ఆంధ్రప్రదేశ్‌

అధిక ధరలకు మద్యం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోద్యం చూస్తున్న అధికారులు
* బాటిల్‌పై రూ.10నుంచి రూ.30 బాదుడు
* రహస్యంగా గొలుసు దుకాణాలు

ఆకస్మీక తనిఖీలంటూ... అమరావతి నుంచి స్వ్కాడ్‌లు హల్‌చల్ అంటూ బయటకి ఎక్సైజ్ అధికారులు రుబాబ్ చేస్తున్నా మద్యం అమ్మకాలు మాత్రం అధిక ధరలకు విక్రయించి లైసెన్స్‌దారులు దండిగా సొమ్ములు ఆర్జిస్తున్నారు. సాక్షాత్తు కమీషనర్ రంగంలోనికిన దిగినా ఎక్సైజ్‌శాఖలో అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎం ఆర్‌పి ధరలకే మద్యం అమ్మకాలు విక్రయించాలని నిబంధన జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. యంత్రాంగం కూడా పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో పలు శాఖలు చిత్తు అవడంతో నిబంధనలు షాపుల యజమానులు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 17 బార్‌లు, 238మద్యం దుకాణాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎం ఆర్ పి ధరలకు భిన్నంగానే అమ్మకాలు సాగిస్తూ మందుబాబులు జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. షాపుల వద్ద బార్‌ల మాదిరీగా షెడ్‌లు ఏర్పాటు చేసి మద్యం ప్రియులకు మరిన్ని సౌకర్యాలు సమకూర్చుతూ వీటిలో కూడా షాపు యజమానులు లాబాలార్జిస్తున్నారు. అన్ని రకాల బ్రాండ్లపై కనీసం రూ.10 నుంచి రూ.30వరకు అధనంగా వసూలు చేస్తున్నట్లు మందుబాబులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇటువంటి చీకటి వ్యాపారానికి గొడుగులా ఉండేందుకు సంబంధిత అధికారులకు ప్రతి నెల లైసెన్స్‌దారులు కొంత ముట్టజెప్పుకుంటున్నారు. సిండికేట్‌ల రూపంలో అలాగే వ్యక్తిగతంగా ఈ తంతు యదావిధిగా కొనసాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. షాపుల తనిఖీలకు వెళితే వాహనాలకు ఆయిల్ పొయ్యాలని మధ్యమధ్యలో కొంతమొత్తాన్ని ఎక్సైజ్ సిబ్బంది వసూలు చేయడం పట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చి చూసుకుంటే మద్యం బాటిల్‌ను ఎం ఆర్ పికి ప్రభుత్వం సరఫరా చేసిన వాటిలో సుమారు రూ.20లాభం ఉండేదని ఇప్పుడు ఆ మొత్తం కూడా ప్రభుత్వమే లాగేసుకుంటుందని ప్రైవేటు సంభాషణల్లో షాపుల యజమానులు సర్కారు తీరుపై గుర్రుగా ఉన్నరు. ఇటువంటి వాటిని అధిగమించేందుకు ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతీ నెల రూ.9.25కోట్లు మద్యం అమ్మకాలు షాపు యజమానులకు లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమొత్తాన్ని అధికారులకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో బహిరంగంగా మామూళ్ల పర్వం సాగించిన అధికారులు జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఎక్సైజ్ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి.లక్ష్మీనృసింహం వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు కొట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి ఓ ఉన్నతాధికారి మామూళ్ల మొత్తంతో ఏసిబి అధికారులకు పట్టుబడటం ఇందుకు ఓ తార్కాణం. ఇదిలా ఉండగా బెల్ట్‌షాపులు కూడా యధావిధిగా కొనసాగుతున్నాయి. స్క్వాడ్ జిల్లాకు వస్తుందని ముందస్తు సమాచారం కోవర్టల ద్వారా తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులే షాపుల యజమానులకు బెల్ట్ ఆపండని వౌకికంగా చెప్పేలా ప్రణాళికను అమలు చేస్తున్నారు. పాన్‌షాపుల కేంద్రంగా ప్రధాన కూడళ్లవద్ద కావాల్సిన బ్రాండ్లు ఎక్కడికక్కడే లభ్యవౌతున్నాయి. గ్రామాల్లో కూడా అనేక చోట్ల పెద్దలే వేలం పాటలు నిర్వహించి గొలుసు దుకాణాలను ప్రోత్సహించేలా ముందుకు నడిపిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇటువంటి ఆగడాలను అరికట్టేందుకు ఆకస్మీక తనిఖీలు చేపడితే మరిన్ని నిజాలు బయటపడతాయని మందుబాబులే పేర్కొంటున్నారు. అధిక ధరలతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు వేస్తున్న లైసెన్స్‌దారులపై నిఘా పెంచి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పంటకోత ప్రయోగాలతో దిగుబడి ఫలితాలు
* ఎస్ ఎస్ వో శ్రీనివాసరావు
నరసన్నపేట, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటకోత ప్రయోగాలను నిర్వహించడం జరుగుతుందని విశాఖపట్నంకు చెందిన సీనియర్ గణాంకాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మండలంలోని మడపాం గ్రామం వద్ద పంట కోత ప్రయోగాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా మూడు జిల్లాల్లో సుమారు 552 పంట కోత ప్రయోగాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ దిశగానే మండలంలో మడపాం వద్ద పంట కోత ప్రయోగాలను నిర్వహించామని తెలిపారు. దీని వివరాల ఆధారంగా పంటలు ఏ మాత్రం దిగుబడిని సాధించాయో తెలుసుకోవడమేకాకుండా పంటనష్టం భీమా పరిహారాన్ని కూడా కేటాయించడం జరుగుతుందని స్పష్టంచేశారు. మడపాం గ్రామంలోని 1001 సాంబా రకానికి చెందిన వరి పొలాల్లో 25మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రయోగాలు నిర్వహించామని సుమారు 22 బస్తాలు ఎకరాకు దిగుబడి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. గతేడాది కన్న ఈ ఏడాది దిగుబడులు భాగా తగ్గుముఖం పట్టాయని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్‌వో రమేష్‌కుమార్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

