శ్రీకాకుళం

కాన్‌కాస్ట్ పరిశ్రమ తెరిపించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 23:కాన్‌కాస్ట్ పరిశ్రమ నవంబర్‌లో తెరిపించేందుకు కృషి చేస్తానని కాన్‌కాస్ట్ యాజమాన్యం ఎండి , జాయింట్ కమీషనర్ అఫ్ లేబర్ హామీ ఇచ్చారు. విశాఖపట్నం జె సి ఎల్ వద్ద కాన్‌కాస్ట్ ఎంప్లాయిస్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిటు)లతో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు మాట్లాడుతూ కాన్‌కాస్ట్ యాజమాన్యం పరిశ్రమ మూసివేయడంతో 650 కుటుంబాలు రోడ్డున పడ్డాయని 2017 మార్చి నుండి వేతన బకాయిలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జె సి ఎల్ ఎం ఎల్ వరహాలరెడ్డికి వివరించారు. కార్మిక శాఖ జోక్యం చేసుకొని వేతనాల చెల్లించాలని, పరిశ్రమ తెరిపించాలని డిమాండ్ చేశారు. జె సి ఎల్ మాట్లాడుతూ ఎండి సంజయ్‌సూరితో ఫోన్‌లో చర్చలు జరిపారు. నవంబర్‌లో పరిశ్రమ తెరిపిస్తామని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వేతనాలు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చలో యూనియన్ నాయకులు పింగలి రామచంద్రరాజు, బొడ్డేపల్లి మోహనరావు, పేడాడ శ్రీనివాస్, మొదలవలస లక్ష్మణరావు, ఎం.్భజంగరావు తదితరులు ఉన్నారు.

హుదూద్ ఇళ్లలో మర్మమేమిటి
* ప్రతిపక్ష ఆరోపణలపై స్పందించండి
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 23: బిజెపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలోని కంపోస్టు కాలనీలో హుదూద్ తుఫాన్ బాధితుల కోసం రూ.10కోట్లతో నిర్మించిన 192 ఇళ్లనిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ఇంకా ప్రారంభించకపోవడానికి కారణం ఏంటని ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందని మిత్రపక్షమైన బిజెపి నగర అధ్యక్షుడు చల్లావెంకటేశ్వరరావు అన్నారు. లబ్ధిదారులను గుర్తించకుండానే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారా అని ప్రశ్నించారు. లబ్ధిదారులను గుర్తించడం అధికారుల పని అని తెలుగుదేశం నాయకులపై పత్రికల్లో ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్నారు. జిల్లాలో మొదటిగా పూర్తి చేసుకున్న నగరంలోని హుదూద్ ఇళ్లను పండగ వాతావరణంలో ప్రారంభించకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన లబ్ధిదారుల ఎంపిక విషయంలో బిజెపి నాయకుల ప్రమేయం లేదని ఇతర పార్టీలకు బిజెపి ఉన్న తేడా ఇదేనన్నారు. లబ్ధిదారుల ఎంపికలో తేడాలు ఉంటే ఊరుకునేది లేదన్నారు. లబ్ధిదారుల జాబితాను ముందుగా ప్రకటించిన తరువాత ఇళ్లను ప్రారంభించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ వై ఎస్ ఆర్ సిపి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రశ్నించడం వరకు బాగానే ఉందని తామే లబ్ధిదారుల ఎంపిక చేసి గృహ ప్రవేశాలు చేస్తామనడం హ్యాస్యాస్పదమన్నారు. ప్రభుత్వంపై న్యాయపరమైన పోరాటాలు చేయాలే తప్ప దౌర్జన్యంతో కాదని పేర్కొన్నారు. వంతెనలు, పక్కా ఇళ్ల ప్రారంభోత్సవాలు చేయాలని కుతూహలంగా ఉంటే ముందుగా అధికారంలోనికి రావడానికి కృషి చేయాలని సలహా ఇచ్చారు. శ్రీకాకుళం నగరానికి అమృతపథకంలో బిజెపి కేంద్రప్రభుత్వం ద్వారా వందల కోట్లర రూపాయలు నిధులు వస్తున్నా అభివృద్ధి కనపించడం లేదని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపి నగర అభివృద్ధికి సహకరించాలని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా వెంకటేశ్వరరావు కోరారు.