శ్రీకాకుళం

యజ్ఞాయాగాదులతో మానవాళికి ముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, నవంబర్ 23: దైవారాధన, యజ్ఞయాగాదులతో మానవాళికి ముక్తి కలుగుతుందని శ్రీరామానంద యోగాశ్రమం అధిపతి అబేదానందభారతీ, స్వామి కృష్ణచంద్రదాస్‌లు అన్నారు. గురువారం భల్లూగిరి యోగాశ్రమంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సాధు, సన్యాసి, మహిళలు, భక్తుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. యజ్ఞంతో సుఖశాంతులు, పాడిపంటలు వరిస్తాయని భక్తుల విశ్వాసం. అనంతరం శ్రీమద్ భాగవత పఠనం, విష్ణు సహస్రనామాలు, అంజనేయపారాయణాలు నిర్వహించారు. అన్నదానం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి లక్ష్మణ్, టి.కూర్మాయ్య మాస్టరు, కృష్ణమూర్తి, ఢిల్లేశ్వరరావు, అప్పయ్య, మల్లేశ్వరరావు, సూర్యం, ఎస్.నారాయణమూర్తి, బి.వెంకటరమణ, తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

అధికారులు రాజకీయాలు విడనాడాలి
సరుబుజ్జిలి, నవంబర్ 23: మండలంలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు ప్రజల ప్రతినిధులుగా పనిచేయాలి తప్ప రాజకీయ నాయకులుగా వ్యవహరించకూడదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బద్రి రామారావు వ్యాఖ్యానించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని మంజూరు చేస్తుంటే రాజకీయ పార్టీల నాయకుల కంటే ఉత్సాహంగా మండల అధికారులు నిబంధనలకు తూట్లు పొడవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా మండలంలో అర్హులైన నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మంజూరు చేయాల్సిన పింఛన్ల కేటాయింపుల్లో ఎంపిడి ఒ అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు వత్తాసు పలకడం మంచి పద్దతి కాదన్నారు. ఇటీవల సరుబుజ్జిలి మండలానికి మంజూరు చేసిన వంద పింఛన్లు లబ్ధిదారులకు ఎంపిక చేయడంలో చాలా అవకతవకలకు పాల్పడ్డారని, అటువంటి పద్దతి విడనాడాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పింఛన్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల జాబితా జన్మభూమి కమిటీ, మండల కమిటీ సమావేశం నిర్వహించి ఎంపిక చేసిన తర్వాత కూడా అనర్హుల పేర్లుతో వచ్చిన దరఖాస్తులను మరుచటి రోజు పరిగణనలోనికి తీసుకోవడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం పథకాలు అందించేటట్టు చూడాలన్నారు.