శ్రీకాకుళం

ఘనంగా లక్ష బిల్వార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: నగరంలోని బ్యాంకర్స్ కాలనీ శివబాలాజీ ఆలయంలో గురువారం 16మంది రుత్వికులకే మంత్రోచ్ఛరణల నడుమ లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆలయ ప్రాంగాణం చిరుజల్లులతో మారుమ్రోగింది. కార్తీక బహుళ త్రయోదశి, లక్ష బిల్వార్చనతోపాటు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావు, ఆర్ వి ఎన్ శర్మ, మహేశ్ఛంద్ర సామంత్ ఆధ్వర్యంలో నేతేటి సూర్యనారాయణశర్మ, శృంగారం లక్ష్మీధనుంజయశర్మ, నేతేటి మారుతీప్రసాద్‌శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, రమేష్, బి వి ఎస్ ఎన్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. పవిత్ర కార్తీకమాసంలో ఇటువంటి మహత్తర నిర్వహణ కార్యక్రమం ఎంతో శ్రేయస్కరమని సర్వజనులకు ఎంతో శుభాలు చేకూరుతాయని ఆర్ వి ఎన్ శర్మ తెలిపారు.

జర్నలిస్టుల వృత్తి భద్రతకు ప్రత్యేక చట్టం అవసరం
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 16: జర్నలిస్టులు వ్యక్తులగా చట్టాలకు అతీతులు కాదని వృత్త్భిద్రత కోసం ప్రత్యేక చట్టం అవసరమని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు నల్లి ధర్మారావు చెప్పారు. ఒప్పటికే కర్ణాటకలో ఒక ప్రత్యేక చట్టం అమలులో ఉందన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1966 నవంబర్ 16న ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన ఆ రోజును జాతీయ పత్రికా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఆ తరువాత ఏ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ప్రధాని నెహ్రూకు సన్నిహితుడైన మానుకొండ చలపతిరావు చొరవ వలనే పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల వృత్తి భద్రత కోసం కొన్ని చర్యలు అమలు జరిగాయన్నారు. పార్లమెంట్ తొలి ప్రెస్‌కమీషన్, వేజ్‌బోర్డు, ప్రెస్‌యాక్ట్, ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు ఆయనదే కీలకపాత్ర అన్నారు. చలపతిరావు జన్మస్థలం శ్రీకాకుళం కావడం మనకెంతో గర్వకారణమన్నారు. నాగావళి తీరంలో ఉన్న చలపతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు నివాళులర్పించారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షుడు కూన పాపారావు అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో జిల్లా సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి శృంగారం ప్రసాద్, ప్రెస్‌క్లబ్ అద్యక్షులు సత్యప్రసాద్, సంయుక్త కార్యదర్శులు ఎం.వి మల్లేశ్వరరావు, శ్రీరామ్‌కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ జి.వి నాగభూషణ్, బగాది శ్రీరామమూర్తి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.