శ్రీకాకుళం

విహార యాత్రలతో మానసిక వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 23: గిరిజన బాలల విహార యాత్రను ఏర్పాటు చేస్తున్నామని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి శివశంకర్ తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్ధులకు నవంబర్ , డిసెంబర్ నెలల్లో విహార యాత్రలకు పంపించాలని నిర్ణయం మేరకు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఎచ్చెర్ల 21వ శతాబ్ధపు గురుకులం వద్ద గురువారం ఉదయం 910 మంది విద్యార్ధులను విశాఖపట్నం తీసుకువెళ్లేందుకు 20 బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. శుక్రవారం మరో 980మంది విద్యార్ధులకు విహార యాత్రలకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నెలనెల వెనె్నల అనే కార్యక్రమాన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్ధుల్లో మంచి ఆలోచన కలుగుటకు సృజనాత్మక శక్తి పెంచుటకు నైపుణ్యాభివృద్ధికి అవసరమయ్యే అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆహార పదార్ధాల నుంచి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్ధులకు ఆకాశమే హద్దుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంచి విద్యను అభ్యసించి ఉన్నతచదువులతో సమాజానికి సేవలందించే విధంగా ఎదగాలన్నారు. విజ్ఞాన యాత్రల వలన పరిశీలన ధృక్పధం అలవడుతుందని స్పష్టంచేశారు. పట్టణ ప్రాంతాలు అచ్చటప్రజల జీనవశైలి, సముద్రం, జంతు ప్రదర్శన శాల, కైలాశగిరి, న్యూ సెంట్రల్ పార్కు, ఆర్ కె బీచ్, తదితర ప్రదేశాలు చూడటం వలన మానసిక వికాసం కలుగుతుందన్నారు. విద్యార్దులను విశాఖపట్నం వరకు విహార యాత్రలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రతీ ఆదివారం 2కె రన్‌లు ప్రారంభిస్తున్నామని, చలనచిత్రాలు ప్రదర్శిస్తున్నామని, ఇంగ్లీష్, తెలుగు భాషలను అభివృద్ధి చేయుటకు చర్యలు చేపడుతున్నామన్నారు. స్వచ్ఛ్భారత్‌తోపాటు జీవన నైపుణ్యాలు పెంచుకునే మార్గాలు సమాజంలో ముఖ్యంగా మహిళల పట్ల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి వంటి కార్యక్రమాలతో వారిలో మంచి దేశ పౌరుడుగా ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిడి సీతారామయ్య, డిప్యూటీ డి ఈవో జి.రామ్మోహనరావు, ఏటి డబ్ల్యూవోలు పాల్గొన్నారు.

నైపుణ్యంపై శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి
గార, నవంబర్ 23: నైపుణ్యంపై నిర్వహింపజేస్తున్న శిక్షణా తరగతులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని శారద ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి బౌరోతు శ్రీనివాసరావు అన్నారు. మండలం అంపోలు పంచాయతీ పరిధిలోగల శారద ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్ సౌజన్యంతో ప్రారంభమైన ఈ నైపుణ్యంపై శిక్షణా తరగతులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మరియు నవకల్పన విభాగాలకు చెందిన ప్రతినిధులు క్రిష్ణ,కలగ భారతి వెంకటలక్ష్మి, యోగ ప్రియాంకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు విద్యార్ధుల యొక్క మేధకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణా తరగతులను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలభాస్కరరావు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ వెంకటస్వామిలతో పాటు విద్యార్ధులు, సిబ్బంది ఉన్నారు.