శ్రీకాకుళం

ఎన్నాళ్ళీ నిరీక్షణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: పదేళ్ళు ప్రతిపక్షంలో ఆటుపోట్లు ఎదుర్కొని గడిపాం.. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చి పూర్వవైభవానికి రాళ్ళెత్తిన కూలీలుగా పనిచేశాం.. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయినా జెండా మోసిన సీనియర్ కార్యకర్తలకు నామినేటేడ్ పదవులు దక్కలేదు...ఎన్నాళ్ళీ నిరీక్షణ? అంటూ జిల్లా కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. నేడు, రేపు అంటూ వాయిదాపడుతున్న నామినేటేడ్ పదవుల పందేరం తంతుకు శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని మల్లగుల్లాలు పడుతున్నారు.
జిల్లా సీనియర్ల మధ్య అగాధం
పార్టీ ఆవిర్భావం నుంచి నామినేటేడ్ పదవుల కేటాయింపులో జిల్లాకు అగ్రతాంబూలమే దక్కుతుండడంతో అదే వరవడి కొనసాగి పలు కీలక పదవులు జిల్లాకు వరిస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వీటిని తీరుస్తారంటూ పార్టీ జిల్లా సీనియర్లు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు, కూన రవికుమార్, స్థానిక శాసనసభ్యులు వద్దకు కట్టకట్టలుగా వారి బయోడేటాలు సమర్పించుకుని గడపలు ఎక్కిదిగుతున్నారు. కానీ, వీరి మధ్య అగాధం కార్యకర్తలకు శాపంగా మారింది. దీంతో అధికారంలోకి వచ్చి 24 నెలలు కావస్తున్నా పదవులు వరించకపోవడంతోపాటు, నేతల గ్రూపులతో అభద్రతాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పార్టీ సర్వసభ్యసమావేశంలో గ్రూపుల గూడుపుఠాణీలకు చెక్‌పెట్టి పాతికేళ్ళుగా పార్టీ జెండా భుజాన వేసుకున్న వారికి అండగా నిలిచేలా నామినేటేడ్ పదవుల భర్తీ నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ గంపెడు ఆశలు పెట్టుకుంది.
కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు సభాస్థలి సాక్షిగా క్యాడర్ సూచనల మేరకే పాలనాపరమైన విధానాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు ఎక్కడా కన్పించడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి జరిగిన రాష్ట్ర మహానాడులో చిన్నబాబు లోకేష్ పార్టీయే ముఖ్యమని, తర్వాతే ప్రభుత్వం అంటూ పలికిన చిలకపలుకులు ఎక్కడ వెతికినా జాడలేకుండాపోయాయన్న బాధ పసుపుదళంలో సుస్పష్టం అవుతుంది. ఇటువంటి పొంతనలేని మాటలతో రెండేళ్ళు గడిపేసిన బాబు ఇప్పటికైనా రాజకీయ ఉద్యోగాలపై దృష్టిసారించి ఒక ప్రకటన చేస్తారని సిక్కోల్ తమ్ముళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆశావాహులు ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌కు చంద్రబాబు, చిన్నబాబులకు వారివారి బయోడేటాలు సమర్పించుకున్న విషయం తెలిసిందే. కేవలం మార్కెట్ కమిటీలు నియామకాలు తప్ప మిగిలిన ఏ రాజకీయ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తమ్ముళ్ళు డీలాపడిపోయారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కుర్చీని మాత్రమే పలాస నియోజకవర్గానికి కట్టబెట్టారు. అలాగే, మార్కెట్ కమిటీలు పదవీకాలాన్ని కూడా ఏడాదికి కుదించినప్పటికీ ఇప్పటికీ నియామకాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రెండు నామినేటేడ్ ఉద్యోగాలు మాత్రమే అతికొద్దిమందికి సంతృప్తినిచ్చాయి.
ఎన్టీఆర్ హయాంలో పెద్దపీట
తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు సిక్కోల్ పుట్టినిల్లు. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి అనేక మందిని అనూహ్యంగా నామినేటేడ్ పదవులు వరించాయి.
అటువంటి నియామకాలను ఇప్పటి తమ్ముళ్ళు గుర్తుచేసుకుంటూ రాజకీయ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అధినాయకత్వం మాత్రం తాత్సారం చేస్తుందే తప్ప ఈ దిశగా అడుగులు వేసే పరిస్థితులు కన్పించడంలేదు.
‘దిద్దుబాటు’
అవసరమే...
ఇదిలా ఉండగా, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు గెలుపొందగా, రాజాం నుంచి ఓటమి చవిచూసిన కావలి ప్రతిభాభారతిని ఎమ్మెల్సీ పదవితో రాజకీయ పునరావాసం కల్పించారు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఉనికిని చాటుకునేందుకు నామినేటేడ్ నియామకాలు అవసరం. అయితే - జిల్లా అంతటా ముఠా రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. వాటిని సద్దుమణిగించేందుకు బాబు ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశం వేదిక వెనుక మంత్రి, విప్, రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా సీనియర్లతో ‘దిద్దుబాటు’ సమావేశం నిర్వహించకపోతే- రెండేళ్ళ కిందట పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి లేకపోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.