మధుకేశ్వరుని ఆదాయం రూ.9.37లక్షలు
జలుమూరు, నవంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం మధుకేశ్వరస్వామి కార్తీకమాసం ఆదాయం రూ.9,37,982 వచ్చిందని ఆలయ నిర్వాహణాధికారి సూర్యనారాయణ తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపు అనంతరం ఈ ఏడాదిలో 4 కార్తీక సోమవారాలు, ఇతర దినముల నుంచి వచ్చిన వివరాలు తెలియజేశారు. హుండీ ద్వారా రూ.4,27,346 లభించిందని, టికెట్లు, ప్రసాదం,్ఫటోలు, కేశఖండనల ద్వారా మిగిలిన ఆదాయం చేరిందని ఆయన స్పష్టంచేశారు. గత మూడేళ్లుగా దేవాదాయ శాఖకు ఆదాయం పెరుగుతూ వస్తుండటం అర్చకులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతీ ఇంటా మరుగుదొడ్లు నిర్మించాలి
* ఎంపిడివో వాసుదేవరావు
జలుమూరు, నవంబర్ 22: గ్రామంలో ప్రతీ ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని దీని కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ప్రజలు దీనిలో భాగస్వామ్యం కావాలని ఎంపిడివో పడాల వాసుదేవరావు అన్నారు. బుధవారం సుబ్రహ్మణ్యపురం, వెంకటాపురం, జోనంకి గ్రామాల్లో బృందంతో కలిసి మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించారు. ఆరుబలయ మూత్ర విసర్జన వలన కలిగే నష్టాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మరుగుదొడ్డి నిర్మించిన వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై సమావేశాలు, పరిశీలన, భూమి పూజ కార్యక్రమాలను చేపట్టారు. ఆయనతోపాటు పంచాయతీ విస్తరణాధికారి అప్పలనాయుడు, కార్యదర్శి బాబూరావు, ఆయా పంచాయతీ సర్పంచ్‌లు వెలమల రామారావునాయుడు, కూన కేశవరావు, కూన కనకరత్నం, మండల టిడిపి అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, జోనంకి ఉప సర్పంచ్ సూర్యనారాయణ, పలువురు పాల్గొన్నారు.

