శ్రీకాకుళం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 16: భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉన్నందున పంట నష్టం, ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫిషరీస్, ఫైర్ సర్వీసెస్, అగ్రికల్చర్ తదితర శాఖాధికారులకు తగు సూచనలు జారీ చేశామని పంట పొలాలకు నీరు చేరకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్ని ప్రాజెక్టుల కాలువలను మూసివేయడం జరిగిందన్నారు. పొలాల్లోకి చేరిన నీటిని త్వరితగతిన బయటకు పంపే ఏర్పాట్లు చేపట్టామన్నారు. మండల అధికారులు తహశీల్దార్లు, వి ఆర్వోలు, ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. పంటలను కోయరాదని, ఒక వేళ పంటలను కోసినట్లయితే వాటిని పొలాల నుండి తక్షణం తరలించి కుప్పలు పెట్టాలని రైతులకు సూచించడం జరిగిందన్నారు. ఇచ్ఛాపురం, పలాసలలో అధికవర్షాలు కురుస్తున్నందున అధికారులను మరింత అప్రమత్తం చేశామన్నారు. ఇరిగేషన్, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాన్ని సిద్దంగా ఉంచామని మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని, వలలు పడవులు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నదుల్లోకి వెళ్లరాదని హెచ్చరిక జారీ చేశారు.

నీట మునిగిన వరిచేను
సారవకోట, నవంబర్ 16: గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన చేతికి అందివచ్చిన వరిచేను నీట మునిగింది. కోత చేసిన వరిచేను పంట పొలాలలోనే ఉండటం వలన వర్షాలకు వరిచేను పూర్తిగా నీట మునగడంతో దీనిని రక్షించుకోవడానికి రైతులు పరుగులు పెడుతున్నారు. గురువారం ఉదయం సరికి మండలంలో నాలుగు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నీట మునిగిన వరిచేను పనికిరాకుండా పోతుందని ధాన్యం రంగుమారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతాలలో నీటమునిగిన వరిచేను ఒకటి రెండు రోజుల్లో మొలకలు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖాధికారి మురళీధర్ మాట్లాడుతూ పంట పొలాలలో నీటిని పూర్తిగా తగ్గించాలని సూచించారు. పంట పొలం మధ్యలో రెండుమూడుచోట్ల పాయలు తీసి నీటి నిలువలు లేకుండా చేయాలని తెలిపారు. నీటిలో మునిగిన వరిచేనుపై ఉప్పుద్రావణం చల్లాలని ఈ విధంగా చేస్తూ ధాన్యం రంగుమారకుండా ఉంటుందని అదే విధంగా తిరిగి మొలకెత్తకుండా వరిపంటను కాపాడుకోగలమన్నారు. మరో రెండుమూడు రోజుల వరకు వాతావరణంలో పరిస్థితి ఇదే విధంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా వరిచేను కోతలు చేపట్టవద్దని స్పష్టంచేశారు. ఇప్పటికే కోసిన వరిచేనును సాధ్యమైనంతవరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించారు.