శ్రీకాకుళం

కమనీయం శివపార్వతుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 23: మండలంలోని బ్రహ్మాణతర్లా గ్రామంలో శివస్వాములు ఆథ్వర్యంలో గురువారం చేపట్టిన వేదమంత్రోచ్ఛారణల మధ్య చేపట్టిన శివపార్వతుల కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ధ్వజపతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసారు. ఉత్తరాషాడ నక్షత్రం, మకర లగ్నం, పుష్కారాంశంలో కలశలతో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. పి.రామకృష్ణాశర్మ, కపిలేశ్వరశర్మ, లోకనాధబ్రహ్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య పార్థవశివలింగానికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించి, రుద్రాభిషేకం, కుంకుమపూజలు నిర్వహించారు. శివపార్వతుల ప్రతిమలను వేదమంత్రోచ్ఛారణల మధ్య కమనీయంగా అంగరంగవైభవంగా కల్యాణం జరిగింది. ప్రజలు తిలకించారు. శివపార్వతుల ప్రతిమలను ఊరేగించారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.దేవదత్తం, జి.అప్పారావు, కె.శంకరరావు, భద్రయ్య, కూర్మారావు, బాలు, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

40 లీటర్ల నాటుసారా స్వాధీనం, వ్యక్తి అరెస్టు
పలాస, నవంబర్ 23: మండలం, శాసనం గ్రామానికి చెందిన కె.జగదీశ్వరరావు ఒడిస్సా బూర్జవాడ నుంచి 40 లీటర్లు నాటుసారాతో ద్విచక్రవాహనంపై పలాస వైపు వస్తుండగా సుబ్బుగుడ్డి జంక్షన్ వద్ద మాటుకాసి పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎస్‌ఐ ప్రభాకర్ తెలిపారు. జగదీశ్వరరావు పలాస ప్రాంతంలో నాటుసారా ప్యాకేట్లు అమ్ముతున్నట్లు సమాచారం మేరకు పట్టుకున్నామని తెలిపారు. నిందితుడును శుక్రవారం పలాస కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

తడిచి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మందస, నవంబర్ 23: తుపాన్, భారీ వర్షాలతో జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయిందని, తడిచి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకురాలు పైల చంద్రమ్మ, జయమ్మలు డిమాండ్ చేసారు. గురువారం హరిపురంలో మార్పు ట్రస్టు గ్రంథాలయంలో విలేఖరులతో వారు మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు చెల్లించాలని, గత రెండేళ్లుగా ఇన్‌ఫుట్ సబ్సిడీ ప్రభుత్వం ప్రకటించినప్పటికి రైతుల ఖాతాలో జమ కాలేదని, టెక్కలి డివిజన్ పరిధిలో రైతులకు దోమపోటు తెగుళ్లుకు 30 శాతం వ్యవసాయంలో నష్టపోయారని, బ్యాంకు రుణాలను మాఫీ చేసి, బీమాను తక్షణమే అందించాలన్నారు. మినుము, వేరుసెనగ పంటలకు నష్టం వాటిల్లిందని, క్వింటా ధాన్యం 2500 రూపాయలు ధర చెల్లించాలని, దళారులను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుల కూలీ సంఘం నాయకులు మాధవరావు, న్యూడెమోక్రసీ నాయకులు కూర్మారావు, బీమారావు, జుత్తు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.