ఎవరెస్ట్ శిఖరం అదిరోహించేందుకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 22: యువజన సర్వీసుల శాఖ కమీషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మిషన్ ఎవరెస్ట్ పథకం కింద ఎవరెస్ట్ పర్వతం అధిరోహించేందుకు ఎంపిక కార్యక్రమం ఈనెల 26న సి పి ఆర్ అకాడమీ కేతనకొండ విజయవాడలో నిర్వహించబడునని సెట్ శ్రీ సి ఈవో ప్రసాదరావు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఆసక్తిగల యువతీ యువకులు ఈ ఎంపిక కార్యక్రమానికి ఈనెల 23 సాయంత్రం 6గంటలలోపు సి బి ఆర్ అకాడమీ కేతనకొండ విజయవాడ రిపోర్ట్ చేయల్సిందిగా కోరారు. అభ్యర్ధులు 21-35 సంవత్సరాల మధ్యవయస్సు కలిగి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. డిగ్రీ ఏదైనా విశ్వవిద్యాలయంలో చదివి ఉండాలని గ్రామీణ ప్రాంత అభ్యర్దులకు రూ.81 వేలు ఆదాయం మించరాదని, పట్టణ ప్రాంత అభ్యర్ధులకు రూ.1.03లక్షలు ఆదాయం కలిగి ఉండాలన్నారు. ఇంగ్లీష్, హిందీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యత ఉందన్నారు. పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదవ తరగతి ధృవీకరణ, నివాస దృవీకరణ ఆధార్ లేదా పాన్‌కార్డు కలిగి ఉండాలన్నారు. మెడికల్ ఫిట్‌నెస్ దరఖాస్తులు ప్రభుత్వ డాక్టర్‌చే సర్టిఫైడ్ చేయబడునన్నారు. తల్లిదండ్రులచే నిరంభ్యంతర పత్రం కూడా ఇవ్వాలని తెలియజేశారు. అభ్యర్థి ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండాలని పురుషులు వంద మీటర్ల పరుగును 16 సెకన్లలో 2.4 కిలోమీటర్ల పరుగును 10 నిముషాలలో అధిగమించాలన్నారు. లాంగ్‌జంప్ 3.65మీటర్లు చేయాలని, స్ర్తిలు వందమీటర్ల పరుగును 18 సెకన్లలో, 2.4 కిలోమీటర్ల పరుగును 13నిముషాలలో అధిగమించాలన్నారు. లాంగ్‌జంప్ 2.70 మీటర్లు చేయాలన్నారు. ఇతర వివరాలకు మురళీమోహన్ సెల్ నెం.8008989845ను సంప్రదించాలని ప్రసాదరావు తెలిపారు.

రధసప్తమి పనులకు టెండర్లు
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 22: వచ్చే ఏడాది జనవరి 24న నిర్వహించనున్న రదసప్తమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు అన్ని చర్యలకు సిద్దవౌతున్నారు. గతేడాది కంటే మరింత వైభవంగా పర్వదినాన్ని నిర్వహించేందుకు ఆలయ ఇవో శ్యామలాదేవి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు పలు కీలక పనులకు టెండరు, బహిరంగ వేలం పిలిచేందుకు నిర్ణయించారు. ఈనెల 25న టెండర్లు ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సూర్యజయంతికి ఆలయ పరిసరాల్లో సామియాలు, కార్పెట్‌లు వేసేందుకు ఆలయ ప్రాంగాణాలకు రంగులు వేయడానికి క్యూలైన్ వేసేందుకు లేబర్ విధుల్లో ఉన్న సిబ్బందికి భోజన సదుపాయాలు, టిఫిన్లు, దేవాలయంలో వ్యర్థవస్తువులు విక్రయానికి ఈనెల 17 నుండి 25న ఉదయం 9గంటల వరకు టెండరు తేదీగా నిర్ణయించారు. అలాగే అనివెట్టి మండపంలో 25న ఉదయం 10గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు వివిధ విభాగాల వారీగా టెండరు, బహిరంగ వేలం నిర్వహించడానికి నిర్ణయించారు. ఆసక్తిగల పాటదారులు కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని ఈవో శ్యామలాదేవి తెలిపారు.

