శ్రీకాకుళం

ఆత్మ ఆధ్వర్యంలో 771 రైతు ప్రదర్శన క్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 11: జిల్లాలో రబీ సాగుకు సంబంధించి రైతులకు మేలైన ఫలసాయాన్ని అందించే దిశగా ఆత్మ పరిధిలో రైతు ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశామని ఆత్మపిడి ప్రమీల అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ శాఖ ఏడి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యవసాయ శాఖ సిబ్బంది సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 771 రైతు ప్రదర్శన క్షేత్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామని దీనికి సంబంధించి రూ.2.31కోట్లతో రైతులకు సహకారం అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వం తరఫునుండి నిధులు సకాలంలో అందకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.89లక్షలను రైతులకు విడుదల చేశామని ఆమె వివరించారు. అంతేకాకుండా రాగుల పంటను విస్తృతంగా పండించే దిశగా కొత్తూరు, వీరఘట్టం, సీతంపేట మండలాలను ఎంపిక చేయడం జరిగిందని ఆమె స్పష్టంచేశారు. ఏది ఏమైనప్పటికీ రైతులకు పూర్తిసహకారాన్ని అందించే దిశగా ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని ఆమె స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి సత్యవతి, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపిడివో కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా
జలుమూరు, డిసెంబర్ 11: మండలం చినదూగాం గ్రామంలో ఉన్న ఎస్టీ కులానికి చెందిన పలువురుకు సీతంపేట ఐ టిడి ఏ వారు చిరువ్యాపారం కోసం వచ్చిన రుణాలను మండల అభివృద్ధి కార్యాలయం సిబ్బంది తమ అకౌంట్లలో నిధులు జమచేయనందున నిధులు అందేవరకు పోరాటం చేస్తామని ఆ గ్రామస్తులు సోమవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనాగరికంగా ఉన్న తమ కుటుంబాలకు చిరువ్యాపారంతో ఆదుకోవాలనే ధ్యేయంతో గిరిజనాభివృద్ధి సంస్థ రూ.5వేలు లబ్ధిదారుడు వాటాగా చెల్లిస్తే ఉచితంగా రూ.10వేలు అందజేశారని ఆ నిధులు కార్యాలయానికి చేరాయని కార్యాలయం సిబ్బంది తమతమ ఖాతాలో వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆందోలన చెందారు. ఈ విషయాన్ని ఎంపిడివో వాసుదేవరావు చర్చించగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వంశధారకు హారతి
జలుమూరు, డిసెంబర్ 11: దేవాదాయ శాఖ పిలుపుమేరకు శ్రీముఖలింగం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలో వంశదార నదికి సోమవారం సాయంత్రం నాగాహారతి ఇచ్చారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుడు గంగాదేవి తరఫున కోరుకుంటున్నట్లు అర్చక సంఘ అద్యక్షుడు పెదలింగన్న తెలిపారు.