శ్రీకాకుళం

నీరు-ప్రగతి కోసం..సిఎం క్షేత్రస్థాయి పరిశీలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 3: రాష్టమ్రంతటా నీరు-ప్రగతి అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు బుధవారం విచ్చేస్తున్నట్టు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో సి.ఎం. బహిరంగ సభ ఏర్పాట్లు అధికారులతో పరిశీలించిన అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో ఈ నీరు-ప్రగతి సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో వాటి పనులను పరిశీలించారని, తొమ్మిదో జిల్లాగా శ్రీకాకుళం బుధవారం పరిశీలిస్తారని, పొరుగు జిల్లా విజయనగరం గురువారం పర్యటిస్తారని వివరించారు. భావితరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలన్న లక్ష్యంతో జిల్లాలో లక్ష నీటిగుంతలు తవ్వకాలు లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక ఉద్యమంలా పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చేందుకే ఆయన జిల్లా పర్యటనంటూ అచ్చెన్న వివరించారు. రాజకీయ సమీకరణాలకు, నగర ఎన్నికల వ్యూహాలకు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారా వంటి ప్రశ్నలకు మంత్రి అచ్చెన్న కొట్టిపారేశారు. కేవలం నీరు-ప్రగతి అంశంపైనే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సాగిస్తున్నారని సుస్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్టు చెప్పారు.
ఉదయం పది గంటలకు రావల్సిన సి.ఎం. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత వస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉష్టోగ్రత తీవ్రంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో నీరు-ప్రగతి పనులు పరిశీలన, ప్రారంభోత్సవాలు, అభివృద్ధికి శంకుస్థాపనలు సాయంత్రం సమయానికి మార్పులు చేసినట్టు పేర్కొన్నారు.
అనంతరం కోడిరామ్మూర్తి స్టేడియంలో నీరు-ప్రగతి సదస్సు, బహిరంగసభ ఉంటుందన్నారు. తర్వాత సప్తగిరి కల్యాణమండపంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ముఖ్యమంత్రి నిర్వహిస్తారని చెప్పారు. ఇదిలావుండగా, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్టేడియంకు చేరుకుని ఏర్పాట్లపై మంత్రితో చర్చించారు. అనంతరం కిల్లిపాలేం మంచినీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఏర్పాట్లును పరిశీలించారు. మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా, మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ చౌదరి నారాయణమూర్తి, జెసీ-2 పి.రజనీకాంతారావు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరక్టర్ తనుజారాణీ, మున్సిపల్ ఆర్డీ ఆశాలత తదితరులు ఉన్నారు.