శ్రీకాకుళం

16 నుంచి రబీకి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 11: జిల్లాలో రబీ పంటకు ఈ నెల 16 నుంచి నీటిని విడుదల చేయుటకు జలవనరులశాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో రబీ పంట పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో ఈ నెల 16వ తేదీ నుంచి రబీకి నీటిని విడుదల చేయుటకు షెడ్యూల్‌ను రూపొందించినట్లు జలవనరులశాఖ ఆర్యనిర్వాహక ఇంజనీరు బి.రవీంద్ర, మడ్డువలస ప్రాజెక్టు ఇంజనీర్లు కలెక్టర్‌కు తెలిపారు. గ్రామాలకు ఏ తేదీన నీటిని విడుదల చేస్తున్నది తెలియజేయాలని జలవనరులశాఖ, వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా రబీకి నీటిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఖరీఫ్‌ను రెండు వారాలు ముందుకు తీసుకువచ్చామని వచ్చే ఏడాది మరో రెండువారాలు మ ఉందుకు తీసుకువచ్చుటకు రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ అనంతరం పొలాలు ఖాళీగా ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. అదేసమయంలో వరి పంటకు వెళ్ళరాదని రైతులను కోరారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, వేరుశనగ, రాగి, మనుము, పెసలు, ఉలవలు, మిరప, చెరకు వంటి పంటలను మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేసారు. వరికి నీటిని విడుదల చేయడం జరగదని గతంలోనూ స్పష్టం చేసిన సంగతి పునరుద్ఘాటించారు. వరి పంట వలన ఆదాయం కూడా తక్కువ మొత్తం వస్తుందని అన్నారు. మొక్కజొన్న పంట వలన ఎకరాకు రూ. 30 వేల వరకూ ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 25 వేల హెక్టార్లో మొక్కజొన్న వేయుటకు రైతులు ముందుకు వస్తున్నారని తద్వారా రూ. 300 కోట్లు మేర ఆదాయం జిల్లాలో రాగలదని ఆశాభావం వ్యక్తం చేసారు. పచ్చిరొట్ట, పశుగ్రాసం పెంచినప్పటికీ మంచి ఆదాయం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. తోటపల్లిలో 2.40 టి.ఎం.సి.ల నీటిని, మడ్డువలసలో 3.50 టి.ఎం.సి.ల నీటిని న ఇల్వ ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం అల్పపీడనం, తుపానులు సంభవించే పరిస్థితి లేదని ఇస్రో సమాచారం అందించిందని, రిజర్వాయర్లో వచ్చే ఇన్‌ఫ్లోల ఆధారంగా సామర్థ్యం మేరకు నిల్వలు ఉంచాలని ఆదేశించారు. సామర్థ్యం ప్రకారం ఉంచడం వల్ల రభీకి నీటని విడుదల చేయడంలో సమస్య ఉత్పన్నం కాదని చెప్పారు. నీటిని మొదటిసారిగా విడదల చేస్తున్నందున పక్కా ప్రణాళికలు ఉండాలని ఎక్కడా లోపాలు తలెత్తరాదని ఆయన పేర్కొన్నారు. జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు బి.రవీంద్ర మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి నీటిని విడుదల చేయుటకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. జలవనరులశాఖ సహాయ ఇంజనీర్లకు, వ్యవసాయశాఖకు గ్రామాలవారీ షెడ్యూలు అందించామని చెప్పారు. ఈ సమావేశంలో వంశధార పర్యవేక్షక ఇంజనీర్ టి.వి.శేషగిరిరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జి.రామారావు, ముఖ్యప్రణాళికాధికారి వి.ఎస్.ఎస్.ఎల్.ప్రసన్న, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రామచంద్రరావు, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకులు ఎం.ఎ.రహీమ్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బి.వి.తరుమలరావు తదితరులు పాల్గొన్నారు.