కార్పొరేషన్ ఆదాయానికి గండి
* సబ్‌లీజులపేరిట అక్రమాలు
* నిరుపయోగంగా వాణిజ్య సముదాయాలు
శ్రీకాకుళం(టౌన్), నవంబర్ 22: ఎంతో ఉన్నతస్థితిలో ఉండాల్సిన శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థకు చెందిన వాణిజ్య సముదాయాల ద్వారా ఎంతో ఆదాయ వనరులు పొందాల్సి ఉండగా గత కొనే్నళ్లుగా ఆ వాణిజ్య సముదాయాలను పొందిన వ్యక్తులు పరోక్షంగా లక్షలాది రూపాయల లాభాలను పొందుతూ కార్పొరేషన్ ఆధాయానికి మొండిచేయి చూపెడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని వాణిజ్య సముదాయాలకు ప్రతీ ఏటా అద్దెల కోసం వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రక్రియ శ్రీకాకుళం కార్పొరేషన్‌లో సక్రమంగా సాగడం లేదు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు సంబంధించి పట్టణంలో 300పైగా దుకాణాలు ఉన్నాయి. అవి వాణిజ్యపరంగా ఎంతో విలువైన ఏడురోడ్ల జంక్షన్, జి.టి రోడ్, కళింగరోడ్, అంబేద్కర్ జంక్షన్‌తోపాటు పొట్టి శ్రీరాముల మార్కెట్‌ప్రాంతంలో ఉన్నాయి. ఈ వాణిజ్య సముదాయాల్లో నియమాలకు విరుద్ధంగా వేలంపాటలు నిర్వహించకుండా నామమాత్రపు అద్దె పెంపుతో అందులో ఉన్నవారికే కేటాయించడం జరుగుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పొట్టి శ్రీరాముల మార్కెట్‌లో పలు దుకాణాలు ఖాళీగా ఉండటం, అందులో కొన్ని శిధిలావస్థకు చేరుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్‌కు సంబంధించి వాణిజ్య సముదాయాల నిర్మాణంలో లోపాలు కూడా ఇవి ఖాళీగా ఉండేందుకు కారణమయ్యాయి. ఆ కారణంచేత కొంతమంది లీజుదారులు అధికారుల అండదండలతో కార్పొరేషన్ అనుమతులు లేకుండా తమ ఇష్టారాజ్యంగా దుకాణాల్లో మార్పులు, చేర్పులు చేసి వినియోగిస్తున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు స్పందించకపోవడం శోచనీయం. ఆదాయాన్ని పొందే ఎన్నో వనరులు సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ శ్రీకాకుళం నగర పాలక సంస్థపై రాజకీయ గ్రహణం ఆదాయానికి అడ్డు పడుతుంది. ఏడేళ్లుగా వినియోగంలోకి రాకుండా పొట్టి శ్రీరాముల మార్కెట్‌లో సుమారు 50 దుకాణాలు ఖాళీగా ఉన్నాయంటే దాని వలన కార్పొరేషన్ ఎంత మేరకు ఆదాయాన్ని కోల్పోయిందో అర్థవౌతుంది.

రాష్ట్రానికి తీరని అన్యాయం
* మోదీని నిలదీయలేని స్థితిలో చంద్రబాబు
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని హోదాతో సమానంగా కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటించి తరువాత ఎటువంటి సహాయం చేయకుండా మిన్నకుండటం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందని లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ తమ రాజకీయ అవసరాల దృష్ట్యా మోదీని నిలదీయలేని స్థితిలో ఉన్నారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరని పేర్కొన్నారు. ప్యాకేజీ ప్రకటించారనే పరిస్థితిలో అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయని విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏమైందో ఉత్తరాంధ్రా ఎంపిలు ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. అతీగతిలేని స్థితిలో గిరిజన యూనివర్శిటీ ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ఉత్తరాంధ్రా జిల్లాలకు శ్రీకాకుళానికి 12, విజయనగరానికి 10, విశాఖకు 13 అంశాలు ప్రకటించి చేతులు దులుపేసుకున్నారని మూడు జిల్లాల్లో నిరుపేదల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు. పల్లెల్లో ప్రజలు ఉపాధిలేక వ్యవసాయం గిట్టుబాటు కాక ఉపాధి కోసం వలసలు పోతున్నారని అయినా మనమంత్రులకు ముఖ్యమంత్రికి పట్టనట్టువ్యహరిస్తున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో 30వేల మంది సిక్కోలు మత్స్యకారులు కాండ్లా, పోర్‌బందర్, వాక, సూరత్ ప్రాంతాల్లో వలస ఓటర్లుగా ఉన్నారంటే పరిస్థితిఅర్థం చేసుకోవచ్చునని బీశెట్టి ఎద్దేవా చేశారు.చంద్రబాబు, జగన్ రాజకీయ అవసరాల కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం కేంద్రంతో పోట్లాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇంఛార్జ్ పంచాది రాంబాబు, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, ఎం.సత్యనారాయణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

