శ్రీకాకుళం

దేవుడు మాన్యాలతో ‘మనీ’ లాండింగ్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: దేవుడు భూములతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసే మహాఘనుడు అధికార పార్టీకి రూ. కోటి విరాళంగా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడట! దీనికి జిల్లా పరిషత్‌కు చెందిన ఒక ప్రముఖనేత మధ్యవర్తిత్వంలో మంత్రి ముందు చర్చకు వెళ్తే మంతనాలు సజావుగా ముగించారన్న ప్రచారం ఊపందుకుంది. సుమారు 50000 గజాల బొందిలీపురం శ్రీ జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సఖియామఠం భూములకు ‘రియల్’రెక్కలు తొడిగేలా 22(ఎ) జాబితాపై నిషేధాజ్ఞలు ప్రభుత్వం ఎత్తేసినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్‌శాఖకు పంపింది. శ్రీకాకుళం జిల్లా నుంచి రూ.కోటి అధికార పార్టీకి ఫండ్‌గా ముట్టచెప్పేంతటి బృహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న మంత్రికి మంచి మార్కులు అధిష్టానం నుంచి పడతాయోలేదో గాని, జిల్లాలో అప్రతిష్టమాత్రం మూటకట్టుకుని రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితులు ఎదురవుతాదంటూ ప్రభుత్వ అధికారులే బాహాటంగా చెప్పుకొస్తున్నారు. దేవుడు మాన్యాలు ధనవంతులు గుప్పిట్లో పెట్టేందుకు కొంతమంది రాజకీయ నేతలు అడ్డదారులు తొక్కే బాటలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మంత్రి కూడా అడుగులు వేయడంతో అమరావతి నుంచి శ్రీకాకుళం వరకూ రియల్‌ఎస్టేట్ లాబియింగ్ ప్రచారం ఊపందుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...రూ. వేలు, లక్షలు కాదు - ఏకంగా కోటి రూపాయలు. బంపర్ ఆఫర్! అధికార పార్టీకి ఫండ్‌గానే ఇచ్చేస్తామంటూ మంతనాలు ముగించేసారు?? జిల్లాను రెండు దిక్కులుగా ఏలుబడిచేస్తున్న మంత్రుల్లో ఒకరు ఈ పనిపట్ల ఆసక్తి కనబరిచి, అమరావతి అధికారులతో సాధ్యాసాధ్యాలు చర్చించి, చివరిగా సి.ఎం.వో. పెద్దల దృష్టికి తీసుకువెళ్ళే పని సక్సెస్‌గా జరిగిపోయింది. ఈ లాబియింగ్‌లో స్థానిక ఎమ్మెల్యేకు అసలు ఈ కథే తెలియదంటూ తెగేసి చెప్పినప్పటికీ, శ్రీకాకుళం నియోజకవర్గం రాగోలు పంచాయతీకి చెందిన భూములతో వ్యాపారం చేస్తున్న రియర్టర్లు మాత్రం అధికార పార్టీ అండదండలతోనే అడుగులు వేసే దేశవాళీ ముదురులు. అందుకే - వారికి దేవుడు మాన్యాలు, మఠాల భూములు ఏవైనా ‘రియల్’వ్యాపారం చేసేస్తారు. గతంలో శ్రీకాకుళం ఆర్డీవో సాలూరు వెంకటేశ్వరరావు అమ్మకాలకు పనికిరాని జాబితాల్లోకి చేర్చేసిన భూములు వెరసి రూ. కోట్ల విలువైన రియల్‌ఎస్టేట్ వ్యాపారం గత కొనే్నళ్ళుగా ‘రాజా’ది గ్రేట్ అన్న బిరుదుతో మార్కెట్ చేస్తున్న సంస్థకు కొద్దికాలంగా రిజిస్ట్రేషన్లు ఆ భూమిపై నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కుదేలైపోయిన రియల్‌ఎస్టేట్ వ్యాపారం నెత్తిమీద జీఎస్టీ పడితే - ఆ దెబ్బల నుంచి తేరుకునేలోపే 22(ఎ) కింద రాగోలులో వ్యాపారం సాఫీగా చేసే రియల్‌ఎస్టేట్ భూములను రిజిస్ట్రేషన్లు చేయకూడదన్న నిబంధన పకడ్బంధీగా బదిలీపై వెళ్ళిపోయిన కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అమలు చేసారు. అలాగే, 1975 ల్యాండ్ సీలింగ్ సంస్కరణల చట్టం కింద కూడా కొంత భూమి ఆ రియల్టర్ ఆధీనంలో వ్యాపారం సాగిపోగా, మరికొంత అమ్మకాలు లేకుండా నిలిచిపోయింది. ముఖ్యంగా సఖియామఠం భూములు ఆ ఎస్టేట్ వ్యాపారంలో 50000 గజాలు ఉన్నట్టు అధికారులు గణాంకాలు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వాటి ధర రూ. 