శ్రీకాకుళం

కడకెల్ల క్వారీలో విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులు తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరఘట్టం, నవంబర్ 23: మండలంలోని నడిమికెల్ల పంచాయతీ పరిధిలో కడకెల్ల గ్రామ శివారులో గ్రానైట్ క్వారీలో గురువారం విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. క్వారీ తవ్వకాలు, అమ్మకం వివరాలు తదితర దస్త్రాలు పరిశీలించారు. అలాగే ప్రస్తుతం క్వారీ వద్ద నిల్వా ఉన్న స్టాక్‌ను చిప్స్, తవ్వకాలు జరిపిన విస్తీర్ణం కూడా లెక్కలలో పొందుపరిచారు. ప్రస్తుతం 40 ఎం ఎం మెటల్, 20 ఎం ఎం చిప్స్‌ను నిల్వలను చూశారు. అనంతరం గతంలో జరిగిన ప్రమాదం సంఘటను తెలుసుకున్నారు. విజిలెన్స్ సి ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముద్ద సత్యవతి, గ్రామస్తులు ఇటీవల జరిగిన విచారణలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎస్‌పి సురేష్‌బాబు ఆదేశాలు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే విజిలెన్స్ డి ఎస్‌పి భరణిప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి వివరాలు సేకరించి నివేదికలో తమ శాఖ ఉన్నతాధికారులకు అందజేయనున్నామన్నారు. పరిధికి మించి తవ్వకాలు జరిగినట్టు రుజువైతే క్వారీ నిర్వాహకుల నుంచి అపరాధ రుసుం వసూలు చేసే అవకాశముందన్నారు. ఈయనతో పాటు మైనింగ్ శాఖ ఆర్ ఐ అన్నపూర్ణ, స్థానిక ఆర్ ఐ సన్యాసిరావు, వి ఆర్ ఒ సురేష్ తదితరులున్నారు.

ఎస్‌బి కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 23: నగరంలోని స్పెషల్ బ్రాంచ్ డీ ఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సి ఎం త్రివిక్రమవర్మ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. స్పెషల్ బ్రాంచ్, ఔట్‌డోర్, ఇండోర్ పనులు బాగున్నాయని రికార్డు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాస్‌పోర్టు ఆఫీసును పరిశీలించారు. సి ఐ లు పైడయ్య, శ్రీనివాసరావులు ఉన్నారు.