శ్రీకాకుళం

పొలాల్లో అధికారులు * పంటనష్టంపై ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 23: ఇటీవలి బంగాళాఖాతంలో ఏర్పడ్డఅల్పపీడనం కారణంగా రాష్ట్రంలో శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఇక్కడ అధికార యంత్రాంగం కూడా 45వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్టు ప్రాధమిక నివేదికలు ప్రభుత్వానికి అందించారు. అలాగే 26 మండలాల్లో అల్పపీడన ప్రభావానికి వరి ఇతర పంటలు నష్టపోవడం వలన సంబంధిత రైతాంగానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అంచనాలు సమర్పించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు మిగిలిన శాసన సభ్యులతో వెళ్లి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. సి ఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అధికారులు కూడా పదిరోజుల్లో నష్టం అంచనాలు రూపొందించేలా పొలాల్లో సర్వే ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా విచారణ నిర్వహించి అక్కడ వాస్తవ పరిస్థితులను ఫోటోలతో సహా సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షల్లో మాత్రం 1బి రికార్డును ప్రామాణికంగా తీసుకొని సర్వే నెం.వారీగా పంట నష్టం అంచనాలు రూపొందించకుంటే భవిష్యత్‌లో తలెత్తే సమస్యలకు మీరే బాధ్యులౌతారంటూ ఓ ఉన్నతాధికారి వౌకికాదేశాలు జారీ చేసినట్లు చర్చ జరుగుతుంది. ఈ అధికారి అల్టిమేటం ఇవ్వడంతో వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు పంటనష్టం నివేదికలు రూపకల్పనలో తప్పులు దొర్లకుండా మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. నిబంధనల ప్రకారం 33శాతం కంటే అధికంగా నష్టపోతే పరిహారానికి సంబంధిత రైతులు అర్హులని సర్వే బృందాలు సుస్పష్టంచేస్తున్నాయి. ఎకరాకు 10 నుండి 12 బస్తాలు దిగుబడి వస్తే అటువంటి రైతుకు ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు చేపట్టేలా నివేదికలు రూపొందిస్తామని సుస్పష్టంచేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పూర్తిగా మొలకవచ్చి నీటిలో కుల్లిపోయిన పంటకు మాత్రమే పరిహారం వచ్చేలా సర్వే బృందాలు నష్టం అంచనాలను రూపొందించడాన్ని అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మదుపులు పెనుభారంగా మారినప్పటికీ వరిను సాగు చేస్తున్న విపత్తులు ప్రతి ఏటా నష్టాలను తెచ్చిపెడుతున్నాయని ఇటువంటి సమయాల్లో కూడా నిబంధనల పేరిట పరిహారం అందకుండా సర్కారు వైఖరి సమంజసంగా లేదని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ రైతు పరిహారంపై ఆశలు పెంచుకుని అధికారులు కోరిన 1బిరికార్డు, బ్యాంకు ఖాతా, ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ప్రతులు గ్రామాల్లో పర్యటిస్తున్న బృందాలకు అందజేస్తున్నారు. 1బి రికార్డులో ఉన్న సర్వే నెం.ప్రాప్తికి పంట నష్టపోయినట్లు పరిహారం పొందినట్లయితే మున్ముందు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇదే సర్వే నెం. సరుకు విక్రయించకుండా ఉండాలన్నదే మెళికలో ఆంతర్యమని అధికారులు అంగీకరిస్తున్నారు. పరిహారం బినామీ నెంబర్లతో పొందకుండా ఉండేందుకు ప్రభుత్వ ధనం వృదా కాకుండా అరికట్టేలా అధికారులు ముందస్తు చర్యల్లో భాగమేనని వ్యవసాయ శాఖ అధికారులు సుస్పష్టంచేస్తున్నారు. దీనిని స్థానిక ప్రజా ప్రతినిధులసైతం ససేమీరా అంటూ గ్రామంలో నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా జాబితాలు రూపొందించాలని పట్టుబడుతున్నారు. రైతులు కూడా సర్పంచ్‌లు, ఎంపిటీసీ స్థాయి ప్రజా ప్రతినిధుల వద్ద పడిగాపులు కాస్తూ వారివారి పత్రాలతో పరిహారం కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు సడలించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుంటే ప్రభుత్వం అబాసుపాలయ్యే ప్రమాదం లేకపోలేదని అధికార పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. 1బి నిబంధన సడలించి రైతుల నష్టాలను దృష్టిలో ఉంచుకొని మానవతాధృక్పధంతో పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల మావనహారం
శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 23: బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు గురువారం బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం సమాచార భవనం వద్ద మానవహారం నిర్వహించారు. ఫోరం ఆఫ్ బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ ఆలిండియా ఇచ్చిన పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా అన్ని బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయాల వద్ద ఈ నిరసన తెలియజేస్తున్నట్లు పోతల గోవిందరావు తెలిపారు. ప్రత్యేక సబ్సీడీ సెల్ టవర్స్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాధన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 1న 2015 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు మూడవ వేతన సవరణ అమలు చేయాలన్నారు. 2వ వేతన సవరణ నాటి పే- అనామిలీ సమస్య పరిష్కరించారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి గోవర్థనరావు మాట్లాడుతూ బి ఎస్ ఎన్ ఎల్ సంస్థలో ప్రత్యేక సెల్ టవర్ కంపెనీ ఏర్పాటైతే కోట్లాది రూపాయలు లైసెన్స్‌ఫీజు రూపంలో బి ఎస్ ఎన్ ఎల్ కూడా చెల్లించాల్సి వస్తుందని ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ మరింత నష్టాల్లోకి ఎత్తివేయబడుతుందని తెలిపారు. పి.వెంకటరావు, ఎం.వెంకటరావు, చరణ్, ఎన్ ఎఫ్ టి యు నుండి డి.వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, పి.రాజశేఖర్, రాంబాబు, పాణిగ్రాహి, మధు, ఎం. రమేష్, కిరణ్, లోకనాధం, బి.రాంబాబు, హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.