు అంకితం ఇవ్వాలన్న ఆశయంతో రిజర్వాయర్ పనులు పరుగుపెట్టిస్తున్న ఇంజనీరింగ్ అధికారులకు 87 ప్యాకేజీ పనులు అడ్డంకులు సృష్టిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వేల కోట్ల అప్పుల్లో గల ఒక కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ గడచిన మూడు సంవత్సరాల్లో 23 సాగునీటి ప్రాజెక్టుల పనులకు కాంట్రాక్టులు దక్కించుకుని రూ. 3000 కోట్లు పనులకు గుత్తేదారుడైన రాష్ట్రానికి రెండో సి.ఎంగా చెప్పుకునే రాజ్యసభసభ్యుడు శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి జీవనాడీ అయిన వంశధార ప్రాజెక్టు పనుల్లో 87 ప్యాకేజీ గుత్తే కూడా సాధించుకున్న విషయం తెలిసిందే. రాయలసీమ ప్రాజెక్టులు నత్తనడకన నడిపిస్తున్న ఆయన సబ్-కాంట్రాక్టర్లు వంశధార 87 ప్యాకేజీ పనులను కూడా అలాగే నడిపించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోజులు..నెలలు లెక్కలేసుకుంటూ సిక్కోల్ అన్నదాతలకు వంశ‘్ధర’ జనవరి 5వ తేదీ నాటికి అందించాలన్న లక్ష్యానికి మరో ఆరుమాసాలు గడువు పెంచేలా కన్పిస్తోంది. రిజర్వాయర్ పనులు జోరుగా సాగిపోతున్న తరుణంలో 87 ప్యాకేజీ పనులు నత్తనడకన నడస్తుంటే, 88 ప్యాకేజీ పనులు స్పీడెక్కడంలేదన్న అపవాదు కూడా అధికారులు గుత్తేదారుల వల్ల చివాట్లు తింటున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎం.పి.యే వంశధార 87 ప్యాకేజీ పనులకు గుత్తేదారుడు కావడంతో ఆయనపై జిల్లా మంత్రులకు నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు కొందరు సాహాసిస్తున్నప్పటికీ, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావులు మాత్రం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు భయపడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా సస్యశ్యామలం కావాలంటే అధికారులైనా, అధికార పార్టీ గుత్తేదారులైనా ఇక్కడ జరుగుతున్న పనుల్లో జాప్యాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాల్సిన మంత్రులు వెనకడుగువేయడంతో వచ్చే ఏడాది జనవరి, 5వ తేదీకి వంశధార ప్రాజెక్టు అన్నదాతలకు అంకితం ఇవ్వాలన్న బాబు ఆశయానికి అడ్డంకులు పడ్డాయి. అడ్డంగా అంచనాలు పెంచేసి, అడ్డగోలు ధనయజ్ఞానికే వంశధార పనులు ఆలస్యం అవుతుందన్న నిజం ముఖ్యమంత్రి గుర్తించకుంటే సిక్కోల్ రైతాంగానికి ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి లక్ష్యం నీరుగారిపోయేలా గుత్తేదారులు చేస్తున్న నత్తనడక ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో సి.ఎం. అధికారులను హెచ్చరించిన విషయం తెలిసిందే. కాని - రాజ్యసభ సభ్యుడు మాత్రం తన సబ్-కాంట్రాక్టర్ల ద్వారా మరో ఆరుమాసాలు ఈ పనులకు వ్యవధి కావాలంటూ హుకుం సాగునీటిపారుదల చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు గుత్తేదారుల పేరిట వంశధార తతంగాన్ని నత్తనడకన సాగిస్తున్నా ఇక్కడ మంత్రులు కూడా నోరుమెదపకపోవడంలో అంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. జిల్లా సెంటిమెంటును తెరపైకి తెచ్చి ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని సి.ఎం. హామీ నెరవేర్చుకునేలా పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా వ్యవహారించాల్సిన అచ్చెన్న, కళా వౌనం వెనుక అమరావతి పలుకుబడి ఉందని సంబంధిత ఉన్నతాధికారులే చెప్పుకుంటూ గుత్తేదారు పనులపై ఫిర్యాదులు ఇవ్వడం మానుకున్నారు. దీంతో మరో ఆరుమాసాలు వరకూ వంశధార ప్రాజెక్టు జిల్లా రైతాంగానికి అందే పరిస్థితి కన్పించడం లేదు.
జిల్లాకు జీవన‘్ధర’ వంశధార ప్రాజెక్టుకు సంబంధించి రూ. 1616.23 కోట్లకు సవరించిన అంచనాల్లో పనుల నిమిత్తం రూ. 647.90 కోట్లు నుంచి 839.10 కోట్లుకు పెరిగిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు 2005లో రూ. 933 కోట్లకు పాలనాపరమైన ఆమోదం తెలిపి, ఇందులో పరిశోధనకు రూ. 5 కోట్లు, పనులకు రూ. 647.90 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ. 273 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 8 కోట్లు కేటాయించారు. 87, 88 ప్యాకేజీలు, హిరమండలం రిజర్వాయర్ పనులుగా విభజించి ఈపీసీ పద్దతిన టెండర్లు పిలిచి పనులు గుత్తేదారులకు అప్పగించారు. 2005 నుంచి 2009 వరకూ పనులకు రూ. 185.64 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ. 219.48 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 4.74 కోట్లు వెరసి రూ. 409.86 కోట్లు ఖర్చు చేసారు. అనంతరం 2009 - 2014 వరకు చ్చిన ప్రభుత్వంలో పనుల కోసం రూ. 125.29 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ. 127.07 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 2.67 కోట్లు వెరసి మొత్తంగా రూ. 255.03 కోట్లు ఖర్చు చేసారు. మొదటి పదేళ్ళలో పనులకు రూ. 310.93 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ. 346.55 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 7.39 కోట్లు వెరసి రూ. 664.89 కోట్లు ఖర్చు చేసారు. వైఎస్సార్ హయాంలో రూ. 700 కోట్లు, ఆ తర్వాత పాలకులు మరో రూ. 180 కోట్లు ఖర్చు చేయగా 2014 తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యేసమయానికి కేవలం రూ. 54 కోట్లు పనులే మిగిలివున్నాయంటూ నీటిపారుదలశాఖ అధికారుల గణాంకాలు. 87, 88 ప్యాకేజీల్లో 33 శాతం కంటే తుక్కవగా పనులు జరగడంతో ఆ ప్యాకేజీ పనులను రద్దు చేసి ఈ-ప్రొక్రిమెంట్ ద్వారా కొత్త గుత్తేదారులకు అప్పగించారు. అంతే - అక్కడ నుంచి మొదలైంది అధికారుల పొలిటికల్ కొరఢా ఝుళిపించడం. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎం.పి. మూడేళ్ళలో 23 కాంట్రాక్టులు సాధించి రూ. 3000 కోట్లు పనులు చేపట్టే హంద్రీనీవా, గాలేరు, పోలవరం వంటి పెద్దపెద్ద ప్రాజెక్టులతోపాటు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టులో 87 ప్యాకేజీ పనులకు గుత్తేదారుగా ‘నేనే సి.ఎం.’ అంటూ అధికారులను హాడలెత్తిస్తున్నారు.