25 కోట్లు ఉంటోందని అంచనా. సుమారు 200 ప్లాట్‌లకు ఉడా అనుమతులు తీసుకుని, రోడ్లు, వౌలిక సదుపాయాలు, మార్కెట్ ప్రకటనలు, ప్రచారం చేసుకుని కనీసం సగం ప్లాట్‌లు కూడా రిజిస్ట్రేషన్లు జరగకుండా కలెక్టర్ లక్ష్మీనృసింహం పెన్నుపోటుతో నిలిచిపోవడంతో ఇప్పుడు తాజాగా 22(ఎ) జాబితాలో గల భూములన్నీంటిపైనా జిల్లాలో నిషేధాజ్ఞలు ఎత్తివేస్తూ కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ రిజిస్ట్రర్ కార్యాలయాలకు ఫాక్స్ ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. దేవాదాయశాఖ కొర్రిలు, బదిలీపై వెళ్ళిపోయిన కలెక్టర్ హుకుం ఏవీ పనిచేయకుండా ప్రభుత్వం ఒక్క ఉత్తర్వులతో జిల్లాలో అన్నీ 22(ఎ) జాబితాల భూములను సవరణలు చేసే అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వులు వెనుక అధికార పార్టీకి బంపర్ ఆఫర్‌గా రూ. కోటి ఇచ్చేందుకు జరిగే లాబియింగేనన్నది బహిరంగ రహస్యం. అయితే, రాగోలులో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించిన 2007-2009 సమయంలోనే 30 శాతం వరకూ ప్లాట్‌లు అమ్మకాలకు అడ్వాన్సులుగా స్వీకరించిన మొత్తాలను ఈ నిషేధాజ్ఞల వల్ల కొంతమంది కొనుగోలుదారులకు వెనక్కి ఇవ్వాల్సివచ్చింది. మొత్తం వెనక్కి ఇచ్చేలా పరిస్థితులు మారడంతో కోటి రూపాయలు పార్టీ ఫండ్ కోసం ప్రకటించడం వల్ల నష్టం లేదన్న కూడికలుతీసివేతలతో మంత్రిని సంప్రదించి, మంచిగా తన పనిని ముగించుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానప్పటికీ, మరల అడ్వాన్సుల మార్కెట్‌కు మాత్రం తలుపులు తెరిచేయడంతో అధికార పార్టీకి ఇస్తామన్న కోటి రూపాయలు సేకరణలో ప్రస్తుతం రాగోలులో దేవుడుభూములకు ‘రియల్’రెక్కలు తొడిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిషేదిత భూములను 22(ఎ) సరిచేస్తూ పది రోజుల క్రితం జాబితాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జిల్లా యంత్రాంగం పంపించడం జరిగింది. దీంతో ఐదేళ్లుగా నిషేదిత జాబితాలో ఉన్న భూములు సవరించబడ్డాయని రైతులు ఆనందపడ్డారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త జాబితాలను కంప్యూటర్‌లలో నమోదు చేసే ప్రక్రియకు సిబ్బంది ప్రక్రియ చేపట్టారు. ఇటీవల రణస్థలం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 10-1,2,3,5,7,8,9 భూమి ఎప్పటినుంచో జిరాయితీలో ఉండగా కొత్త జాబితాలో అది నిషేదిత జాబితాలోనికి వెళ్లిపోయింది. దీంతో ఆ భూస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు చెందిన జిరాయతీ భూములు కొత్తగా నిషేదిత జాబితాల్లో చేర్చడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ బాధలను వ్యక్తం చేశారు. ఒక సర్వే నెంబరులో జిరాయితీ భూమును, డీ పట్టా భూమిని సబ్‌డివిజన్ ప్రకారం వేరు చేయకుండా ఆ సర్వే నెంబర్లలో ఒక సబ్‌డివిజన్ డీ పట్టాలో ఉంటే మొత్తం సర్వే నెంబరును కొత్తగా నిషేదిత జాబితాలో చూపించడంతో చాలా మంది రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా నిషేదిత భూముల జాబితా ఏడాది క్రితమే అన్ని జిల్లాల్లో సిద్ధమైనా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం రెవెన్యూ యంత్రాంగం అలసత్వం వలన ఏడాది ఆలస్యంగా జాబితాలు తయారు చేశారు. ఇదంతా పరిశీలిస్తే - కావల్సినవారికి మాత్రమే అన్యాక్రాంతభూములు అప్పగించేందుకు చేసే సవరణే 22(ఎ)పై ఎత్తేసిన నిషేధాజ్ఞలంటూ రైతులు ఆగ్రహిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ, అవినీతి ఆర్జనకు విరాళంగా నామకరణం చేసే ప్రయత్నంలో సిక్కోల్ నేతలు ది గ్రేట్!!

సఖియామఠం భూములపై నిషేధాజ్ఞలు
*దేవాదాయశాఖ ఎ.సి. శ్యామలదేవి
శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భూముల్లో సఖియామఠానికి చెందిన దేవాదాయశాఖ భూములు ఉన్నాయంటూ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలదేవీ దృవీకరించారు. అందుకే - ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల రిజిస్ట్రేషన్‌లపై 22 (ఎ) ప్రకారం నిషేధాజ్ఞలు విధించినట్టు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. ఆ భూములు అమ్మినా, కొనుగోలు చేసిన చట్టరీత్యా నేరంగా పరిగణించామని తెలిపారు.