డిసెంబర్ 6న పాలకమండలి సమావేశం
* మూడు డివిజన్లలో మూల్యాంకన
* ఇంఛార్జ్‌వీసి నాగేశ్వరరావు
ఎచ్చెర్ల, నవంబర్ 22: వచ్చే నెల 6న అంబేద్కర్ వర్శిటీ పాలకమండలి సమావేశం నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఇంఛార్జ్‌వీసి జి.నాగేశ్వరరావు స్పష్టంచేశారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఈ పాలకమండలి సమావేశంలో రూ.19కోట్లతో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మాణం, రూ.8కోట్లతో బాయ్స్ హాస్టల్, రూ.11కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల కొత్తగా ఏర్పాటు చేసే సైన్స్ కోర్సులకు బ్లాక్‌ల నిర్మాణానికి తీర్మాణం ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు. మూడు డివిజన్‌లలో మూల్యాంకన నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. వీటి పర్యవేక్షన బాధ్యతలను ప్రొఫెసర్ బి.అడ్డయ్యకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 20న పీజి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే అదే నెల 5,6 తేదీల్లో వర్శిటీకి అనుబంధంగా బీ ఈడి, లా కళాశాలల్లో తనిఖీలు నిర్వహించేందుకు బృందాలను పంపనున్నామని ఆయన తెలిపారు. వీసితోపాటు రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపల్ చిరంజీవులు ఉన్నారు.

వ్యూహాత్మక శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి
గార, నవంబర్ 22: కళాశాలలు స్థాయిలో మూడు రోజులు పాటు నిర్వహింపజేయనున్న వ్యూహాత్మక శిక్షణా కార్యక్రమాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సిస్టిమ్ కలాశాల కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్‌లో భాగమైన స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఇన్నోవేషన్సు ఆధ్వర్యంలో మొబలై అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై 3రోజులు శిక్షణా శిభిరాలు నిర్వహింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. 3రోజులు పాటు నిర్వహింపజేయనున్న ఈ వర్కుషాప్ నవంబర్ 23నుండి ప్రారంభం అవుతాయన్నారు. ఈ వర్కుషాపు సాంకేతిక విద్యను అభ్యసించిన వారందరికీ ఎంతగనో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ వర్కుషాపునకు మొబైల్ రంగంలో ఎంతగానో అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులు వస్తారని, విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తా
* శ్రీకాకుళం మార్కెట్ కమిటి చైర్మన్ పీస వెంకటరమణమూర్తి
గార, నవంబర్ 22: తనపై ఎంతో నమ్మకంతో నియోజక వర్గం నేతలు శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటి చైర్మన్ పదవిని కట్టబెట్టారని, నేతలు నమ్మకాన్ని వమ్ముచేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తానని శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటి చైర్మన్ పీస వెంకటరమణమూర్తి అన్నారు. స్తానిక ఆంధ్రభూమితో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటినీ ఆభివృద్ధి పథకంలో నడిపిస్తానన్నారు. 1987లో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈయన జిల్లా టెలికాం సలహా కమిటి సభ్యుడుగాను, మండల తెలుగుయువత అధ్యక్షుడుగానూ, జన్మభూమి కమిటి అధ్యక్షుడ, మండల ప్రజా పరిషత్ విప్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటి అధ్యక్షుడుగా నియమించబడ్డారు. తనకు మార్కెటింగ్ కమిటి అధ్యక్షుడుగా నియమించినందుకు గాను ఎం.పి. కింజరాపు రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, స్తానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు. అదేవిధంగా ఎం.పి.పి. గుండ అమ్మలు, మండల అధికార ప్రతినిధి గుండ భాస్కరరావు, జెడ్పీటిసి. గొండు ధాత్రిదేవి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గొండు వెంకటరమణమూర్తి, బడగల వెంకటప్పారావులు హర్షం వ్యక్తం చేసారు.