శ్రీకాకుళం

రైతాంగాన్ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 16: జిల్లాలో అకాల వర్షాలకు అతలాకుతలవౌతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్లమెంటరీ అధ్యక్షులు తమ్మినేని సీతారాం కోరారు. స్థానిక వైకాపా కార్యాలయంలో గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 7లక్షల ఎకరాల్లోరైతులు పంటలు వేశారని కొన్ని చోట్ల వరిపైర్ల కోతలు పూర్తయ్యాయని గాని కొన్ని చోట్ల ఇంకా పంట కోత ప్రారంభం కాక అకాలవర్షానికి పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ధాన్యం రంగుమారే స్థితి కూడా ఏర్పడిందన్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం రెవెన్యూ, అగ్రికల్చరల్, ఇరిగేషన్ శాఖలతో కూడిన కమిటీలను వేసి పంట నష్టాన్ని సత్వరమే ప్రభుత్వానికి అందజేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందజేయాలన్నారు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు ఎంతగానో చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుదూద్, గతంలో జరిగిన ఎన్నో పంట నష్టాలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారాన్ని గాని, సహాయాన్ని కూడా నేటికీ అందజేయకపోవడం శోచనీయమన్నారు. ప్రాంతాల వారీగా పంట నష్టాలను బేరీజు వేసేందుకు వైకాపా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆ వివరాలను జిల్లా కలెక్టర్‌కు అందజేయడం జరుగుతుందన్నారు. మానవతా ధృక్పధంతో రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని తమ్మినేని అన్నారు. జిల్లాలో వర్షం ద్వారా ఇంతనష్టం జరుగుతున్నప్పటికీ జిల్లా మంత్రులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈసమావేశంలో వైకాపా నాయకులు సాదు వైకుంఠరావు, కె ఎల్ ప్రసాద్, శిమ్మ రాజశేఖర్, పొన్నాడ రుషి, ఎన్ని ధనుంజయ, జి.రమేష్, తమ్మినేని చిరంజీవినాగ్, మెంటాడ స్వరూప్‌లు పాల్గొన్నారు.

18న కారామాస్టారుకు సన్మానం
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 16:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు(కారామాస్టారు)కు ఈనెల 18న సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేస్తున్నట్లు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రధాన ఆదినారాయణ తెలిపారు. శనివారం నాలుగున్నర గంటలకు కథానిలయం విశాఖ ఏ కాలనీలో నిర్వహించే ఈ సన్మాన కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ విశే్లషకులు సాహితీ స్రవంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవధ్యక్షులు తెలకపల్లి రవి సన్మానకర్తగా, సాహితీ స్రవంతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వొర ప్రసాద్ అతిధిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా భావప్రకటన స్వేచ్ఛ ప్రతిబంధకాలు అనే అంశంపై తెలకపల్లి రవి ప్రసంగిస్తారని ఈ కార్యక్రమంలో కవుల, రచయితలు, మేధావులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.